Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ప్రోమో కోడ్స్‌తో కొత్త ఆఫర్స్ పొందండి

Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ప్రోమో కోడ్స్‌తో కొత్త ఆఫర్స్ పొందండి

Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ప్రోమో కోడ్స్‌తో కొత్త ఆఫర్స్ పొందండి
(ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ప్రోమో కోడ్స్‌తో కొత్త ఆఫర్స్ పొందండి (ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky Discount and Cashback Offers | టాటా స్కై సెట్ టాప్ బాక్సులు, రీఛార్జ్ ప్లాన్స్‌పై డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ప్రకటించింది. ఏఏ ప్రోమో కోడ్స్ ఉపయోగించాలో తెలుసుకోండి.

టాటా స్కై యూజర్లకు శుభవార్త. అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది టాటాస్కై. ఇప్పటికే కనెక్షన్ తీసుకున్నవారితో పాటు కొత్తగా డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి ఆఫర్స్ ప్రకటించింది. సెట్ టాప్ బాక్స్ నుంచి రీఛార్జ్ వరకు అనేక ఆఫర్స్ ప్రకటించింది. ఎంచుకునే ఆఫర్స్‌కు తగ్గట్టుగా బెనిఫిట్స్ ఉన్నాయి. టాటా స్కై బింజ్+ సెట్ టాప్ బాక్స్ తీసుకునేవారికి ప్రీమియం యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా అందిస్తోంది. సెట్ టాప్ బాక్సులపై రూ.400 వరకు డిస్కౌంట్, రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ప్రకటించింది. మరి కొత్తవారితో పాటు ప్రస్తుత టాటాస్కై యూజర్లు ఈ ఆఫర్స్ ఎలా పొందాలో, వారికి ఎలాంటి ఆఫర్స్ వర్తిస్తాయో తెలుసుకోండి.

Tata Sky Binge+ Set-Top Box: టాటాస్కై బింజ్+ సెట్‌టాప్ బాక్స్ అసలు ధర రూ.5,792. కానీ ఆఫర్ ధర రూ.2,499 మాత్రమే. ప్రస్తుత టాటా స్కై సబ్‌స్క్రైబర్లు బింజ్+ సెట్‌టాప్ బాక్స్‌ను రూ.1,999 చెల్లించి పొందొచ్చు. ఈ సెట్ టాప్ బాక్స్ తీసుకుంటే డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం, సోనీలివ్, జీ5, వూట్ సెలెక్ట్, క్యూరియాసిటీస్ట్రీమ్, వూట్ కిడ్స్, ఎరోస్ నౌట్, సన్‌నెక్స్‌ట్, హంగామా ప్లే, షెమారూమీ లాంటి 10 ప్రీమియం యాప్స్ ఒక నెల సబ్‌స్క్రిప్షన్ ఉచితం. మూడు నెలలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా పొందొచ్చు. ఇక TSKY200 ప్రోమో కోడ్ ఉపయోగిస్తే అదనంగా రూ.200 తగ్గింపు లభిస్తుంది.

JioFiber: గుడ్ న్యూస్... జియోఫైబర్ ప్లాన్స్‌పై 30 రోజులు అదనంగా వేలిడిటీ

Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Tata Sky HD Set-Top Box: టాటా స్కై హెచ్‌డీ సెట్‌టాప్ బాక్స్ అసలు ధర రూ.1,599. ఆఫర్ ధర రూ.1,499. 500 పైగా ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు. దీంతో పాటు టాటా స్కై కుకింగ్, టాటా స్కై ఫిట్‌నెస్, టాటా స్కై మ్యూజిక్, టాటా స్కై సీనియర్స్ లాంటి టాటా స్కై సర్వీసెస్ యాక్సెస్ చేయొచ్చు. TSKY150 ప్రోమో కోడ్ ఉపయోగిస్తే రూ.150 డిస్కౌంట్ లభిస్తుంది.

Tata Sky+ HD Set-Top Box: టాటా స్కై+ హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్ ధర రూ.4,999. TSKY400 ప్రోమో కోడ్ ఉపయోగిస్తే రూ.400 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్‌తో హై డెఫినిషన్ వీడియోస్ చూడొచ్చు. 625 గంటలపాటు లైవ్ టీవీ రికార్డ్ చేయొచ్చు.

Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.10,999 ధరకే సొంతం చేసుకోండి... ఈ ఆఫర్ వారికి మాత్రమే

POCO X3 Price Cut: కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది

Tata Sky Recharge Offers: ఇక టాటా స్కై రీఛార్జులపైనా ఆఫర్స్ ఉన్నాయి. టాటా స్కై స్పెషల్ ఆఫర్‌లో భాగంగా 12 నెలల పాటు రీఛార్జ్ చేస్తే ఒక నెల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. టాటా స్కై పోర్టల్ లేదా టాటా స్కై మొబైల్ యాప్‌లో రీఛార్జ్ చేస్తే ఫ్రీ కూపన్స్ కూడా వస్తాయి. ఫ్రీఛార్జ్‌లో రూ.200 రీఛార్జ్ చేస్తే రూ.20 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొబీక్విక్‌తో రూ.300 పైన ఎంతైనా రీఛార్జ్ చేస్తే రూ.50 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇందుకోసం MKTSKY ప్రోమోకోడ్ ఉపయోగించాలి. ఇక లేజీపేతో కనీసం రూ.349 రీఛార్జ్ చేస్తే రూ.75 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు 12 నెలలకు ఒకేసారి రీఛార్జ్ చేస్తే 2 నెలలు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.


Tata Sky Refer & Earn: టాటా స్కై రిఫర్ & ఎర్న్ కూడా ప్రకటించింది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు టాటా స్కై రిఫర్ చేస్తే మీరు రూ.200 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

First published:

Tags: DTH, Tata Sky

ఉత్తమ కథలు