వాహన తయారీ సంస్థలు ఈ ఏడాది వరుసగా తమ ప్రొడక్ట్స్ ధరలను పెంచుతూ పోతున్నాయి. తయారీ వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నాయి. దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటా మోటర్స్ నెక్సాన్ సబ్-కాంపాక్ట్ SUV ధరలను ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు పెంచగా, తాజాగా మరోసారి పెంచింది. నెక్సాన్ SUV ధరను ప్రస్తుతం రూ.18000 వరకు పెంచింది. కాగా ఈ మోడల్‌పై ఈ ఏడాది జనవరి, జులైలో ధరలను పెంచిన సంగతి తెలిసిందే.
టాటా నెక్సాన్: లేటెస్ట్ ప్రైసెస్(ఎక్స్-షోరూమ్)
తాజా ధరల పెంపు తర్వాత, టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్స్ రూ.7.70 లక్షల నుంచి రూ.12.88 లక్షల మధ్య అందుబాటులో ఉన్నాయి. డీజిల్ వేరియంట్స్ ఇప్పుడు రూ.10 లక్షల నుంచి రూ.14.18 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య లభించనున్నాయి.
టాటా నెక్సాన్ ఫీచర్లు
టాటా నెక్సాన్ సబ్-కాంపాక్ట్ SUV పెట్రోల్ వేరియంట్లో 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 118 bhp, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ వేరియంట్లో 1.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 108 బీహెచ్పీ, 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో భాగంగా రెండు వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ AMT అందుబాటులో ఉన్నాయి.
టాటా నెక్సాన్ 44 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లభిస్తుంది. పెట్రోల్-పవర్‌తో కూడిన ఈ ఎస్యూవీ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్స్ వరుసగా ఒక లీటరుకు 17 కి.మీ, 21 కి.మీ చొప్పున మైలేజ్ అందిస్తాయి. మరోవైపు, డీజిల్ ఎస్యూవీ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్స్ ఒక లీటరుకు 21 కి.మీ, 24 కి.మీ చొప్పున మైలేజ్ అందిస్తాయి. డేటోనా గ్రే, ఫోలేజ్ గ్రీన్, కాల్గరీ వైట్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో ఈ కారు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్
టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, Apple CarPlay & iRA కనెక్టెడ్ కార్ టెక్కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, EBDతో కూడిన ABS వంటి మరిన్ని ఫీచర్స్ ఈ కారు ప్రత్యేకత.
ఎస్యూవీ అమ్మకాల్లో అగ్రస్థానం
ప్రస్తుతం టాటా నెక్సాన్ కార్ బాగా పాపులర్ అయ్యింది. అక్టోబరులో ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఇండియా బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా రికార్డ్ సృష్టించింది. దీంతో మారుతీకి చెందిన బ్రెజాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని తిరిగి సొంతం చేసుకుంది. అక్టోబర్‌లో టాటా నెక్సాన్ కార్లు 13,767 యూనిట్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ తెలిపింది. గతఏడాది అక్టోబరుతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అయితే సెప్టెంబరులో ఇంతకుమించి అమ్మకాలు జరిగాయి. దాదాపు 14,518 యూనిట్లు అమ్ముడు పోయినట్లు సమాచారం. మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటికి పోటీగా టాటా నెక్సాన్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAR, Tata Motors