టాటా మోటార్స్ ఇటీవల ఎలక్ట్రికల్ వాహనాల పై(Electric Vehicles) దృష్టిపెట్టింది. తాజాగా ఈ ఆటో దిగ్గజం నుంచి సరికొత్త విద్యుత్ వాహనం లాంఛ్ అయింది. అదే టాటా టిగోర్ ఈవీ(Tigor EV). ఈ వాహనాన్ని టాటా మోటార్స్(TATA Motors) మంగళవారం విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో దీని ప్రారంభ ధర రూ.11.45 లక్షలుగా నిర్దేశించింది. ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్ జెడ్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో టిగోర్ ఈవీ లభ్యమవుతుంది. వేరియంట్ల వారీగా ధరలు మారుతాయి. టాటా టిగోర్ ఎక్స్ఈ వేరియంట్ ధర రూ. 11.45 లక్షలుగా ఉంది. ఎక్స్ఎం వేరియంట్ ధర రూ.12.49 లక్షలు కాగా, ఎక్స్ జెడ్ ప్లస్ వేరియంట్ ధరను రూ. 12.99 లక్షలుగా నిర్ణయించింది. భద్రత పరంగా ఇచ్చే గ్లోబల్ ఎన్సీఏపీ.. ఈ వాహనానికి 4 స్టార్స్ రేటింగ్ ఇచ్చింది. ఈ వాహనం రేంజ్ 306 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ విద్యుత్ వాహనం అద్భుతమైన డిజైన్, క్లాస్ లీడింగ్ సేఫ్టీ, కంఫర్ట్, థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ను అందిస్తుందని టాటామోటార్స్ ప్రకటించింది.
మోటార్, బ్యాటరీ సామర్థ్యం ఎంత?
టాటా టిగోర్ ఈవీ 55 కిలోవాట్ పవర్, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 26 కిలోవాట్ అవర్ లిక్విడ్ కూల్డ్, హై ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీ బ్యాక్‌ను కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌కు ఐపీ67 రేటింగ్ ఇచ్చారు. దీంతోపాటు కంపెనీ 8 ఏళ్ల పాటు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ, మోటార్‌పై వారంటీ ఇచ్చింది.
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఆ ఛార్జీల నుంచి మినహాయింపు..
డైనమిక్స్, బ్యాలెన్స్డ్ సస్పెన్షన్‌తో మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని ఈ వాహనం అందించనుంది. ఇవి కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ఓఆర్వీఎం, పుష్ బటన్‌తో స్టార్ట్ అయ్యే స్మార్ట్-కీ ఆప్షన్, పోర్టబుల్ ఛార్జింగ్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి
ఫీచర్లు..
టాటా టిగోర్ ఈవీ రెగ్యులర్ ఛార్జింగ్ టైం 8 గంటల 45 నిమిషాలుగా ఉంది. ఏదైనా ఎస్ఓసీ 0 నుంచి 80 శాతం వరకు 15ఏ ప్లగ్ పాయింటుతో ఛార్జ్ చేసుకోవచ్చు. సైలెంట్ క్యాబిన్, స్పేసియస్ ఇంటీరియర్లతో యాంపిల్ హెడ్ రూం, కంఫర్టబుల్ సీటింగ్ కోసం తగినంత లెగ్ రూం, ఇన్ఫో టైన్మెంట్ కనెక్టివిటీ, ఛార్జింగ్ లాంటి సదుపాయాలు ఈ సరికొత్త వాహనంలో ఉన్నాయి. 30కిపైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. వీటిలో రిమోట్ కమాండ్లు, రిమోట్ డయాగ్నస్టిక్స్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAR, Cars, Electric Vehicle, New electric bike, Tata Motors