Home /News /business /

TATA MOTORS TO HIKE PRICES OF COMMERCIAL VEHICLES FROM JULY 1ST UMG GH

Tata Motors: జులై 1 నుంచి కొత్త ధరలు.. టాటా మోటార్స్‌లో పెరిగే ధరలివే..!

టాటా మోటార్స్

టాటా మోటార్స్

దేశంలోని అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్.. 2022 జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రతి యూనిట్ కాస్ట్‌పై సుమారు 1.5-2.5 శాతం మేరకు ధరలను పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది.

దేశంలోని అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్.. 2022 జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రతి యూనిట్ కాస్ట్‌పై సుమారు 1.5-2.5 శాతం మేరకు ధరలను పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది. వాహనాల ధరలు పెంచడానికి కారణాలను స్వదేశీ వాహన తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులను చాలా వరకు కంపెనీ భరిస్తోంది. ఇందుకు విస్తృతమైన చర్యలు తీసుకుంటోంది. అయితే తయారీలో ప్రక్రియలోని వివిధ స్థాయిలకు సంబంధించిన మొత్తం ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరిగాయి. అందువల్ల కనిష్టంగా ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది.’ అని పేర్కొంది.

టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCV), మీడియం కమర్షియల్ వెహికల్స్ (MCV), హెవీ కమర్షియల్ వెహికల్స్ (HCV), కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వెహికల్స్ ఉన్నాయి. ఈ మొత్తం సెగ్మెంట్ నుంచి కంపెనీ 2022 మే నెలలో 27,553 యూనిట్లను విక్రయించగలిగింది. గత ఏడాది మే నెలలో ఈ సెగ్మెంట్‌లో నమోదైన మొత్తం సేల్స్ 7,373 యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో టాటా మోటార్స్ మార్కెట్ వాటా 41.88 శాతం నుంచి 41.35 శాతానికి పడిపోయినప్పటికీ.. వాణిజ్య వాహనాల రిటైల్ అమ్మకాల పరంగా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది.

ధరల పెంపు విషయాన్ని టాటా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కూడా పేర్కొంది. తమ బ్రాండ్ నుంచి వచ్చే అన్ని కమర్షియల్ వెహికల్స్ ధరలను మోడల్, వేరియంట్ ఆధారంగా 1.5 నుంచి 2.5% వరకు ధరలను పెంచుతున్నట్లు అందులో పేర్కొంది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల శ్రేణిలో ప్రైమా (Prima), ఇంటర్‌సిటీ కోచ్, టార్మాక్ కోచ్, వెంచర్, ఏస్, స్కూల్ బస్సులు, కొన్ని రకాల బస్సులు, ట్రక్కులు ఉన్నాయి. ఇటీవలే టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా కమర్షియల్ వెహికల్‌ను రిలీజ్ చేసింది. 154 కి.మీల డ్రైవింగ్ రేంజ్‌ను అందించే 'ఏస్ ఎలక్ట్రిక్' (Ace Electric) మోడల్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్.

ఈ ఏడాది టాటా మోటార్స్ వాహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి. ఏప్రిల్ నెలలో కంపెనీ ప్యాసింజర్ వాహనాల ధరలను 1.1% పెంచింది, అలాగే పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా వాణిజ్య వాహనాల ధరలను 2-2.5% వరకు పెంచింది. టాటా మోటార్స్ మాదిరిగానే, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా, ఇతర ఆటో తయారీదారులు కూడా వాహనాల ధరలను పెంచాయి. సెమీకండక్టర్ల కొరత, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అనేక కారణాల వల్ల వాహనాల ధరలను పెంచాల్సి వస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Tata, Tata Motors, Vehicles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు