మార్కెట్లోకి రాకముందే Hyundai i20కి షాక్ ఇచ్చిన Tata Altroz

Hyundai కొత్త జెనరేషన్‌ i20 కారును హ్యూందాయ్ నవంబర్ ఐదున మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనికి పోటీగా Altroz సిద్ధంగా ఉన్నట్టు Tata Motors వీడియోలో స్పష్టం చేసింది. సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో Altroz కారు ప్రమోషన్‌కు సంబంధించిన ఈ వీడియోను పంచుకుంది.

news18-telugu
Updated: November 3, 2020, 9:26 PM IST
మార్కెట్లోకి రాకముందే Hyundai i20కి షాక్ ఇచ్చిన Tata Altroz
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Tata Motors సంస్థ Hyundai కంపెనీకి చురకలంటించింది. కానీ నేరుగా కాదు.. ఒక వీడియో ప్రకటనలో. వివరాల్లోకి వెళ్తే... టాటా నుంచి వచ్చిన Altroz, Hyundai నుంచి రానున్న i20 కారుకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆల్ట్రోజ్‌ కారును ఈ ఏడాది ప్రారంభంలోనే టాటామోటార్స్ విడుదల చేసింది. ఈ కారు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, Hyundai ఎలైట్ i20, volkswagen polo, Honda Jazz వంటి కార్లకు పోటీ ఇస్తోంది. Tata Motors ఇటీవల హాలోవీన్(అక్టోబరు చివర్లో వచ్చే వేడుక)కు ముందు ఒక టెలివిజన్ కమర్షియల్ (TVC)ను విడుదల చేసింది. దీంట్లో Hyundai ఎలైట్ i20కు చురకలంటించింది. Hyundai కొత్త జెనరేషన్‌ i20 కారును హ్యూందాయ్ నవంబర్ ఐదున మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనికి పోటీగా Altroz సిద్ధంగా ఉన్నట్టు Tata Motors వీడియోలో స్పష్టం చేసింది. సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో Altroz కారు ప్రమోషన్‌కు సంబంధించిన ఈ వీడియోను పంచుకుంది.

వీడియోలో ఏముంది?

Tata Motors విడుదల చేసిన వీడియోలో i20 కారును పూర్తిగా కవర్‌తో కప్పి ఉంచినట్టు చూపించారు. దాని హెడ్‌లైట్‌లు కవర్ల నుంచి మెరుస్తూ కనిపిస్తున్నాయి. హాలోవీన్ నేపథ్యంలో కారుకు ఇలా సెట్టింగ్ చేశారు. దీన్ని తెరపై చూపిస్తున్నప్పుడు i20ని టార్గెట్ చేస్తూ ‘This is a Tri20’ అనే ఒక క్రిప్టిక్ మెస్సేజ్‌ కనిపిస్తుంది. Hyundai కారును చూపిస్తున్నప్పును Tri20 పదాన్ని Trick అని సరిదిద్ది... ‘This is a Trick’ అనే వాక్యాన్ని తెరపై చూపించారు. ఆ తరువాత వీడియోలో Altroz కారు కనిపిస్తుంది. అప్పుడు తెరపై ట్రిక్ పదానికి బదులుగా ట్రీట్ అనే పదం కనిపిస్తుంది. This is a treat అనే వాక్యం Altroz కారుతో పాటు కనిపిస్తుంది. మీ ట్రిక్స్‌కు మేము ట్రీట్ ఇస్తాం అనే అర్థం వచ్చేలా... i20 కారుకు తాము గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని Tata Motors వీడియోలో చెప్పకనే చెప్పింది. ప్రత్యర్థిని సరదాగా ఉక్కిరిబిక్కిరి చేసిన టాటా మెటార్స్ కొత్త రకం ప్రమోషన్‌తో దూసుకుపోతోంది.i20 బుకింగ్‌లు మొదలయ్యాయి

Hyundai ఇప్పటికే i20 కార్ల ప్రీబుకింగ్‌లు మొదలు పెట్టింది. వినియోగదారులు రూ.21,000 చెల్లించి కారును రిజర్వ్ చేసుకోవచ్చు. Click2Buy పోర్టల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా కారును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. కొత్త i20 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి కొత్త ఫీచర్లతో లభిస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ వెర్షన్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్‌లలో iMT, DCT, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. Tata Altrozను ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేశారు. ఎక్కువ ఫీచర్లు లేనప్పటికీ, Altroz కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. మన దేశంలోనే సురక్షితమైన కార్లలో ఒకటిగా ఇది నిలిచింది.
Published by: Krishna Adithya
First published: November 3, 2020, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading