TATA MOTORS LAUNCHES SAFARI GOLD EDITION AHEAD OF IPL DEBUT HERE IS PRICE SPECIFICATIONS AND OTHER DETAILS GH SK
Tata Motors: భారత మార్కెట్లోకి టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్.. ధర, ఫీచర్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Tata Motors Safari Gold : కంపెనీ ఇప్పటికే వీటి బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. విజయవంతంగా బుకింగ్ చేసుకున్న వారికి వాహనాల డెలివరీ త్వరలోనే ప్రారంభమవుతాయి.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారీ గోల్డ్ (Safari Gold edition)ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 21.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ స్పెషల్ ఎడిషన్ వైట్ గోల్డ్, బ్లాక్ గోల్డ్ అనే రెండు ప్రత్యేక కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త మోడల్‌ను సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో జరగబోయే వివో ఐపీఎల్ 2021 (IPL 2021)లో మొదటిసారిగా ప్రదర్శించబోతుంది. టాటా మోటార్స్ 2021 ఐపీఎల్ అఫీషియల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అందుకే, సరికొత్త సఫారీ గోల్డ్‌ను ఐపీఎల్ వేదికపైనా ప్రదర్శించనుంది. తద్వారా ఎక్కువ మంది వినియోగదారులను అట్రాక్ట్ చేయవచ్చని భావిస్తోంది.
ఐపీఎల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా..
వైట్ గోల్డ్ వేరియంట్ ఫీచర్ల విషయానికి వస్తే. దీనిలో ప్రీమియం ఫ్రాస్ట్ వైట్ బాడీ పెయింట్, బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్‌ను అందించింది. ఇందులోని గ్రిల్, హెచ్ల్యాప్ సరౌండ్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, టాటా సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్లను చేర్చింది. ఇవి కారుకు అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి. ఇక, బ్లాక్ గోల్డ్ వేరియంట్ విషయానికి వస్తే.. బయటవైపు కాఫీ బీన్ బ్లాక్ ఎక్స్టీరియర్ను చేర్చింది. ఇందులో కూడా గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, టాటా సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్లను అందించింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో ఓస్టర్ వైట్ డైమండ్ క్విల్టెడ్ లెదర్ సీట్లు, 1వ, 2 వ రూట్స్, వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే, ఓవర్ వైఫై వంటి ప్రీమియం ఫీచర్లను చేర్చింది.
ఈ సరికొత్త వాహనంపై టాటామోటార్స్ మార్కెటింగ్ మేనేజర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ ”టాటా మోటార్స్ నుంచి గతంలో విడుదలైన సఫారీ మోడల్ కేవలం ఐదు నెలలల్లోనే 10 వేల అమ్మకాలను సాధించింది. టాటా మోటార్స్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. కస్టమర్ల ఆదరణను దృష్టిలో ఉంచుకుని, సఫారీలోనే గోల్డ్ ఎడిషన్‌ను ప్రవేశపెడుతున్నాం. ఇది కూడా మంచి అమ్మకాలను ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నాం.”అని అన్నారు.
కాగా, కంపెనీ ఇప్పటికే వీటి బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. విజయవంతంగా బుకింగ్ చేసుకున్న వారికి వాహనాల డెలివరీ త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇక, ఈ వాహనం మాన్యువల్, ఆటోమేటిక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మాన్యువల్ వేరియంట్ రూ. 21.89 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్ రూ. 23.17 లక్షల వద్ద లభిస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.