హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Motors: టాటా మోటార్స్ దీపావళి డిస్కౌంట్స్.. ఈ కార్ల ధరలు భారీగా తగ్గింపు

Tata Motors: టాటా మోటార్స్ దీపావళి డిస్కౌంట్స్.. ఈ కార్ల ధరలు భారీగా తగ్గింపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TATA Diwali Offers: ఈ దీపావళికి కొత్త కార్ల కొనుగోలుపై టాటా మోటార్స్ బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది. అక్టోబర్ నెలలో టాటా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 40,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. వివిధ మోడళ్లపై ఈ కంపెనీ అందిస్తున్న స్పెషల్ దీపావళి ఆఫర్లు చెక్ చేద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Tata Motors:  ఫెస్టివల్ సీజన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి (Automobile Industry) కీలక సమయం. ఈ టైమ్‌లో సేల్స్ పెంచుకోవడానికి ఆటోమొబైల్ కంపెనీలు భారీగా ఆఫర్లను అందిస్తుంటాయి. దీంతో దసరా(Dussehra)  నుంచి సంక్రాతి (Sankranti) వరకు కొనసాగే పండుగ సీజన్‌లో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఇండియన్ ఆటోమొబైల్ బ్రాండ్ టాటా మోటార్స్ (TATA Motors).ఈ దీపావళికి కొత్త కార్ల కొనుగోలుపై టాటా మోటార్స్ బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది. అక్టోబర్ నెలలో టాటా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 40,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. వివిధ మోడళ్లపై ఈ కంపెనీ అందిస్తున్న స్పెషల్ దీపావళి ఆఫర్లు చెక్ చేద్దాం.

* టాటా టిగోర్ (Tata Tigor)

ఇండియాలో టాటా టిగోర్ సెడాన్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 8.29 లక్షల వరకు ఉంది. అయితే అక్టోబర్ నెలలో టాటా టిగోర్ కొనుగోలు చేసేవారు రూ. 20,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 10000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ ఉన్నాయి. టిగోర్ సెడాన్ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 86PS శక్తిని, 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

* టాటా సఫారీ (TATA Safari)

ప్రస్తుతం టాటా సఫారీ ధర రూ. 15.35 లక్షల నుంచి రూ. 23.56 లక్షల వరకు ఉంది. దీపావళి ఆఫర్లలో ఈ ఎస్‌యూవీని రూ. 40,000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. దీనిపై కంపెనీ రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ అందిస్తోంది. కానీ ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. టాటా సఫారీ వెహికల్‌లో 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 170 PS పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రైల్వే ప్రయాణికులకు షాక్.. ఈ 6 రైళ్లు రద్దు, మరో 2 దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే

* టాటా హారియర్  (TATA harrier)

టాటా హారియర్ ధర రూ. 14.7 లక్షల నుంచి రూ. 22.2 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అయితే తాజా సేల్‌లో ఈ SUVపై కస్టమర్లు రూ. 40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్చేంజ్ బెనిఫిట్‌తో కలిసి ఈ మేరకు ధర తగ్గుతుంది. టాటా హారియర్ 2.0 లీటర్ 4 సిలిండర్ 1956cc డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 350Nm టార్క్, గరిష్టంగా 170PS శక్తిని విడుదల చేస్తుంది. SUV బూట్ స్పేస్ 425 లీటర్లు కాగా, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లుగా ఉంది.

* టాటా టియాగో (TATA Tiago)

టాటా టిగోర్ ధర రూ. 5.4 లక్షల నుంచి రూ. 7.82 లక్షల వరకు ఉంది. అయితే దీని కొనుగోలుపై ఇప్పుడు రూ. 20,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొనుగోలుదారులు రూ. 10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్, రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. టాటా టియాగో కారులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌.. 86PS వపర్‌ను, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

* టాటా టిగోర్ CNG (TATA tigor CNG)

టాటా టిగోర్ CNG ధర రూ. 7.40 లక్షల నుంచి రూ. 8.59 లక్షల వరకు ఉంది. అయితే ఈ నెలలో టాటా టిగోర్ CNG కారును కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 25,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ రూ. 15,000గా ఉంది. ఈ కారులోని 1.2-లీటర్ ఇంజిన్ 73PS పవర్, 95Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

First published:

Tags: Business, Tata, Tata cars, Technology

ఉత్తమ కథలు