Tata Motors కార్ల అమ్మకాల్లో భారీ వృద్ధి...దూసుకెళ్తున్న టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు...

2020 అక్టోబర్‌లోనే అత్యధికంగా 79.34 శాతం వృద్ధిని Tata Motors నమోదు చేసింది. ఈ అక్టోబరులో మొత్తం 23,600 యూనిట్ల డొమెస్టిక్ ప్యాసింజర్ వాహనాలను ఆ సంస్థ అమ్మగలిగింది. గతంలో 2012 జూలైలో, అది కూడా ఒక్కసారి మాత్రమే ఒక్క నెలలో 23,000 అమ్మకాల మార్కును Tata Motors అధిగమించింది.

news18-telugu
Updated: November 10, 2020, 3:40 PM IST
Tata Motors కార్ల అమ్మకాల్లో భారీ వృద్ధి...దూసుకెళ్తున్న టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పండుగ సీజన్‌లో Tata Motors వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయని ఆ సంస్థ ప్రకటించింది. నెలల వారీగా చూస్తే, గత 99 నెలల్లో.. 2020 అక్టోబర్‌లోనే అత్యధికంగా 79.34 శాతం వృద్ధిని Tata Motors నమోదు చేసింది. ఈ అక్టోబరులో మొత్తం 23,600 యూనిట్ల డొమెస్టిక్ ప్యాసింజర్ వాహనాలను ఆ సంస్థ అమ్మగలిగింది. గతంలో 2012 జూలైలో, అది కూడా ఒక్కసారి మాత్రమే ఒక్క నెలలో 23,000 అమ్మకాల మార్కును Tata Motors అధిగమించింది. గత నెలలో ఆ సంస్థ మొత్తం 13,169 యూనిట్లను కొత్తగా ఉత్పత్తి చేసి, దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌షిప్‌ స్టోర్లకు పంపించింది.

ఈ వృద్ధికి ఆల్ట్రోజ్ వాహనం కారణమని చెప్పుకోవచ్చు. టాటా నెక్సాన్, టియాగో మోడళ్లు కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదం చేశాయి. ఈ రెండు మోడళ్లను అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. దీంతో గత నెలలో వీటి అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఈ పండుగ సీజన్‌లో నెక్సాన్ కారు టాటా సంస్థలో బెస్ట్ సెల్లింగ్ కారుగా గుర్తింపు సాధించింది.

 నెక్సాన్ కారుకు తగ్గని ఆధరణ

నెక్సాన్ కారును 2016 ప్రారంభంలో మార్కెట్లోకి విడుదల చేశారు. టాటా పోర్ట్‌ఫోలియోలో డొమెస్టిక్ ప్యాసింజర్ వేకిల్స్ విభాగంలో నెక్సాన్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలుస్తోంది. గతంలో 2019 మే నెలలో ఒకసారి, 2020 మార్చిలో మరోసారి.. మొత్తం రెండుసార్లు మాత్రమే నెక్సాన్ ఈ రికార్డు నుంచి వైదొలిగింది. ఈ రెండు సందర్భాల్లో టియాగో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టాటా నెలవారీ అమ్మకాల నివేదిక (Tata monthly sales report)లో నెక్సాన్, ఆల్ట్రోజ్ మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. టియాగో మూడవ స్థానానికి పడిపోయింది.

అమ్మకాల్లోనూ వృద్ధి

గత ఏడాది పండుగ సీజన్లో టాటా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ అమ్మకాలు 4,438 యూనిట్లుగా ఉండగా, ఈ సారి ఆ సంఖ్య 6,888 యూనిట్లకు పెరిగింది. దీని ధర రూ.6.99 లక్షల నుంచి రూ.12.70 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, దిల్లీ) ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు, ఆల్ట్రోజ్ ను ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి విడుదల చేశారు. అప్పటి నుంచి 6,730 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. టాటా ఆల్ట్రోజ్ ధర రూ.5.44 లక్షల నుంచి రూ.9.09 లక్షల (ఎక్స్-షోరూమ్, దిల్లీ) వరకు ఉంది. టాటా టియాగో అమ్మకాలలో 11 శాతం వృద్ధి నమోదైంది. 2019 అక్టోబర్ లో 5,460 యూనిట్లను ఆ సంస్థ అమ్మింది. ఈ అక్టోబరులో అది 6,083 యూనిట్లకు పెరిగింది. ఇటీవల అప్‌గ్రేడ్ చేసి విడుదల చేసిన టియాగో ఎక్స్‌టి స్పోర్ట్స్ వేరియంట్.. స్టీరింగ్ మౌంటెడ్ ఫోన్, ఆడియో కంట్రోల్స్ వంటి కొత్త ఫీచర్లతో లభిస్తోంది. టియాగో ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.74 లక్షల (ఎక్స్‌షోరూమ్, దిల్లీ) వరకు ఉంది.

కలిసొచ్చిన పండుగ సీజన్

పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు అనేక ఆఫర్లు, తగ్గింపులను ప్రకటించాయి. Tata Motors కూడా తమ సంస్థకు చెందిన కార్లపై అక్టోబర్‌లో భారీ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను రూపొందించింది. వివిధ మోడళ్లపై రూ.15,000 నుంచి రూ.65,000 వరకు తగ్గింపులను సంస్థ ప్రకటించింది. వీటిల్లో కొన్ని ఆఫర్లను ఈ నెలాఖరు వరకు పొడిగించారు.
Published by: Krishna Adithya
First published: November 10, 2020, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading