Tata Punch Crash Test: టాటా పంచ్‌కు క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.. నాణ్యతలో సత్తా చాటిన టాటా మోటార్స్

Tata Punch

వచ్చే వారం లాంచ్ కానున్న టాటా పంచ్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి కార్లతో పోటీ పడనుంది. ఈ కారు ఫీచర్స్, విభాగాల పరంగా ప్రత్యర్థి కార్లకు చాలా భిన్నంగా ఉన్నాయి.

  • Share this:
టాటా గ్రూప్ పేరు వినగానే మనకు ముందుగా నాణ్యతే గుర్తుకు వస్తుంది. టీ పొడి నుంచి కార్ల వరకూ ప్రతిదీ ఎంతో క్వాలిటీగా తయారు చేసే టాటా ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. కొద్ది రోజుల క్రితం టాటా మోటార్స్‌ టాటా పంచ్ (Tata Punch) అనే ఓ మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఇది సేఫ్టీ టెస్టులో అత్యధిక స్కోరు సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్‌సీఏపీ (NCAP) టాటా పంచ్ ఎస్‌యూవీకి క్రాష్ టెస్ట్ (crash test) నిర్వహించింది. అడల్ట్ సేఫ్టీ టెస్ట్ లో టాటా పంచ్ 17 పాయింట్లకు గానూ 16.45 పాయింట్స్ సాధించింది. చిన్న పిల్లల రక్షణ పరీక్షలో పంచ్ 49 పాయింట్లలో 40.89 పాయింట్లను పొంది రికార్డు సృష్టించింది.

రేటింగ్స్ పరంగా పెద్ద వారి భద్రత విషయానికొస్తే.. టాటా పంచ్‌ 5 స్టార్స్, పిల్లల భద్రతలో 4 స్టార్స్ సంపాదించింది. పిల్లల రక్షణలో ఈ స్థాయిలో రేటింగ్ పొందిన రెండవ కారు ఇదే కావడం మరో విశేషం. ఇది బరువు తక్కువగా ఉన్నప్పటికీ.. అత్యంత సురక్షితమైనదిగా నిలవటం రేటింగ్ ఏజెన్సీని కూడా ఆశ్చర్యపరిచిందట. కస్టమర్ల భద్రత విషయంలో ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉంటామని టాటా మోటార్ చెప్పడమే కాదు ఇప్పుడు ఏకంగా నిరూపించింది. ఎంట్రీ లెవల్ లో లాంచ్ కానున్న ఈ అతి చిన్న టాటా కారు.. నెక్సాన్స్, ఆల్ట్రోజ్‌ల కంటే ఎక్కువ స్కోర్లు సాధించడం విశేషం.

Tata Punch micro SUV: జస్ట్ 21 వేలకే టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ కారు బుక్ చేసుకునే చాన్స్..


వచ్చే వారం లాంచ్ కానున్న టాటా పంచ్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి కార్లతో పోటీ పడనుంది. ఈ కారు ఫీచర్స్, విభాగాల పరంగా ప్రత్యర్థి కార్లకు చాలా భిన్నంగా ఉన్నాయి. పంచ్ బాడీ షెల్ స్థిరమైన రేటింగ్ పొందింది. గ్లోబల్ ఎన్‌సీఏపీ తన "సేఫ్ కార్స్ ఫర్ ఇండియా ప్రోగ్రామ్" కింద నిర్వహించిన అన్ని క్రాష్ టెస్ట్‌లలో టాటా పంచ్ కారే ఇప్పుడు అత్యధిక రేటింగ్ పొందిన కారుగా నిలిచింది. ఇప్పటికే టాటా తయారుచేసిన రెండు కార్లు అత్యధిక సేఫ్టీ రేటింగ్ పొందాయి. తాజాగా టాటా పంచ్ తో ఈ దేశీయ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యాట్రిక్ సృష్టించింది.

Top Five New Cars: దసరా పండగకు కొత్త కారు కొనాలని ఉందా..టాప్ 5 కొత్త మోడల్ కార్స్ ఇవే...


భారత దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్ల కంపెనీగా టాటా పేరు తెచ్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎన్‌సీఏపీ అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్ 18వ తేదీన టాటా పంచ్ మార్కెట్లోకి విడుదల కానుందని సమాచారం. టాటా మోటార్స్ మాత్రం సేఫ్టీ రేటింగ్, ధరలను ప్రకటించిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలుపుతోంది. దీని ధర రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
Published by:Krishna Adithya
First published: