ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపై దృష్టి సారించాయి. ఇప్పటికే పాపులర్ బ్రాండ్స్ నుంచి అన్ని సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్లోకి మరో కొత్త ఈవీని లాంచ్ చేసింది ఇండియన్ బ్రాండ్ టాటా మోటార్స్. కంపెనీ అప్డేటెడ్ 2022 టిగోర్ ఈవీని (2022 Tigor EV) విడుదల చేసింది. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. 2022 టిగోర్ ఈవీ కొత్త మాగ్నెటిక్ రెడ్ కలర్ ఆప్షన్‌తో, సరికొత్త ఫీచర్ అప్‌గ్రేడ్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ అప్డేటెడ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్.. XE, XT, XZ+, XZ+ LUX వంటి నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
తాజాగా రిలీజ్ అయిన 2022 టిగోర్ EV, 10 కొత్త ఫీచర్లతో లభిస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. లెథెరెట్ అప్ హోల్స్టరీ, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ఈ వెహికల్ ఆకట్టుకుంటోంది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్.. మల్టీ-మోడ్ రీజెన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ- Zconnect, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, iTPMS, టైర్ పంక్చర్ రిపేర్ కిట్ వంటి వాటిని ఆఫర్ చేస్తోంది.
LIC New Plans: ఎల్ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు... బెనిఫిట్స్ ఇవే
2022 టాటా టియాగో ఈవీ IP67 సర్టిఫికేషన్‌తో 26 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 74 బిహెచ్పి పవర్, 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ARAI ధ్రువీకరించిన 315 కిమీ డ్రైవింగ్ రేంజ్‌తో వస్తుంది.
ఇండియాలో EV బిజినెస్ మంచి వృద్ధిని సాధిస్తోందన్నారు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శైలేష్ చంద్ర. 50,000 టాటా EVలు రోడ్లపైకి వచ్చాయని, ఈ రంగంలో 89% మార్కెట్ వాటా(YTD)తో టాటా మోటార్స్ టాప్ ప్లేస్‌లో ఉందన్నారు. ఇటీవలే ప్రవేశపెట్టిన టియాగో ఈవీకి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. లాంచ్ చేసిన ఒక నెలలో 20 వేల బుకింగ్స్ సాధించిందని తెలిపారు.
SBI: ఎస్బీఐ కస్టమర్లకు ఒక్క ఫోన్ కాల్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవలు
టాటా మోటార్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ప్రస్తుత టిగోర్ EV యజమానులకు ఉచిత ఫీచర్ అప్డేట్ ప్యాక్‌ను అందిస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ కస్టమర్లు తమ వాహనాలను మల్టీ-మోడ్ రీజనరేషన్, iTPMS, టైర్ పంక్చర్ రిపేర్ కిట్‌తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న XZ+, XZ+ DT కస్టమర్లు స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ అప్‌గ్రేడ్‌ను కూడా పొందవచ్చు. 2022 డిసెంబర్ 20 నుంచి ఏదైనా టాటా మోటార్స్ అధీకృత సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Cars, Electric Vehicle, Tata Motors