హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky New Packs | తెలుగులో 9 క్యూరేటెడ్ ప్యాక్స్ అందిస్తోంది టాటా స్కై. తెలుగు స్మార్ట్ ప్యాక్ ధర రూ.249. తెలుగు క్యూరేటెడ్ ప్యాక్స్ ధరలు రూ.249 నుంచి రూ.906 మధ్య ఉన్నాయి.

  మీరు టాటా స్కై డీటీహెచ్ వాడుతున్నారా? ఛానెళ్ల ధరల విధానాన్ని మార్చింది టాటా స్కై. ఛానెల్ ప్యాక్స్‌తో పాటు వేర్వేరుగా ఛానెళ్లు ఎంచుకునే అలా-కార్టే విధానంలోనూ ధరల్ని మార్చింది టాటా స్కై. గతంతో పోలిస్తే ధరలు కాస్త తగ్గాయి. కొత్త ధరలు సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి వచ్చాయి. బ్రాడ్‌కాస్టర్లు సబ్‌స్క్రైబర్ల కోసం రూపొందించిన కొత్త బొకే ప్యాక్స్ అందిస్తున్న టాటాస్కై, బ్రాడ్‌క్యాస్టర్లు ఆపేసిన ప్యాక్స్‌ని తమ జాబితాలోంచి తొలగించింది. టాటా స్కై సరికొత్తగా 6 క్యూరేటెడ్ ఛానెల్ ప్యాక్స్‌ని అందిస్తోంది. వీటిని సబ్‌స్క్రైబర్స్ ఎంచుకోవచ్చు.

  Tata Sky New Plans: మారిన డీటీహెచ్ ప్లాన్స్... వివరాలు ఇవే


  తెలుగులో 9 క్యూరేటెడ్ ప్యాక్స్ అందిస్తోంది టాటా స్కై. తెలుగు స్మార్ట్ ప్యాక్ ధర రూ.249. తెలుగు క్యూరేటెడ్ ప్యాక్స్ ధరలు రూ.249 నుంచి రూ.906 మధ్య ఉన్నాయి. తెలుగు క్యూరేటెడ్ ప్యాక్స్ కోసం ఈ చార్ట్ చూడండి.


  Tata Sky New Packs, cable TV, channel package, cable tv subscription, Colors Infinity, Comedy Central, Cricket English, cricket English hd, Cricket Hindi, Cricket Hindi HD, Dish TV, DTH, tata sky, tata sky helpline, tata sky packages, tata sky customer, tata sky recharge offers, tata sky new connection, tata sky plans and packages, tata sky offers, టాటా స్కై ఆఫర్స్, టాటా స్కై ప్యాక్స్, డీటీహెచ్ ఆఫర్స్, డీటీహెచ్ ప్లాన్స్, టాటా స్కై ప్యాకేజెస్, టాటా స్కై, డీటీహెచ్
  image: Tata Sky


  ఇప్పటివరకు టాటా స్కై స్పోర్ట్స్ ఛానెల్ ప్యాక్స్‌లో క్రికెట్ హిందీ, క్రికెట్ హిందీ హెచ్‌డీ, క్రికెట్ ఇంగ్లీష్, క్రికెట్ ఇంగ్లీష్ హెచ్‌డీ, క్రికెట్ లగాతార్ ఇంగ్లీష్, క్రికెట్ లగాతార్ హిందీ మాత్రమే ఉండేవి. కొత్త స్పోర్ట్స్‌ ప్యాక్‌లో 13 ఛానెళ్లను రూ.139 ధరకే అందిస్తోంది టాటా స్కై. స్పోర్ట్స్ హెచ్‌డీ ప్యాక్ ధర రూ.181. గుజరాతీ లైట్ ప్యాక్‌ను 66 ఛానెళ్లతో రూ.146 ధరకే అందిస్తోంది టాటా స్కై. 68 ఛానెళ్ల గుజరాతీ లైట్ హెచ్‌డీ ప్యాక్ ధర రూ.239 మాత్రమే. 62 ఛానెళ్ల ఒడియా లైట్ ప్యాక్‌ ధర రూ.167 కాగా, 68 ఛానెళ్ల ఒడియా లైట్ హెచ్‌డీ ప్యాక్ ధర రూ.262.


  మేజర్ బ్రాడ్‌క్యాస్టర్స్ టీవీ18, వయాకామ్18, జీ, స్టార్ ఇండియా కూడా బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్స్‌లో మార్పులు చేయడం మరో విశేషం. 50 ఛానెళ్ల ప్యాక్స్‌ పేరును టీవీ18 మార్చడంతో పాటు, అందులో 8 ఛానెల్ ప్యాక్స్ ధర తగ్గింది. కలర్స్ వాలా హిందీ ఫ్యామిలీ బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్ ఇంతకుముందు రూ.41.30 ఉండగా, ఇప్పుడు రూ.35.40 ధరకే తీసుకోవచ్చు. 'కలర్స్ వాలా' బ్రాండింగ్‌తో 47 సరికొత్త బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్స్‌ని రూపొందించింది టీవీ18. ఇలాగే జీ బ్రాడ్‌క్యాస్టర్ కూడా ధరల్ని మార్చింది. జీ ప్రైమ్ ఇంగ్లీష్ ప్యాక్ ధర గతంలో రూ.29.50 కాగా, ప్రస్తుత ధర రూ.17.70. స్టార్ ఇండియా 43 బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్స్‌ని తొలగించి అన్ని భాషల్లో 100 కొత్త బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్స్ రూపొందించింది. డిస్కవరీ కూడా తమిళ భాష ఛానెళ్లతో కొత్త బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్ రూపొందించింది. ప్యాక్స్ కాకుండా వేర్వేరుగా అలా-కార్టే పద్ధతిలో ఛానెళ్లు ఎంచుకునే వారి కోసం 22 ఛానెళ్ల ధరల్ని తగ్గించింది టాటా స్కై.


  Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3


  ఇవి కూడా చదవండి:


  SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే జాగ్రత్త


  Minimum Balance: బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ లెక్కించేది ఇలాగే...


  LIC New Jeevan Nidhi: ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి పెన్షన్ ప్లాన్‌తో ఎంత లాభం?

  First published:

  Tags: DTH, TRAI

  ఉత్తమ కథలు