హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Motors: టాటా మోటార్స్ నుంచి ఫస్ట్ CNG ట్రక్కు లాంచ్.. పూర్తి వివరాలివే..

Tata Motors: టాటా మోటార్స్ నుంచి ఫస్ట్ CNG ట్రక్కు లాంచ్.. పూర్తి వివరాలివే..

Photo Credit : TATA Motors

Photo Credit : TATA Motors

Tata Motors: టాటా మోటార్స్ తాజాగా మీడియం & హెవీ కమర్షియల్ వెహికల్ (M&HCV) సెగ్మెంట్‌లో సరికొత్తగా 5 సిగ్నా సీఎన్‌జీ (Signa CNG trucks) ట్రక్కులను లాంచ్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ వాణిజ్య వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలతో టిప్పర్లు, ట్రక్కులు పరిచయం చేస్తోంది. అలాగే డీజిల్ ధరల మంట కొనసాగుతున్న వేళ వాహనదారులకు ఊరట కలిగించేలా ఉత్తమమైన వెహికల్స్ కూడా తీసుకొస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మీడియం & హెవీ కమర్షియల్ వెహికల్ (M&HCV) సెగ్మెంట్‌లో సరికొత్తగా 5 సిగ్నా సీఎన్‌జీ (Signa CNG trucks) ట్రక్కులను లాంచ్ చేసింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొదటి హెవీ సీఎన్‌జీ ట్రక్కులు ఇవే కావడం విశేషం. వీటితోపాటు మరిన్ని ఇంటర్మీడియరీ, లైట్ కమర్షియల్ వెహికల్ (I&LCV) సెగ్మెంట్‌లో 7 కొత్త టిప్పర్లు, ట్రక్కులను కంపెనీ విడుదల చేసింది. వీటిలో కారులో లాగా అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అందించడం మరో ప్రత్యేకత.

కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్ (CMS), లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ (LDWS) వంటి ఫీచర్లను భారతీయ డ్రైవర్లకు అనుగుణంగా ఉండేలా అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అందించారు. కంపెనీ ప్రైమా, సిగ్నా, అల్ట్రా ట్రక్కులను ADAS వంటి కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు సేవలను అందించడానికి ఈ కొత్త వాహనాలు ఉపయోగపడుతున్నాయి.

తాజాగా రిలీజ్ అయిన ఈ ఏడు కొత్త ఫ్యూయల్-ఎఫెక్టివ్ డీజిల్ , సీఎన్‌జీ ట్రక్కులు, టిప్పర్లు వాహన బరువు, డెక్ లెంగ్త్ పరంగా మరిన్ని ఆప్షన్స్ ఆఫర్ చేస్తాయి. ఈ ట్రక్కులు ఆప్టిమైజ్డ్ డ్రైవ్‌లైన్లు, లో-విస్కోస్ రియర్ యాక్సిల్ ఆయిల్, ఈ-విస్కోస్ రేడియేటర్ ఫ్యాన్, గేర్‌షిఫ్ట్ అడ్వైజర్, లో-రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లతో సహా మరిన్ని అధునాతన టెక్నికల్ ఫీచర్లతో వస్తున్నాయి.

* సిగ్నా సీఎన్‌జీ ట్రక్స్

28, 19 టన్నుల నోడ్‌లలో ఉన్న భారతదేశపు తొలి సీఎన్‌జీ-పవర్డ్ ట్రక్కులను టాటా మోటార్స్ సోమవారం ప్రవేశపెట్టింది. సరికొత్త Signa CNG మోడల్స్‌ రకరకాల వీల్‌బేస్, లోడ్ డెక్ లెంగ్త్ ఆప్షన్స్‌తో పాటు క్యాబిన్ కస్టమైజేషన్ కోసం కౌల్ ఆప్షన్‌తో కూడా వస్తాయి. ఈ మోడళ్లు 5.7-లీటర్ SGI ఇంజన్‌తో 180hp గరిష్ట శక్తిని, 650Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌తో వస్తాయి. అలానే 1,000 కిమీల పరిధిని అందిస్తాయి. పర్యావరణ హితమైన Signa CNG ట్రక్కులు తక్కువ ఆపరేషనల్ కాస్ట్స్‌, అధిక మన్నిక అందిస్తూ వాహనదారులకు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తాయి.

ఇది కూడా చదవండి : Zomato: హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్‌కు షాక్


* I&LCVలో కొత్త లాంచ్‌లు

4-18 టన్నుల గ్రాస్ వెహికల్ వెయిట్ (GVW)తో అందించిన ఇంటర్మీడియరీ, లైట్ కమర్షియల్ వెహికల్స్‌ అవసరానికి తగినట్లుగా వివిధ రకాల ఇంజన్ & క్యాబిన్ ఆప్షన్లతో వచ్చాయి. ఈ ట్రక్కులు ఫ్లీట్ ఎడ్జ్‌, ఆన్-సైట్ సపోర్ట్, అప్‌టైమ్ అష్యూరెన్స్, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ రిపేర్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, డిజిటల్ సొల్యూషన్, అదనపు సర్వీసులు వంటి వాటితో వస్తున్నాయి.

* ప్రైమా ట్రక్కులు

కొత్త ప్రైమా ట్రక్కులు డ్రైవర్ యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్ (CMS), లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ (LDWS) వంటి వాటితో లాంచ్ అయ్యాయి. ఈ వాహనం డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (DMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా అందిస్తుంది. కొత్త ప్రైమా సిరీస్ రీడిజైన్డ్‌ క్యాబిన్‌తో మెరుగైన డ్రైవింగ్ కంఫర్ట్ అందిస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Tata Motors, Vehicles

ఉత్తమ కథలు