హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Motors: కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి భారీ షాక్.. టాటా కార్లు మరింత ప్రియం..!

Tata Motors: కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి భారీ షాక్.. టాటా కార్లు మరింత ప్రియం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tata Motors: కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఎంపిక చేసిన కొన్ని కార్ మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కారు (Car) కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఎంపిక చేసిన కొన్ని కార్ మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో టాటా ఆల్ట్రోజ్, పంచ్, సఫారి, హారియర్, టియాగో, టిగోర్ వంటి మోడల్స్ ఉన్నాయి. మరి ఆయా కారు మోడల్స్ ధరలు తాజాగా ఎంత పెరిగాయో? ఇప్పుడు పరిశీలిద్దాం.

* ఆల్టోజ్ మోడల్‌పై రూ.15 వేల వరకు పెంపు

టాటా ఆల్టోజ్ మోడల్‌లో పెట్రోల్, డీజిల్ , టర్బో పెట్రోల్ వెర్షన్స్ ఉన్నాయి. ఈ మూడు వేరియంట్స్ ధరలు తాజాగా పెరిగాయి. పెట్రోల్ మోడల్‌ ధర తాజాగా రూ.10,000 పెరిగింది. డీజిల్ వెర్షన్‌పై రూ.15,000, టర్బో-పెట్రోల్ వేరియంట్‌‌పై రూ.15,000 వరకు కంపెనీ ధరను పెంచింది. టాటా పంచ్ మైక్రో SUV ధర తాజాగా రూ.10,000 వరకు పెరిగింది. కాగా SUVలో PunchKaziranga ఎడిషన్‌ను టాటా మోటార్స్ ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసిందే.

* టిగోర్ మూడు వెర్షన్స్ ధరలు పెరుగుదల

కాంపాక్ట్ సెడాన్‌ విభాగంలో టాటా టిగోర్ మోడల్ వేరియంట్‌ను బట్టి రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ధర పెరిగింది. టిగోర్ మోడల్ పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ వంటి మూడు వెర్షన్స్ ఉన్నాయి. టాటా టియాగో పెట్రోల్ వెర్షన్‌పై రూ.15,000 వరకు ధర పెరిగింది. CNG వెర్షన్‌లో XE, XM, XT, XZ ప్లస్ వంటి వేరియంట్స్ ఉన్నాయి. ఈ వేరియంట్స్ ధరలు రూ.15,000 వరకు ఖరీదుగా మారాయి. టాటా టియాగో NRG XT వేరియంట్ ధర తాజాగా రూ.12,000 పెరిగింది. XZ వేరియంట్ ధర రూ.15,000 పెరిగింది. ఇక టాటా హారియర్, టాటా సఫారి మోడల్స్ ధరలు ఏకంగా రూ.25,000 పెరిగాయి.

* టాటా హారియర్ బుకింగ్స్ ప్రారంభం..

కాగా, గ్రేటర్ నోయిడా వేదికగా జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ టాటా హరియర్‌ను ప్రదర్శించింది. ADAS(అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్), సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ SUV మల్టిపుల్ కలర్ ఆప్షన్‌లో లభించనుంది.

ఇది కూడా చదవండి : సుకన్య సమృద్ధి యోజన, ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ.. ఈ రెండింటిలో ఏది బెటర్..!

బ్లాక్, బ్లూ, ట్రాపికల్ మిస్ట్, రెడ్, వైట్అండ్ గ్రే వంటి కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. తాజాగా టాటా హారియర్ కోసం కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. మహింద్రా XUV700, MG హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్, కియా సెల్టోస్‌ వంటి ఇతర కంపెనీల కార్లతో టాటా హరియర్ మార్కెట్‌లోకి పోటీగా వచ్చింది.

* స్టాండర్డ్ వారంటీ పెంపు

E20 కంప్లైంట్ ఇంజన్స్, RDE నిబంధనలకు అనుగుణంగా ఇటీవల టాటా మోటార్స్ BS6 ఫేజ్ II రేంజ్ ప్యాసింజర్ వాహనాలను లాంచ్ చేసింది. రెండు సంవత్సరాలు/75,000 కి.మీ నుంచి మూడు సంవత్సరాలు/1 లక్ష కి.మీల రేంజ్‌తో తమ స్టాండర్డ్ వారంటీని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ఇటీవల ప్రకటించింది.

First published:

Tags: Auto, New cars, Tata cars, Tata Motors

ఉత్తమ కథలు