హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Sky-Amazon: టాటాస్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఫ్రీగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్

Tata Sky-Amazon: టాటాస్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఫ్రీగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్

Tata Sky-Amazon: టాటాస్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఫ్రీగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్
(image: Amazon)

Tata Sky-Amazon: టాటాస్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఫ్రీగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ (image: Amazon)

Amazon Fire TV Stick - Tata Sky Edition | 'టాటాస్కై బింజ్' సర్వీస్‌ను ఎంచుకున్న టాటాస్కై సబ్‌స్క్రైబర్లకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ ఉచితంగా లభిస్తుంది. నెలకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది.

  మీరు టాటాస్కై డీటీహెచ్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌ను టాటా స్కై ఉచితంగా ఇవ్వనుంది. 'టాటాస్కై బింజ్' పేరుతో సరికొత్త సర్వీస్ ప్రారంభమైంది. ఈ సర్వీస్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు వీడియో స్ట్రీమింగ్ సేవల్ని టీవీలో పొందొచ్చు. ఈ సర్వీస్ తీసుకున్నవారికి ఉచితంగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌ను ఇస్తుంది టాటా స్కై. అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, సన్ నెక్స్ట్, ఎరోస్ నౌ, హంగామా ప్లే లాంటి యాప్స్‌లో కంటెంట్‌ని యూజర్లు చూడొచ్చు. అంతేకాదు... టాటాస్కై వీడియా ఆన్ డిమాండ్ లైబ్రరీ నుంచి 5000 పైగా వీడియోస్‌ని యాక్సెస్ చేయొచ్చు.  'టాటాస్కై బింజ్' సర్వీస్‌ను ఎంచుకున్న టాటాస్కై సబ్‌స్క్రైబర్లకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ ఉచితంగా లభిస్తుంది. నెలకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా ఉంటుంది. కొత్త సబ్‌స్క్రైబర్లకు అమెజాన్ ప్రైమ్ ఉచితంగా మూడు నెలలు లభిస్తుంది. ఒకవేళ ఇప్పటికే మీ దగ్గర ఫైర్ టీవీ స్టిక్ ఉన్నా టాటా స్కై నుంచి కొత్తది లభిస్తుంది. ఇంట్రడక్టరీ ప్యాక్‌లో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్, అలెక్సా వాయిస్ రిమోట్ పొందొచ్చు. అందులో టాటా స్కై బింజ్ యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఒక వేళ మీకు 'టాటాస్కై బింజ్' సర్వీస్ నచ్చకపోతే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది.


  OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్  ఇవి కూడా చదవండి:


  Ola-SBI Credit Card: 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' వచ్చేసింది...


  Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...


  Paytm Credit Card: పేటీఎం నుంచి క్రెడిట్ కార్డ్... లావాదేవీలపై క్యాష్‌బ్యాక్

  First published:

  Tags: Amazon, AMAZON INDIA, DTH, Tata Sky

  ఉత్తమ కథలు