Tata Tigor EV: దేశీయ మార్కెట్​లోకి టాటా టిగోర్ ఈవీ లాంచ్​.. 5.7 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగం.. అమ్మకాలు ఎప్పటి నుంచంటే..

Tigor EV

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మరో ఎలక్ట్రిక్​ కారును లాంచ్​ చేసింది. ఇప్పటికే నెక్సాన్​ ఈవీతో ఎలక్ట్రిక్​ మార్కెట్​లో దూసుకుపోతున్న టాటా మోటార్స్​.. ఇప్పుడు తన రెండో ఎలక్ట్రిక్ వెహికిల్​ ‘టిగోర్​ ఈవీ’ని ఆవిష్కరించింది.

  • Share this:
ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మరో ఎలక్ట్రిక్​ కారును లాంచ్​ చేసింది. ఇప్పటికే నెక్సాన్​ ఈవీతో ఎలక్ట్రిక్​ మార్కెట్​లో దూసుకుపోతున్న టాటా మోటార్స్​.. ఇప్పుడు తన రెండో ఎలక్ట్రిక్ వెహికిల్​ ‘టిగోర్​ ఈవీ’ని ఆవిష్కరించింది. ఈ కొత్త టిగోర్ ఈవీ జిప్ట్రాన్​ హై ఓల్టేజ్​ ఆర్కిటెక్చర్​టెక్నాలజీతో తయారైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్​ కారుని భారత మార్కెట్​లోకి 2021 ఆగస్టు 31న అధికారికంగా లాంచ్​ చేయనుంది. ప్రస్తుతం దీని బుకింగ్స్​ను సంస్థ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్​షిప్​ సెంటర్లలో రూ. 21,000 చెల్లించి ఈ కొత్త ఈవీని బుక్​ చేసుకోవచ్చు. బుకింగ్​ చేసుకున్న వారికి ఆగస్టు 31 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని టాటా మోటార్స్​ తెలిపింది.

ఈ కాంపాక్ట్​ సెడాన్ మెరుగైన రేంజ్​, ఫాస్ట్​ ఛార్జింగ్​ టెక్నాలజీ వంటి ఫీచర్స్​తో వస్తుంది. ఈ కొత్త టిగోర్​ ఈవీ లాంచింగ్​పై టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల బిజినెస్ యూనిట్​​​ మార్కెటింగ్​ హెడ్​ వివేక్​ శ్రీవత్స మాట్లాడుతూ ‘‘గత కొన్ని సంవత్సరాలుగా భారత్​లో ఎలక్ట్రిక్​ వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కంపెనీ నుంచి ఇప్పటికే విడుదలైన టాటా నెక్సాన్​ ఈవీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈవీ కార్ల మార్కెట్​లో దీని వాటా 70 శాతం వరకు ఉంది. కాబట్టి, దేశీయ మార్కెట్​లోకి విడుదలకు సిద్ధమవుతోన్న కొత్త టాటా టిగోర్​ ఈవీ కూడా మంచి అమ్మకాలు సాధిస్తుందని ఆశిస్తున్నాం. వ్యక్తిగత విభాగంలో మా రెండవ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది” అని చెప్పారు.

కేవలం 5.7 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగం
ఈ కొత్త టాటా టిగోర్​ ఎలక్ట్రిక్​ వాహనాన్ని మంచి పనితీరు, టెక్నాలజీ, విశ్వసనీయత, ఛార్జింగ్, కంఫర్డ్​ అనే ఐదు అంశాలపై నిర్మించామని తెలిపారు ప్రొడక్ట్ లైన్​ వైస్​ ప్రెసిడెంట్​ ఆనంద్​ కులకర్ణి. “ఈ కారుతో వాహనదారులు మెరుగైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. దేశంలో ఈవీ మార్కెట్​కు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో దీన్ని విడుదల చేశాం” అని చెప్పారు. టిగోర్ ఈవీ 55 kW వరకు పవర్ అవుట్‌పుట్, 170 Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో సున్నా నుంచి 60 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీనిలో సీసీఎస్2 ఛార్జింగ్ సపోర్ట్​తో కూడిన 26 kWh లిథియం- అయాన్ బ్యాటరీని అమర్చింది.
Published by:Sumanth Kanukula
First published: