Tata Cars | కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే కారు ధరలను భారీగా తగ్గిస్తూ టాటా (Tata) మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ తాజాగా తన నెక్సన్ ఈవీ (EV) కారు ధరలో కోత విధించింది. కారు ధరను ఏకంగా రూ. 85 వేల వరకు తగ్గించేసింది. దీంతో ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు.
టాటా మార్స్ కంపెనీ ధర తగ్గింపు నేపథ్యంలో నెక్సన్ ఈవీ ప్రైమ్ ధర ఇప్పుడు రూ. 14.49 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. నెక్సన్ ఈవీ మ్యాక్స్ ధర రూ. 16.49 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. అంతేకాకుండా కంపెనీ డ్రైవింగ్ రేంజ్ కూడా పెంచింది. టాటా నెక్సన్ ఈవీ మ్యాక్స్ ఇప్పుడు ఒక్కసారి చార్జింగ్ పెడితే 453 కిలోమీటర్లు వెళ్తుంది. జనవరి 25 నుంచి ఈ రేంజ్ పెరుగుదల అందుబాటులోకి వస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఫిబ్రవరి 15 నుంచి ఈ సర్వీసులు అందిస్తామని కంపెనీ తెలిపింది.
రేసు గుర్రం.. అందరి కన్ను ఈ స్టాక్ పైనే, డబ్బులు పెడితే కాసుల వర్షం?
నెక్సన్ ఈవీ పోర్ట్‌ఫోలియో మార్పుల గురించి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవాత్స్ మాట్లాడుతూ.. ఇండియాలోనే నెంబర్ 1 ఈవీగా ఉన్న నెక్సన్ ఈవీ తన విజయవంతమైన జర్నీని కొనసాగిస్తోందన్నారు. ఇప్పటికే 40 వేలకు మంది కస్టమర్లు ఈ కార్లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నామని, ధరలను తగ్గించామని వెల్లడించారు. అంతేకాకుండా రేంజ్ పెంచామని తెలియజేశారు.
ఎస్‌బీఐ కస్టమరా? నెలకు రూ.700 కడితే చాలు.. ఈ స్మార్ట్ టీవీ మీ సొంతం!
టాప్ ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర ఇప్పుడు రూ. 18.49 లక్షలుగా ఉంది. టాటా నెక్సన్ ఈవీ ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ మోడల్‌లో ఎయిర్ ఫ్యూరిఫయర్, వైర్‌లెస్ చార్జర్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 17.78 సీఎం ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, హర్మన్ స్పీకర్లు, 16 ఇంచుల అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే కంపెనీ కొత్తగా ఎక్స్ఎం వేరియంట్‌ను కూడా తీసుకువచ్చింది. నెక్సన్ ఈవీ మ్యాక్స్‌లో ఇది ఉంటుంది. ఈ కొత్త మోడల్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో క్లైమెట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రోగ్రామ్, ఐవీబీఏసీ, ప్రొజెక్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Car, Electric Vehicles, Ratan Tata, Tata, Tata cars, Tata Motors