Electric Vehicle | దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ అయిన టాటా మోటార్స్ (Tata Motors) కారు కొనుగోలుదారులకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. తక్కువ ధరలోనే సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని (EV) మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. దీని ధర రూ. 12.5 లక్షలలోపే ఉండొచ్చని తెలుస్తోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిటల్ ఎండీ శైలేష్ చంద్ర ఈ విషయాలను వెల్లడించారు.‘టాటా మోటార్స్ త్వరలోనే అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. టిగోర్ ఈవీ కన్నా దీని రేటు తక్కువగానే ఉంటుంది. టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ. 12.5 లక్షల నుంచి ఉంది. త్వరలో తీసుకురాబోతున్న చౌక ధర కారు హ్యాచ్బ్యాక్. దీని ధర చాలా అందుబాటులో ఉండనుంది’ అని చంద్ర న్యూస్ 18కు తెలియజేశారు. అలాగే టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన వెల్లడించారు.
హైదరాబాదీలకు కొత్త సర్వీసులు.. వచ్చే నెల నుంచి..
ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయని చంద్ర తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈవీ రంగ అమ్మకాలు 2 వేల యూనిట్లుగా ఉన్నాయని, అయితే తర్వాత గత మూడేళ్లలో వీటి విక్రయాలు 10 రెట్లు పెరిగాయని గుర్తు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 20 వేల యూనిట్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని విక్రయాలతో ఇది సమానం అని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన రంగంలో ఈవీ అమ్మకాలు 50 వేల మార్క్ దాటనున్నాయని ధీమా వ్యక్తం చేశారు. తాము ఇప్పటి వరకు 17 వేల యూనిట్ల ఈవీలను విక్రయించామని, 2022-23లో 50 వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకునామని వివరించారు.
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా
అలాగే టాటా మోటార్స్ కంపెనీ ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసిన సనంద్ ప్లాంటును తయారు చేస్తున్నామని, దీని ద్వారా కంపెనీ సామార్థ్యాన్ని మరో 3 లక్షల యూనిట్లు పెంచుకోనున్నామని ఆయన వివరించారు. ముంబైలో నెక్సన్ ఈవీ ఫైర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. కంపెనీ ఇప్పటి వరకు 40 వేల ఈవీలను విక్రయించిందని, అన్ని సురక్షితమని తెలిపారు. ప్రభుత్వం ఆ ప్రమాదంపై దర్యాప్తు పూర్తి చేసిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Car, Electric Vehicle, Tata, Tata cars, Tata Motors