Tata Tiago NRG Facelift కారును విడుదల చేసిన టాటా మోటార్స్.. ధర, ఫీచర్ల వివరాలు..

(ప్రతీకాత్మక చిత్రం)

టాటా మోటార్స్ సరికొత్త టియాగో కారును విడుదల చేసింది. భారత్‌లో టియాగో ఎన్‌ఆర్‌జీ ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ను తాజాగా లాంచ్ చేసింది.

  • Share this:
టాటా మోటార్స్ సరికొత్త టియాగో కారును విడుదల చేసింది. భారత్‌లో టియాగో ఎన్‌ఆర్‌జీ ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ మోడల్ ధర రూ. 6.57 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్- AMT వెర్షన్ ధర రూ.7.09 లక్షల వరకు ఉంది. అధికారికంగా లాంచ్‌ చేయడానికి కొన్ని రోజుల ముందే, ఈ కారు డీలర్‌షిప్‌లో కనిపించింది. కొత్త టియాగో ఎన్‌ఆర్‌జీ కూడా గ్రీన్ పెయింట్ స్కీమ్‌తో వస్తుందని అధికారిక టీజర్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఇది 5 స్పోక్ డిజైన్‌తో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ని కూడా కలిగి ఉంది. ఈ కారుకి ఒక SUV ఫీచర్ ఉంది. దీనికి సాధారణ టియాగో కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం విశేషం.

ఈ వాహనం క్యాబిన్ ఆల్-బ్లాక్ డిజైన్‌లో ఉంటుంది. ఇందులో పొందుపరిచిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌.. లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టియాగో NRGలోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక డిజిటల్ యూనిట్. ఈ వాహనంలో అనేక సేఫ్టీ ఫీచర్లు సైతం ఉన్నాయి. పార్కింగ్ కెమెరా, పార్క్ అసిస్టెంట్ సెన్సార్‌లతో పాటు డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్.. వంటి ఫీచర్లతో ఈ వాహనాన్ని రూపొందించారు. ఈ కారులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 86 పిఎస్ పవర్‌తో పాటు 3300 ఆర్‌పీఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఇంజిన్‌ వేరియంట్‌లను కస్టమర్లు ఎంచుకోవచ్చు.

NRG డిజైన్, సామర్ధ్యాలు కస్టమర్లను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ & కస్టమర్ కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అంబ రాజన్. ఈ హ్యాచ్‌బ్యాక్ కారును.. SUV లుక్‌లో సరికొత్తగా డిజైన్ చేసినట్లు చెప్పారు. ఎస్‌యూవీ ట్రెండ్‌కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు చెప్పారు. గతంలో విడుదల చేసిన మోడళ్ల మాదిరిగానే ఎన్‌ఆర్‌జీ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ సైతం సంస్థ బ్రాండ్ విలువను పెంచుతుందని రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Published by:Krishna Adithya
First published: