Tata Motors: ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి టాటా మోటార్స్ భారీ ప్లాన్​.. త్వరలో 10 మోడళ్లు సిద్ధం

ప్రతీకాత్మకచిత్రం

ఎలక్ట్రిక్​ వాహనాల తయారీలో దూకుడు పెంచాలని నిర్ణయించింది భారత అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్​. రానున్న నాలుగు సంవత్సరాల్లో ప్యాసింజర్​, కమర్షియల్ వాహనాలు కలిపి మొత్తంగా 10 ఎలక్ట్రికల్ వెహికల్స్​ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  • Share this:
ఎలక్ట్రిక్​ వాహనాల తయారీలో దూకుడు పెంచాలని నిర్ణయించింది భారత అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్​. రానున్న నాలుగు సంవత్సరాల్లో ప్యాసింజర్​, కమర్షియల్ వాహనాలు కలిపి మొత్తంగా 10 ఎలక్ట్రికల్ వెహికల్స్​ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణహిత వెహికల్స్​పై దృష్టి సారించింది. ఈ విషయాన్ని టాటా సన్స్ సంస్థ చైర్మన్​ ఎన్​.చంద్రశేఖరన్​ చెప్పారు. అలాగే కర్బన ఉద్గారాలు లేని వాహనాల తయారీకి భారత్​తో పాటు యూపర్​లోనూ లిథియమ్​ ఇయాన్ సెల్స్​ను దశాబ్దాకాలం పాటు తయారు చేయాలని కూడా టాటా నిర్ణయించింది.

“మా ఫోర్ట్​ఫోలియోలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీని గతంతో పోలిస్తే 2శాతంగా రెట్టింపు చేశాం. రానున్న సంవత్సరాల్లో దీన్ని పెంచుకుంటూ పోతాం. భారత మార్కెట్లో టాటా మోటార్స్ మార్పు తీసుకొస్తుంది. 2025 కల్లా టాటా మోటార్స్​ 10 కొత్త బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్​)లను తీసుకొస్తుంది. దేశవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కూడా పెట్టుబడులు పెడతాం” అని వార్షిక నివేదికలో చంద్రశేఖరన్​ వెల్లడించారు.

అలాగే అటానమస్ వెహికల్స్​ కోసం ఆటోమోటివ్ సాఫ్ట్​వేర్​, ఇంజినీరింగ్ వెర్టికల్స్​ను తయారు చేసేందుకు కూడా టాటా గ్రూప్​ సహకరిస్తుందని చంద్రశేఖరన్​ తెలిపారు. ప్రస్తుతానికి తన నమసకే బ్రాండ్​ పేరుతో టాటా మోటార్స్ నెక్సాన్ ఎలక్ట్రిక్​ వెహికల్స్ తయారు చేస్తోంది. బ్రిటన్​లోని యూనిట్​లో జాగ్వార్​.. ఐ-పేస్​ ఈవీ ఎలక్ట్రిక్​ మోడల్​ను టాటా తయారు చేస్తోంది.

కాగా ప్యాసింజర్​ వెహికల్స్ వ్యాపారం రానున్న రోజుల్లో ఊపందుకుంటుందుకునే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండేందుకు పబ్లిక్ రవాణా కాకుండా ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపై దృష్టి సారించే అవకాశం ఉండడంతో కొత్త వాహనాల కొనుగోలు ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో తమ వాహనాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నామని చంద్రశేఖరన్​ అన్నారు. ఇప్పటికే 2021 ఆర్థిక సంత్సరంలో మూడు, నాలుగు త్రైమాసికాల్లో కొనుగోళ్లు పెరిగినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది.

భారత్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ దారులకు సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. చమురు వినియోగాన్ని తగ్గించేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా ఎలక్ట్రిక్ వెహికల్స్​ను పెంచాలని భావిస్తున్నాయి. దీంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలన్నీ ఈ-వెహికల్స్​పై దృష్టి సారించాయి. టాటా సన్స్​ పరిధిలోని టాటా మోటార్స్ కూడా ఆ దిశగా వేగంగా చర్యలు చేపడుతోంది. అలాగే ఇటీవల తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు పెంచడంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతున్నాయి.
Published by:Krishna Adithya
First published: