TATA PUNCH MICRO SUV UNVEILED BOOKINGS OPEN SEE VARIANTS ENGINE FEATURES MK GH
Tata Punch micro SUV: జస్ట్ 21 వేలకే టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ కారు బుక్ చేసుకునే చాన్స్..
Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పోటీ..
టాటా మోటార్స్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ALFA-ARC (ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్) ప్లాట్ఫారం ఆధారంగా పనిచేసే మొట్టమొదటి ఎస్యూవీ వాహనం ఇదే.
టాటా మోటార్స్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ALFA-ARC (ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్) ప్లాట్ఫారం ఆధారంగా పనిచేసే మొట్టమొదటి ఎస్యూవీ వాహనం ఇదే. టాటా కార్లలో అత్యంత పాపులర్ మోడల్ ఆల్ట్రోజ్ తరహాలోనే దీన్ని అభివృద్ధి చేశారు. పట్టణాలు, నగరాల్లో ప్రయాణించడానికి అనువుగా ఈ కారును డిజైన్ చేశారు. ఈరోజే దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు టాటా మోటార్స్ డీలర్షిప్ సెంటర్లు లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 21 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. టాటా మోటార్స్ పంచ్ అమ్మకాల కోసం సంస్థ ఇటీవల వర్చువల్ షోరూమ్ కూడా ప్రారంభించింది. అయితే, దీని ఫీచర్లు వెల్లడించినప్పటికీ, అసలు ధరలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు.
టాటా పంచ్ అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇది187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 366 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇది 370 మి.మీ. వాటర్ వాడింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉందని టాటా మోటార్స్ పేర్కొంది. ఇందులో 15 అంగుళాలు లేదా 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్‌ను అందించింది. టాటా పంచ్ 1.2 లీటర్ రీవోట్రాన్ ఇంజిన్ డైనా-ప్రో టెక్నాలజీతో వస్తుంది. ఇది 86 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్లు, 16.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్లు అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
తక్కువ ట్రాక్షన్ గల రోడ్డుపై కూడా సులభంగా డ్రైవింగ్ చేయడం కోసం ఈ వాహనంలో ఏఎమ్‌టీ గేర్ బాక్స్‌ని అందించింది టాటా మోటార్స్. దీని ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసం సిగ్నల్స్, ట్రాఫిక్ వద్ద ఆటోమేటిక్‌గా ఇంజిన్ ఆఫ్ అయ్యే ఫీచర్‌ను కూడా చేర్చింది. ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆఫ్ చేయడం కోసం ఐడిల్ స్టార్ట్ స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్లను చేర్చింది. టాటా పంచ్ లోపలి ఇంటీరియర్‌ను విశాలమైన ఫీల్ ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. దీని డ్యాష్ బోర్డ్ 4 అంగుళాల లేదా 7 అంగుళాల హర్మన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్‌తో రూపొందింది.
ఈ కారులోని వెనుక సీట్లు చాలా సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. టాటా పంచ్ మొత్తం నాలుగు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఓర్క స్ వైట్, అటామిక్ ఆరెంజ్, డేటోనా గ్రే, ఉల్కా కాంస్యం , కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్, టోర్నడో బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మరోవైపు, ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, ఈబిడితో గల ఎబిఎస్, కార్నర్ సేఫ్టీ కంట్రోల్, ఐసోఫీక్స్, బ్రేక్ స్వే కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లను జోడించింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.