Home /News /business /

TATA MOTORS IS ALL SET TO LAUNCH ANOTHER ELECTRIC VEHICLE THAT WILL REVOLUTIONIZE THE SUV SEGMENT MK

Tata Motors: టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ వాహనం సిద్ధం..SUV విభాగంలో విప్లవం సృష్టించనున్న టాటా మోటార్స్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే నెక్సాన్ ద్వారా దూసుకెళ్తున్న టాటా మోటార్స్, తాజాగా మరో ఎలక్ట్రిక్ కారుతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం గతంలో తమ సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చిన వాహనాన్నే ఈ సారి ఎలక్ట్రిక్ గా మార్చి మార్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్ధం అవుతోంది.

ఇంకా చదవండి ...
    టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే నెక్సాన్ ద్వారా దూసుకెళ్తున్న టాటా మోటార్స్, తాజాగా మరో ఎలక్ట్రిక్ కారుతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం గతంలో తమ సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చిన వాహనాన్నే ఈ సారి ఎలక్ట్రిక్ గా మార్చి మార్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకోసం భారతదేశంలో తయారైన మొట్టమొదటి స్వదేశీ SUVని మార్కెట్లోకి రీఎంట్రీ చేయించబోతోంది. టాటా మోటార్స్ నుంచి వచ్చిన సియెర్రా బ్రాండ్ ను మొదటిసారిగా 1991లో ప్రారంభించి మంచి సేల్స్ సాధించింది. ఇప్పుడు అదే మోడల్ ను ఎలక్ట్రిక్ వాహనం (EV) రూపంలో మార్కెట్లోకి తిరిగి తీసుకువస్తోంది. నెక్సాన్ EV విజయం తర్వాత, ఇప్పుడు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది, అలాగే తన పాత బ్రాండ్‌లను తిరిగి మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇటీవలే, టాటా మోటార్స్ కూడా సఫారీని రీ-లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ తన టాటా సియెర్రా బ్రాండ్‌ను కూడా రీ-లాంచ్ చేయబోతోంది. ఆటో ఎక్స్‌పో 2020లో, కంపెనీ దీనిని కాన్సెప్ట్ వాహనంగా పరిచయం చేసింది. ఇది టాటా మోటార్స్ నుండి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మాత్రమే వచ్చే మొదటి కారు, కంపెనీ నుంచి వస్తున్న స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ కారు. అయితే ఈ మోడల్ లో పెట్రోల్ లేదా డీజిల్ వెర్షన్ మార్కెట్లోకి రావడం లేదు.

    WhatsApp: అలర్ట్... ఈ 30 స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... లిస్ట్ ఇదే

    టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త సిగ్మా ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది. టాటా సియెర్రా ఈ ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ యొక్క Nexon EV, Tigor EVలు వారి పెట్రోల్ ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌పై మాత్రమే రూపొందించారు. కొత్త సియెర్రా కొత్త డోర్ కాంబినేషన్‌ రూపొందించవచ్చని అంచనా వేస్తున్నారు.

    అయితే, టాటా సియెర్రా భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఇది పూర్తిగా 2025 నాటికి మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. . ఇంతలో, టాటా మోటార్స్ తన కార్ల CNG మోడల్‌లను అతి త్వరలో విడుదల చేయబోతోంది. టియాగో సిఎన్‌జి మరియు టిగోర్ సిఎన్‌జి రెండూ జనవరి 19న విడుదల కానున్నాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Electric cars, Tata Motors

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు