దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో ఎక్కువగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ప్రతాపం చూపిన వైరస్ ఈ సారి మాత్రం యువకులను సైతం వదలడం లేదు. ఈ విపత్కర సమయంలో ప్రముఖ టాటా మోటార్స్ మరో సారి తన మంచి మనస్సు చాటింది. కరోనా బారిన పడి చనిపోయిన తమ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. కరోనాతో మరణించిన తమ ఉద్యోగి కుటుంబ సభ్యులకు పదవి విరమణ వయస్సు వచ్చే వరకు 50 శాతం బేసిక్ సాలరీని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై కంపెనీ చీఫ్ ఫైనాన్షయల్ ఆఫీసర్ బాలాజీ మాట్లాడుతూ.. కరోనాతో మరణించిన తమ ఉద్యోగి కుటుంబానికి 20 నెలల బేసిక్ సాలరీని వన్ టైం పేమెంట్ గా వెంటనే చెల్లించనున్నట్లు చెప్పారు. అనంతరం పదవీ విరమణ చేసే తేదీ వరకు ఆ కుటుంబానికి ప్రతీ నెల 50 శాతం బేసిక్ సాలరీని అందించనున్నట్లు వివరించారు.
Black Fungus: భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్
Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఖచ్చితంగా తెలుసుకోండి
కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి టాటా కంపెనీ ఇప్పటి వరకు 47 మంది ఉద్యోగులను కోల్పోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టాటా కర్మాగారాల్లో కార్లు, వ్యాన్లు, ట్రక్కులు, బస్సుల తయారీలో అనేక మంది ఉద్యోగులు పాలు పంచుకుంటున్నారు. అయితే కంపెనీలో పని చేసే ఉద్యోగుల్లో 45 ఏళ్ల కంటే వయస్సు ఎక్కువ ఉన్న వారిలో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
కంపెనీలోని ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వర్తించేలా హెల్త్ స్కీంను అందిస్తున్నట్లు బాలాజీ చెప్పారు. టాటాతో పాటు బాజాజ్ ఆటో సంస్థ కూడా కరోనా తో చనిపోయిన తమ ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఆయా బాధిత కుటుంబాలకు రెండు ఏళ్ల జీతాన్ని అందిస్తామని ఇటీవల ప్రకటించింది. చనిపోయిన ఉద్యోగుల పిల్లల విద్యకు కూడా ఖర్చును భరిస్తామని హమీ ఇచ్చింది బజాజ్.
ఇదిలా ఉంటే.. దేశంలో వరుసగా ఆరో రోజు కొత్త కరోనా కేసులు తగ్గడం ఊపిరి పీల్చుకునే అంశంగా మారింది. మొన్న కొత్తగా... 2,63,533 కేసులు రాగా... నిన్న 2,67,334 కేసులే నమోదయ్యాయి. వారం కిందట నిత్యం 4 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2,54,96,330కి చేరింది. మొన్న కరోనాతో ఇండియాలో 4,329 మంది చనిపోగా... నిన్న 4,529 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కేసుల సంఖ్య తగ్గినా.. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజా లెక్కతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,83,248కి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona dead bodies, Covid-19, Ratan Tata, Tata Group, Tata Motors