Home /News /business /

Tata Motors: మీకు టాటా కారు ఉందా..? అయితే, మీకో గుడ్ న్యూస్.. తెలుసుకోండి

Tata Motors: మీకు టాటా కారు ఉందా..? అయితే, మీకో గుడ్ న్యూస్.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో టాటా మోటార్స్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారంటీ, సర్సీసుపై ఫ్రీ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభన కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్​డౌన్​ విధిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కస్టమర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఈ నెల 31 వరకు ఉన్న వాహనాల ఉచిత సర్వీసుల గడువును జూన్​ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్​ వాహన వినియోగదారులకు వారెంటీ, ఉచిత సర్వీస్​ గడువును జూన్​ చివరి వరకు పొడగిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వారంటీ, ఉచిత సర్వీస్ గడువు 2021 ఏప్రిల్ 1 నుండి మే 31 మధ్య ముగిసే కస్టమర్లకు మరో నెల రోజుల పాటు ఈ వెసులుబాటు కల్పిస్తున్నాట్లు స్పష్టం చేసింది. అనగా జూన్ 30 వరకు వారు ఉచిత సర్వీసులు పొందవచ్చు. దేశంలో కొనసాగుతున్న లాక్​డౌన్​ ఆంక్షల వల్ల తమ కస్టమర్లు సకాలంలో వాహన సర్వీసులు పొందలేకపోతున్నారని, వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వారెంటీ, ఉచిత సర్వీస్​ గడువును మరో నెలరోజుల పొడగిస్తున్నామని కంపెనీ వివరించింది.

జూన్​ 30 వరకు ఉచిత సర్వీసులు..
తాజా నిర్ణయంపై టాటా మోటార్స్, పివిబియూ కస్టమర్ కేర్ (డొమెస్టిక్ & ఐబి) హెడ్ డింపుల్ మెహతా మాట్లాడుతూ ‘‘దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులు సర్వీస్​ సెంటర్లకు వాహనాలను తీసుకురావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల, వారంటీ, ఉచిత సర్వీసు గడువును మరో నెలరోజుల పాటు పొడగించాలని నిర్ణయించాం.
BSNL Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి సూపర్ ఆఫర్.. కేవలం రూ. 187కే అన్‌లిమిటెడ్ డేటా.. వివరాలివే
Gas Cylinder Offer: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ పై రూ.800 తగ్గింపు.. ఇలా బుక్ చేయండి

వారి వారంటీ, ఉచిత సర్వీసు వ్యవధిని 30 జూన్ వరకు పొడిగించడం ద్వారా ఈ కఠినమైన సమయాల్లో వారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. మా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పుడూ ముందుంటాం." అని ఆయన పేర్కొన్నారు. కాగా, కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, మెరుగైన సేవలను అందించేందుకు ‘బిజినెస్​ ఎజిలిటీ ప్లాన్​’ను రూపొందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, టాటా మోటార్స్​కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400కి పైగా ప్రాంతాల్లో 608 సర్వీస్​ సెంటర్లు ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR, Cars, Tata Group, Tata Motors

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు