హోమ్ /వార్తలు /బిజినెస్ /

TATA Motors: మొట్టమొదటి వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ స్టార్ట్‌ చేసిన టాటా మోటార్స్‌.. పూర్తి వివరాలు ఇలా

TATA Motors: మొట్టమొదటి వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ స్టార్ట్‌ చేసిన టాటా మోటార్స్‌.. పూర్తి వివరాలు ఇలా

PC : TATA Motors

PC : TATA Motors

TATA Motors: తాజాగా  లైఫ్‌టైమ్ ముగిసిన వాహనాలను రెస్ పెక్ట్‌తో రీసైకిల్ చేయడానికి భారత్‌లో ప్రత్యేకంగా మొట్టమొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది టాటా మోటార్స్.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors).. కాలుష్యాన్ని తగ్గించడం కోసం తన వంతు బాధ్యతగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఆర్‌డీఈ(RDE) నిబంధనలకు అనుగుణంగా వాహనాలను తీసుకొస్తోంది. తాజాగా లైఫ్‌టైమ్ ముగిసిన వాహనాలను రెస్ పెక్ట్‌తో రీసైకిల్ చేయడానికి భారత్‌లో ప్రత్యేకంగా మొట్టమొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. దీనికి Re.Wi.Re అని నామకరణం చేసింది. Re.Wi.Re అంటే రీ సైకిల్ విత్ రెస్పెక్ట్ అని అర్థం. ఈ యూనిట్ రాజస్తాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించింది.

* ఫ్యూయల్ ఎఫిసియట్ వాహనాలతో రీప్లేస్

టాటా మోటార్స్ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్‌ను తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇది సంవత్సరానికి 15,000 వాహనాలను స్క్రాప్ చేయనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ...

“నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని సర్యులర్ ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేయడానికి ప్రవేశపెట్టాం. ఇది పనికిరాని, కాలుష్యం వెదజల్లే వాహనాలను దశలవారీగా తొలగించడానికి అవసరమైన ఎకో సిస్టమ్‌ను క్రియేట్ చేస్తుంది. తద్వారా ఇంధన సామర్థ్య వాహనాలతో రీప్లేస్ చేయడం వల్ల దేశంలో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.’’ అని గడ్కరీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : కొత్త ఇంజిన్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తో సరికొత్తగా అల్కాజర్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

* సేఫ్‌గా, సస్టైనబుల్‌గా డిస్‌మాటిల్

Re.Wi.Re ద్వారా వరల్డ్-క్లాస్, ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ అనుసరించి ఎండ్- ఆఫ్ లైఫ్ వాహనాలను సేఫ్‌గా, సస్టైనబుల్‌గా డిస్‌మాటిల్ చేయనున్నారు. దీన్ని గంగానగర్ వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసింది. టాటా మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహిస్తుంది. అన్ని బ్రాండ్స్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలను ఇది స్క్రాప్ చేస్తుంది.

* పూర్తిగా డిజిటలైజేషన్

టైర్లు, బ్యాటరీలు, ఫ్యూయల్, ఆయిల్స్, లిక్విడ్స్, గ్యాసెస్ వంటి కాంపోనెంట్స్ సేఫ్‌గా డిస్‌మ్యాటిల్ చేయడానికి ప్రత్యేక స్టేషన్‌లను ఇది కల్గి ఉంది. అంతేకాకుండా పేపర్‌లెస్ ఆపరేషన్స్ నిర్వహించడానికి Re.Wi.Reను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. స్క్రాపింగ్ ప్రక్రియకు ముందు ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్స్‌ SOP ప్రకారం కఠినమైన డాక్యుమెంటేషన్, డిస్‌మ్యాటిల్ ప్రక్రియ‌కు వెళతాయి.

* వ్యర్థాలను తగ్గించడం కోసం

టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ.. టాటా మోటార్స్‌లో మొబిలిటీని గ్రీనర్‌గా, సస్టైనబులిటీగా మార్చడానికి ప్రతి అంశాన్ని పరిశోధించడానికి కట్టుబడి ఉన్నాం. ఈ RVSF (రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ) అనేది వాహనాలను బాధ్యతాయుతంగా స్క్రాప్ చేయడంలో కొత్త ప్రారంభాన్ని తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బెంచ్‌మార్క్, ఆప్టిమైజ్ చేసిన రీసైక్లింగ్ ప్రక్రియలతో భవిష్యత్ ఉపయోగం కోసం స్క్రాప్ నుంచి గరిష్ట విలువను అందించడానికి, తద్వారా వ్యర్థాలను తగ్గించాలని మేం భావిస్తున్నాం.’’ అని గిరీష్ వాఘ్ తెలిపారు.

గ్లోబల్ స్టాండర్డ్స్‌తో సమానంగా ఈ నాణ్యమైన సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు టాటా మోటార్స్‌ను కేంద్ర మంత్రి గడ్కరీ అభినందించారు. దక్షిణాసియా ప్రాంతంలో వాహనాల స్క్రాపింగ్ హబ్‌గా భారత్‌ను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో ఇటువంటి అత్యాధునిక స్క్రాపింగ్, రీసైక్లింగ్ యూనిట్స్ మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని గడ్కరీ పేర్కొన్నారు.

First published:

Tags: Auto, Tata Motors

ఉత్తమ కథలు