ఇండియన్ ఆటోమొబైల్(Automobile) మార్కెట్‌లో(Market) దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్(Tata Motors) దూసుకుపోతోంది. గత రెండు సంవత్సరాలలో సంస్థ ఎన్నో వాహనాలను దేశంలో లాంచ్(Launch) చేసింది. ప్రత్యేకించి SUV సెగ్మెంట్‌లో(Segment) ఉనికిని టాటా మోటార్స్(Tata Motors) సుస్థిరం చేసుకుంది. సబ్-4-మీటర్ SUV విభాగంలో టాటా పంచ్‌తో(Tata Punch) ప్రారంభించి, టాటా హారియర్, కొత్త-జెనరేషన్(New Generation) సఫారి వంటి వాటిని విడుదల చేసింది. 2022లో టాటా మోటార్స్ ఈ లైనప్‌లో అనేక కొత్త చేర్పులను చేయనుంది. 2022లో, రాబోయే నెలల్లో టాటా నుంచి మరికొన్ని SUVలు లాంచ్ కానున్నాయి. ఈ జాబితాలో ఉన్న టాప్ 5 SUVలు ఏవో చూద్దాం.
* టాటా నెక్సాన్ EV 2022 (Tata Nexon EV 2022)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కారు, టాటా నెక్సాన్ EV.. ఈ సంవత్సరం అప్‌డేట్ వెర్షన్‌గా రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది. టాటా కంపెనీ నెక్సాన్ EV కొత్త వేరియంట్‌పై పని చేస్తోందని నివేదికలు పేర్కొన్నాయి. ఇది ఇప్పటికే ఉన్న మోడల్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని సాయంతో ప్రస్తుతం ఉన్న 312 కి.మీ పరిధితో పోలిస్తే.. కొత్త మోడల్ 400 కి.మీ రేంజ్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ EVలో కొన్ని డిజైన్ అప్‌గ్రేడ్‌లను కూడా టాటా కంపెనీ చేపట్టే అవకాశం ఉంది.
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ (Tata Harrier Facelift)
టాటా నుంచి వచ్చిన 5 సీట్ల SUV హారియర్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు కూడా 2022లో కంపెనీ లాంచ్ చేయనుంది. టాటా కంపెనీ హారియర్‌ను 2019లో ఆవిష్కరించింది. ఈ SUVకి సంబంధించిన పెద్ద అప్‌డేట్ లేదా ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ ఇంకా బయటకు రాలేదు. తాజా ఫేస్‌లిఫ్ట్ ఎడిషనల్‌లో కంపెనీ డిజైన్, ఫీచర్ అప్‌డేట్లతో పాటు పెట్రోల్ వేరియంట్‌ను కూడా అందించే అవకాశం ఉంది. కొత్త హారియర్ కోసం టాటా కొత్త, శక్తివంతమైన 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌పై పని చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ SUV 2.0 లీటర్ (170PS/350Nm) డీజిల్ యూనిట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
టాటా సియెర్రా (Tata Sierra)
టాటా కంపెనీ సియెర్రా SUV కాన్సెప్ట్‌ను ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించింది. SUV ప్రొడక్షన్ మోడల్‌ను తీసుకురావడానికి కంపెనీ ధ్రువీకరించనప్పటికీ, ఇటీవలి నివేదికల ప్రకారం.. సియెర్రా 2022లో భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఈ SUV.. ఎలక్ట్రిక్ పవర్ టెర్రైన్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
టాటా బ్లాక్‌బర్డ్ (Tata Blackbird)
కొత్త బ్లాక్‌బర్డ్ లాంచ్‌తో టాటా తన ప్రీమియం కాంపాక్ట్ SUV లైనప్‌ను వైవిధ్యంగా మార్చనుంది. ఈ SUV 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. బ్లాక్‌బర్డ్ వేరియంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ SUV విజువల్ అప్పీల్ పరంగా కస్టమర్లను ఆకర్షించనుందని భావిస్తున్నారు. బ్లాక్‌బర్డ్ ఎస్‌యూవీ.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్, MG ఆస్టర్, స్కోడా కుషాక్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!
టాటా పంచ్ ఐటర్బో (Tata Punch iTurbo)
ఇటీవల విడుదల చేసిన టాటా పంచ్ కాంపాక్ట్ SUV.. డిజైన్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో కార్ లవర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ SUV లైనప్‌లో మరింత శక్తివంతమైన టర్బో పెట్రోల్ వేరియంట్‌ను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. పంచ్ కొత్త వేరియంట్ 2022 చివర్లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: SUV, Tata cars, Tata Motors