హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Loan: ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. వారికి సులభంగానే రూ.9 లక్షల రుణం!

SBI Loan: ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. వారికి సులభంగానే రూ.9 లక్షల రుణం!

 SBI Loan: ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. వారికి సులభంగానే రూ.9 లక్షల రుణం!

SBI Loan: ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. వారికి సులభంగానే రూ.9 లక్షల రుణం!

Tata Ace EV | ఎస్‌బీఐ, టాటా మోటార్స్ మధ్య కీలక భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా కస్టమర్లు సులభంగానే టాటా ఏస్ ఈవీ కొనుగోలుకు లోన్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

State Bank Of India | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ - SBI) తాజాగా తీపికబురు అందించింది. దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు (Tata Motors) చెందిన టాటా ఏస్ ఈవీ వాహన కొనుగోలుకు సులభంగా రుణాలు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎవరైనా టాటా ఏస్ ఈవీ కొనుగోలు చేయాలని భావిస్తే.. సులభంగానే రుణం పొందొచ్చు. ఎస్‌బీఐ ఈజీగా లోన్ ఆఫర్ చేస్తుంది.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకుల పని దినాలు, పని వేళల్లో మార్పు?

టాటా మోటార్స్‌ తాజాగా ఎస్‌బీఐతో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ టాటా ఏస్ ఈవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఈజీగా లోన్స్ అందించనుంది. టాటా ఏస్ ఈవీ అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే.. టాటా ఏస్ ఈవీ ఏకంగా 154 కిలోమీటర్లు వెళ్తుంది. దీని వల్ల డీజిల్‌తో పని లేదు.

బంగారం కొనాలనుకుంటున్నారా? ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్, కేంద్రం కీలక ప్రకటన!

టాటా మోటార్స్ ఈ వెహికల్‌లో27 కేడబ్ల్యూ మోటార్‌ను అమర్చింది. దీని పవర్ 36 హెచ్‌పీ. టార్క్ 130 ఎన్ఎం. ఈ టాటా ఏస్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. బీ2బీ, బీ2సీ బిజినెస్ కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఎలక్ట్రిక్ వేరియంట్ వల్ల కొనుగోలు దారులు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. ఫ్యూయెల్ ఖర్చు ఉండదు. సిటీలో సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు.

టాటా మోటార్స్, ఎస్‌బీఐ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కస్టమర్లు ఎలాంటి తనఖా లేకుండా సులభంగా లోన్ పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని ఆరేళ్ల లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. టాటా ఏస్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుంచి ఉంది. అంటే మీకు బ్యాంక్ 90 శాతం ఫైనాన్స్ కల్పిస్తుంది. అంటే దాదాపు 8.99 లక్షల దాకా లోన్ పొందొచ్చు. టాటా ఏస్ ఈవీ కొనుగోలు చేసి ఉపాధి పొందాలని భావించే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రూ. లక్ష పెట్టుకుంటు ఇంటికి టాటా ఏస్ ఈవీ తెచ్చుకోవచ్చు. మిగతా మొత్తాన్ని నెలవారీ ఈఎంఐ రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తే.. అప్పుడు నెలవారీ ఈఎంఐ కూడా దిగి వస్తుంది. చేతిలో డబ్బులు లేని వారు ఈ ఆఫర్ పొందొచ్చు. టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లోకి మీరు టాటా ఏస్ ఈవీని బుక్ చేసుకోవచ్చు. తర్వాత లోన్ లభిస్తుంది.

First published:

Tags: Sbi, Sbi loans, State bank of india, Tata, Tata Motors

ఉత్తమ కథలు