హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cars Price Hike: కొత్త కార్ కొనేవారికి షాక్... జనవరి నుంచి ఈ కార్ల ధరల పెంపు

Cars Price Hike: కొత్త కార్ కొనేవారికి షాక్... జనవరి నుంచి ఈ కార్ల ధరల పెంపు

Cars Price Hike: కొత్త కార్ కొనేవారికి షాక్... జనవరి నుంచి ఈ కార్ల ధరల పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)

Cars Price Hike: కొత్త కార్ కొనేవారికి షాక్... జనవరి నుంచి ఈ కార్ల ధరల పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

Cars Price Hike | కొత్త సంవత్సరానికి ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త కార్ కొనేవారికి షాక్ తప్పదు. కార్ల ధరలు జనవరి నుంచి భారీగా పెరగనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొత్త సంవత్సరంలో (New Year) కొత్త కార్ కొనాలనుకునేవారికి ఆటోమొబైల్ కంపెనీలన్నీ షాక్ ఇస్తున్నాయి. దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరల్ని (Car Prices) పెంచుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కార్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ధర ఎంత పెరగనుందో ఇప్పటికే ప్రకటించాయి కంపెనీలు. 2023లో భారతదేశంలో వాహనాలు ఖరీదైనవిగా మారనున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల్ని భర్తీ చేయడం, 2023 ఏప్రిల్ నుంచి కఠినమైన ఉద్గార నిబంధనల్ని పాటించడం కోసం ధరలు పెంచబోతున్నాయి కంపెనీలు. కొత్త నిబంధనల ప్రకారం, వాహనాలు రియల్ టైమ్‌లో డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను పర్యవేక్షించేందుకు సెల్ఫ్ డయాగ్నస్టిక్ డివైజ్‌ను అమర్చాలి.

దిగ్గజ కార్ల కంపెనీలైన మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా, ఎమ్‌జి మోటార్ లాంటి కంపెనీలన్నీ ధరలు పెంచబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మరి ఏ కంపెనీ ఎంత ధర పెంచుతుందో తెలుసుకోండి.

Gas Cylinder: రూ.500 ధరకే గ్యాస్ సిలిండర్ ... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వరం

హోండా: జపాన్ కార్ల తయారీ సంస్థ అయిన హోండా తన వాహనాల ధరను రూ.30,000 వరకు పెంచబోతోంది.

హ్యుందాయ్ ఇండియా: హ్యుందాయ్ ఇండియా వేర్వేరు మోడళ్లపై వేర్వేరుగా ధరల్ని పెంచుతోంది. మోడల్‌ను బట్టి ధర మారుతూ ఉంటుంది.జనవరి 2023 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.

జీప్ ఇండియా: అన్ని మోడళ్లలో జీప్ ఎస్‍‌యూవీల ధరలు 2 శాతం నుంచి 4 శాతం పెరగనున్నాయి.

మారుతీ సుజుకి: ఖర్చులు పెరిగిపోతుండటంతో తాము ధరల్ని పెంచుతామని మారుతీ సుజుకీ ప్రకటించింది. ధర ఎంత పెరగనుందో ప్రకటించాల్సి ఉంది.

టాటా మోటార్స్: టాటా మోటార్స్ ICE, ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ ధరలు పెరగున్నాయి.

Araku Tour Package: విశాఖ నుంచి అరకు వన్ డే టూర్ ... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

కియా ఇండియా: జనవరి 2023 నుంచి కియా వాహనాలు గరిష్టంగా రూ.50,000 వరకు పెరుగుతాయి.

మెర్సిడిస్ బెంజ్: లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడిస్ బెంజ్ కూడా తమ కార్ల ధరలను 5 శాతం వరకు పెంచనుంది.

ఎంజీ మోటార్: ఎంజీ మోటార్ కంపెనీ కంపెనీ తన ఎస్‌యూవీ ధరలను రూ.90,000 వరకు పెంచుతుంది.

ఆడి ఇండియా: ఆడి ఇండియా తమ కంపెనీ కార్ల ధరల్ని జనవరి 2023 నుంచి 1.7 శాతం వరకు పెంచనుంది.

First published:

Tags: Auto News, Car prices

ఉత్తమ కథలు