TATA Nexon EV కారు కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మొదటి 100 మంది కస్టమర్లకు మాత్రమే

ఈ సబ్ స్క్రిప్షన్ ఆఫర్ క్రింద ప్రతినెలా కేవలం రూ.34,900 మాత్రమే చెల్లించి ఈ ఎస్యూవీని ఎంతం చేసుకోవచ్చు. ఈ పరిమిత కాలపు ఆఫర్ మొదటి 100 మంది చందాదారులకు మాత్రమే లభిస్తుంది.

news18-telugu
Updated: September 22, 2020, 11:18 PM IST
TATA Nexon EV కారు కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మొదటి 100 మంది కస్టమర్లకు మాత్రమే
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని టాటా మోటార్స్ భారీ ఆఫర్ని ప్రకటించింది. టాటా నెక్సాన్ EV కారును నవంబర్ 30లోపు కొనుగోలు చేసే వారికి లిమిటెడ్ టైమ్ స్పెషల్ ఆఫర్గా 'ఎలక్ట్రిఫైయింగ్ సబ్‌స్క్రిప్షన్' పేరుతో టాటా మోటర్స్ కొత్త స్కీమ్ ను ప్రారంభించింది. ఈ సబ్ స్క్రిప్షన్ ఆఫర్ క్రింద ప్రతినెలా కేవలం రూ.34,900 మాత్రమే చెల్లించి ఈ ఎస్యూవీని ఎంతం చేసుకోవచ్చు. ఈ పరిమిత కాలపు ఆఫర్ మొదటి 100 మంది చందాదారులకు మాత్రమే లభిస్తుంది. ఒరిక్స్ ఆటోతో భాగస్వామ్యంతో అందించిన ఈ చందా ప్యాకేజీలో బీమా కవరేజి, 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఉచిత మెయింటెనెన్స్, సర్వీసింగ్ మరియు డోర్స్టెప్ డెలివరీ వంటి సేవలు ఉంటాయి. కస్టమర్లు తమ ఇంటి లేదా కార్యాలయంలో సౌకర్యవంతంగా భావించే కాంప్లిమెంటరీ పర్సనల్ EV ఛార్జర్‌ను కూడా పొందుతారు. ఎండ్ -టు- ఎండ్ మద్దతుతో ఆన్‌లైన్‌లో ఈ సదుపాయాన్ని సులభంగా పొందవచ్చు.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కేవలం రూ.34,900 నెలవారీ చందాతో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు వారి ఈఎంఐ వ్యవధిని కనీసం 12 నెలల నుండి 24 లేదా 36 నెలల వరకు ఎంచుకోవచ్చు.

ఢిల్లీ/ఎన్‌సిఆర్, ముంబై, పూణే, హైదరాబాద్ మరియు బెంగళూరు 5 ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ చందా సబ్స్క్రిప్షన్ వ్యవధి అనుగుణంగా వారు ఈఎంఐ చెల్లించే వ్యవధిని పెంచుకోవచ్చు లేదా వాహనాన్ని రిటన్ చేయవచ్చు. ఈ లాభదాయకమైన ఆఫర్‌ను ప్రకటించిన టాటా మోటార్స్ హెడ్-మొబిలిటీ సర్వీసెస్ మిస్టర్ పంకజ్ ఝుంజా మాట్లాడుతూ, “మా కస్టమర్లు గొప్ప డ్రైవింగ్ అనుభూతి పొందేలా మేము ఎల్లప్పుడూ పనిచేస్తాం. సరసమైన మరియు సౌకర్యవంతంగా ఉండే ఉత్తేజకరమైన ఆఫర్లను అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాము.’’ అని అన్నారు. ఆకుపచ్చ నెక్సాన్ ఈవీ ముఖ్యంగా యువతరాలన్ని ఆకర్షిస్తోంది. భవిష్యత్ తరానికి ఎలక్ట్రికట్ వెహికిల్ను అందించేలక్ష్యంతో మా కొత్త ‘ఎలక్ట్రిఫైయింగ్ సబ్‌స్క్రిప్షన్’ ఆఫర్ రూపొందించబడింది.

ఈ ఆఫర్ అనుకూలీకరించబడింది మరియు కారు లీజుకు ఇవ్వడానికి ఇష్టపడే కార్పొరేట్‌లు, తరచూ సిటీల్లోనే ఉద్యోగ బదిలీలు జరిగే వ్యక్తులు మరియు కొంత కాలం వరకు స్థిరంగా నివసించే ప్రవాసులకు గొప్ప ఎంపిక.
Published by: Krishna Adithya
First published: September 22, 2020, 11:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading