ప్రస్తుతం నగదును ఇన్వెస్ట్(Invest) చేయాలనుకొంటున్న వారు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్‌పై(Funds) ఆధారపడుతున్నారు. కష్టపడి సంసాదించిన సొమ్మును అవగాహన లేమితో స్టాక్‌మార్కెట్‌లో(Stock Market) పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు(Fixed Deposits), ఇతర ప్రభుత్వ స్కీముల్లో పెట్టుబడులు(Investments) పెట్టాలన్నా.. తక్కువ వడ్డీ రేట్లతో(Low Interest Rates) వెనుకడుగు వేస్తున్నారు. అందుకే నష్టభయం తక్కువగా ఉండే, స్థిరమైన లాభాలు అందించే సంస్థలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్‌లో(Mutual Funds) పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా టాటా మ్యూచువల్ ఫండ్ ఓ స్కీమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
టాటా మ్యూచువల్ ఫండ్ (Tata Mutual Fund) తాజాగా టాటా నిఫ్టీ ఇండియా డిజిటల్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌ను (Tata Nifty India Digital Exchange Traded Fund) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఓపెన్- ఎండెడ్ ఎక్స్చేంజ్- ట్రేడెడ్ ఫండ్ (ETF). ఇది నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ ఆధారంగా పని చేస్తుంది. దీని NFO సబ్‌స్క్రిప్షన్ మార్చి 16న బుధవారం ప్రారంభమవుతుంది. మార్చి 25వ తేదీ వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
ఈ స్కీమ్‌లో చేరేందుకు, బయటకు వెళ్లేందుకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. కనీస సబ్‌స్క్రిప్షన్ మొత్తం రూ.5,000 ఉందని, అనంతరం రూ.1 మల్టిపుల్స్‌లో ఎంత మొత్తంతో అయనా సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ స్కీమ్ పనితీరు నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్‌పై ఆధారపడి ఉంటుందని, దీనికి సంబంధించిన ఫండ్ మొత్తాన్ని మీటా శెట్టి నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఫండ్ హౌస్ ప్రకారం కేటాయింపుపై ప్రతి యూనిట్ విలువ ఇండెక్స్ దాదాపు 1/100వ వంతు ఉంటుంది.
పోర్టిఫోలియోలో ఉన్న ఇ-కామర్స్, సాఫ్ట్‌వేర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, టెలికాం కంపెనీల స్టాక్స్ పనితీరును నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ ప్రతిబింబిస్తుంది. NSE ఇండెక్స్ ప్రకారం ప్రాథమిక నిబంధనలకు సంబంధించిన అర్హత కలిగిఉన్న అతిపెద్ద 30 కంపెనీలకు నిఫ్టీ పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పిస్తారు. కట్ఆఫ్ తేదీలు జనవరి చివరి నుంచి జులై వరకు ఆరు నెలల యావరేజ్ ఫ్రీ- ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరిశీలిస్తారు. ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా నిఫ్టీ ఇండెక్స్‌లోని స్టాకుల వెయిటేజీని నిర్ణయిస్తారు. ఇండెక్స్‌లో ఆయా కంపెనీల స్టాకుకు సంబంధించిన సెక్టారుకు 50 శాతం, స్టాకుకు 7.50 శాతం వెయిటేజీ ఉంటుంది.
2022వ సంవత్సరం ఫిబ్రవరి 28 నాటికి నిఫ్టీ ఇండెక్స్‌లో వెయిటేజీ పరంగా.. భారతి ఎయిర్‌టెల్, టీసీఎస్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా కమ్యునికేషన్స్, ఇన్ఫో ఎడ్జ్, టెక్ మహీంద్రా, విప్రో, హనీవెల్ ఆటోమేషన్ ఇండియా కంపెనీలు ఉన్నాయి. టాటా డిజిటల్ ఇండియా ఫండ్‌కు, టాటా మ్యూచువల్ ఫండ్‌లోని ఎక్స్చేంజ్ ట్రేడెట్ ఫండ్‌కు వ్యత్సాసం ఉంది. ఓపెన్ ఎండెడ్ ఫండ్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులగా పెడుతున్నారు. పోర్టిఫోలియోలో ఐటీ సర్వీసులు అందించే కంపెనీలు, శ్యాటిలైట్ తయారీ సంస్థలు కీలకంగా ఉండనున్నాయి. అదే విధంగా కొత్త తరహా టెక్నాలజీలు, సేవలు అందించే కంపెనీలు సైతం చోటు దక్కించుకొంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Investments, Mutual Funds, Save Money, Scheme, Stocks