Tata Motors: అక్టోబర్ 1 నుంచి పెరగనున్న టాటా మోటార్స్ వాహనాల ధరలు

Tata Motors: అక్టోబర్ 1 నుంచి పెరగనున్న టాటా మోటార్స్ వాహనాల ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Tata Motors | టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరల్ని పెంచుతున్నట్టు (Price Hike) ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

  • Share this:
కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి వాహన తయారీ సంస్థలు షాక్ ఇస్తున్నాయి. వాహనాల ధరలను (Vehicle Prices) వేలల్లో పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌  (Tata Motors) సైతం చేదు కబురు అందించింది. తాజాగా ఈ దేశీయ సంస్థ తమ కమర్షియల్ వెహికల్స్ ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడి పదార్థాల వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు వాణిజ్య వాహనాల ధరలను దాదాపు 2 శాతం పెంచుతున్నట్లు (Price Hike) టాటా మోటార్స్ మంగళవారం ప్రకటించింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించింది.

మోడల్, వాహనం వేరియంట్ ఆధారంగా 2 శాతం వరకు ధరలు పెంచుతామని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం స్టీల్‌ సహా పలాడియం, రోడియం వంటి ఇతర లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయని.. ఆ ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వివరించింది.

Credit Cards: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్

వాణిజ్య వాహనాలు తయారుచేసే అతిపెద్ద ఇండియన్ కంపెనీగా టాటా మోటార్స్ వెలుగొందుతోంది. ఇది ట్రక్కులు, బస్సులు, చిన్నపాటి వాణిజ్య వాహనాలను భారీ స్థాయిలో తయారు చేస్తోంది. అయితే తయారీకి సంబంధించి వివిధ స్థాయిలలో అయ్యే ఖర్చుల భారాన్ని స్వల్పస్థాయిలో తగ్గించేందుకు ధరలు పెంచడమే మార్గంగా కంపెనీ భావిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఉక్కు, అలాగే విలువైన లోహాల వంటి వివిధ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దాంతో వాహనాల తయారీ సంస్థలపై ఎక్కువ ధరల భారం పడుతోంది.

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,000 తగ్గింపు

వీటి ధరల పెరుగుదల దాటికి తట్టుకోలేక ఈ నెలలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన 'మారుతి సుజుకి ఇండియా' (MSI) సెలెరియో(Celerio) మోడల్ మినహా మొత్తం కార్లపై 1.9 శాతం వరకు ధరలను పెంచింది. ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాదిలోనే మారుతి సుజుకి మూడుసార్లు ధరలు పెంచడం గమనార్హం.

ఇక ద్విచక్ర వాహనాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) మూడుసార్లు ధరలను పెంచింది. ఈ కంపెనీ తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల ఎక్స్-షోరూమ్ ధరలలో రూ. 3,000 వరకు పెంచుతూ.. కొత్త ధరలు సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది. హీరో మోటోకార్ప్ సంస్థ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను జనవరిలో రూ. 1,500 వరకు పెంచింది. పడి పదార్థాలు పెరుగుతున్నాయి అంటూ మళ్లీ ఏప్రిల్ నెలలో రూ.2,500 పెంచింది.
Published by:Santhosh Kumar S
First published: