EV Charging Points: హెచ్‌పీసీఎల్‌తో టాటా ప‌వ‌ర్ ఒప్పందం.. విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు

EV Charging Points: హెచ్‌పీసీఎల్‌తో టాటా ప‌వ‌ర్ ఒప్పందం.. విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు (ప్రతీకాత్మక చిత్రం)

EV Charging Points | పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు టాటాపవర్ హెచ్‌పీసీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

  • Share this:
దేశంలో ఎలక్ట్రిక‌ల్ వాహ‌నాల (ఈవీ) వినియోగం పెంచే దిశ‌గా మ‌రో కీల‌క అడుగు ప‌డింది. ఇప్ప‌టికే ఈ వాహ‌నాల త‌యారీలో దూకుడు పెంచిన టాటా కంపెనీ.. వాహ‌నాలకు అవ‌స‌ర‌మైన ఛార్జింగ్ పాయింట్ల‌పైనా దృష్టి సారించింది. ఇందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్‌ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌)తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. హెచ్‌పీసీఎల్‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్ల‌లో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయ‌డానికి ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇప్ప‌టికే ఈవీ రంగంలో త‌నదైన ముద్ర వేసిన టాటాప‌వ‌ర్.. ఈవీ ఛార్జింగ్‌ల సొంత నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది. టాటాప‌వ‌ర్‌కు దేశ‌వ్యాప్తంగా 100కుపైగా న‌గ‌రాల‌లో ఐదువంద‌ల ప‌బ్లిక్ ఛార్జ‌ర్స్ పాయింట్లు ఉన్నాయి. పెట్రోల్ పంపులు, మెట్రో స్టేష‌న్లు, షాపింగ్‌మాల్స్‌, థియేట‌ర్లు, జాతీయ‌ ర‌హ‌దారుల‌పై వీటిని ఏర్పాటు చేసింది.

ఇందులో ప‌బ్లిక్ ఛార్జింగ్‌, కాప్టివ్ ఛార్జింగ్‌, ఇల్లు, ప‌నిప్ర‌దేశాల‌లో చార్జింగ్ చేసుకునే స‌దుపాయంతో పాటు బ‌స్సుల కోసం అల్ట్రారాపిడ్ ఛార్జింగ్‌ పాయింట్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇప్ప‌డు ఈ నెట్‌వ‌ర్క్‌ను మ‌రింత విస్త‌రించ‌డానికి హెచ్‌పీసీఎల్‌తో ఒప్పందం ఓ ముంద‌డుగుగా టాటాప‌వ‌ర్ భావిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా హెచ్‌పీసీఎల్ పంపుల వ‌ద్ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఈవీ ఛార్జింగ్ స‌దుపాయాల‌ను క‌ల్పించనుంది.

PF Interest: మీ పీఎఫ్ డబ్బులకు వడ్డీ ఎంత వస్తుందో తెలుసుకోండి ఇలా

IRCTC Araku Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

‘హెచ్‌పీసీఎల్‌తో భాగ‌స్వామ్యం మాకెంతో ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. ఈ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం వల్ల జాతీయ‌ ర‌హ‌దారులు, కీల‌క‌ ప్రాంతాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న హెచ్‌పీసీఎల్ భారీ రిటైల్ బేస్‌లోకి ప్ర‌వేశించేందుకు మాకు మార్గం దొరికింది. దీనివ‌ల‌్ల ఈవీ యూజ‌ర్ల‌కు ఛార్జింగ్ పాయింట్లు తేలిక‌గా అందుబాటులోకి వ‌స్తాయి. దేశంలో ఈవీ వాహ‌నాల విస్త‌ర‌ణ‌కు అడ్డంకిగా ఉన్న ఛార్జింగ్ పాయింట్ల స‌మ‌స్య తొల‌గిపోతుంది. ఫ‌లితంగా వీటి వినియోగ‌మూ పెరుగుతుంది’ అని టాటా ప‌వ‌ర్ ఈవీ ఛార్జింగ్ హెడ్ సందీప్‌ బాంగియా చెప్పారు.

LIC Pension Policy: 60 ఏళ్లకు కాదు... ఈ పాలసీతో 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు

Ola e-Scooter: రూ.499 ధరకే ఓలా స్కూటర్ రిజర్వేషన్... బుకింగ్ చేయండి ఇలా

హెచ్‌పీసీఎల్‌కు 18 వేల‌ రిటైల్ అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. ఈవీ ఛార్జింగ్ రంగంలో నైపుణ్యంతో పాటు బ‌ల‌మైన స్థానం ఉన్న టాటాప‌వ‌ర్స్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం.. జాతీయ‌స్థాయి ప‌ర్యావ‌ర‌ణ ఛార్జింగ్ వ్య‌వ‌స్థ‌ను రూపొందించ‌నుంది. దీంతో పాటు ఎండ్ టు ఎండ్ ప‌రిష్క‌రాల‌కు వేదిక‌గా నిల‌వ‌నుంద‌ని హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ సాయికుమార్ సూరి విశ్లేషించారు.
Published by:Santhosh Kumar S
First published: