హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Sky: కొత్త సెట్ టాప్ బాక్స్ రిలీజ్ చేసిన టాటా స్కై... అమెజాన్ ప్రైమ్ ఫ్రీ

Tata Sky: కొత్త సెట్ టాప్ బాక్స్ రిలీజ్ చేసిన టాటా స్కై... అమెజాన్ ప్రైమ్ ఫ్రీ

Tata Sky: టాటా స్కై నుంచి కొత్త సెట్ టాప్ బాక్స్... అమెజాన్ ప్రైమ్ ఉచితం
(image: Tata Sky)

Tata Sky: టాటా స్కై నుంచి కొత్త సెట్ టాప్ బాక్స్... అమెజాన్ ప్రైమ్ ఉచితం (image: Tata Sky)

Tata Sky binge+ | టాటా స్కై బింజ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ 30 రోజులు ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ 3 నెలలు ఉచితం.

టాటా స్కై సరికొత్త సెట్ టాప్ బాక్స్‌ని లాంఛ్ చేసింది. ఆండ్రాయిడ్‌తో పనిచేసే 'టాటా స్కై బింజ్+' సెట్ టాప్ బాక్స్‌ను ఇండియాకు పరిచయం చేసింది టాటా స్కై. ఈ సెట్ టాప్ బాక్స్ ధర రూ.5,999. ఈ సెట్ టాప్ బాక్స్ తీసుకున్నవారు టీవీ ఛానెళ్లతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్‌ని కూడా ఒకేస స్క్రీన్‌పై చూడొచ్చు. ఈ సెట్ టాప్ బాక్స్ ఆండ్రాయిడ్ టీవీతో పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఉంది. గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్ కూడా ఉంటుంది. 5000 యాప్స్, గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి. హాట్‌స్టార్, సన్ నెక్స్ట్‌, ఎరోస్ నౌ, జీ5, హంగామా ప్లే లాంటి యాప్స్ ప్రీఇన్‌స్టాల్ అయి ఉంటాయి.

ఇప్పటికే ఎయిర్‌టెల్ నుంచి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్, డిష్ స్మార్ట్ హబ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వీటి ధర రూ.3,999 మాత్రమే. కానీ టాటా స్కై బింజ్+ సెట్ టాప్ బాక్స్ ధర రూ.5,999. అయితే 'టాటా స్కై బింజ్+' తీసుకున్నవారికి టాటా స్కై బింజ్ సబ్‌స్క్రిప్షన్ 30 రోజులు ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత నెలకు రూ.249 చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ 3 నెలలు ఉచితం. ఆ తర్వాత నెలకు రూ.129 లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.

కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Jio Wi-Fi Calling: మీ స్మార్ట్‌ఫోన్‌లో 'జియో వైఫై కాలింగ్' కోసం సెట్టింగ్స్ మార్చండి ఇలా


Jio Plans: ఈ రీఛార్జ్ ప్లాన్స్‌తో మొబైల్ డేటా ఎక్కువ వాడుకోవచ్చు

SBI Account: ఈ ఒక్క అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఎన్నో లాభాలు... తెలుసుకోండి

First published:

Tags: DTH, Tata Sky

ఉత్తమ కథలు