ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఎన్నడూ లేనివిధంగా రీసెంట్ టైమ్స్ లో వెహికల్స్ విక్రయిస్తోంది. ఈ దిగ్గజ సంస్థ ఇప్పుడు ప్రతి నెలా దాదాపు 40,000 యూనిట్లను విక్రయిస్తోంది. గొప్ప విషయం ఏమిటంటే, అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ, టాటా మోటార్స్ అనేక మోడళ్లపై ఏకంగా రూ.65,000 వరకు బెనిఫిట్స్ (Benefits), ఆకర్షణీయమైన డిస్కౌంట్లు (Discounts) అందిస్తూనే ఉంది. టాటా మోటార్స్ అందిస్తున్న ఈ ఆకర్షణీయమైన ఆఫర్లపై ఇప్పుడో లుక్కేద్దాం.
టాటా హారియర్ (Tata Harrier)
టాటా హారియర్ కొనుగోలు చేసేవారు రూ.65,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. టాటా మోటార్స్ కార్లలో (Tata motors cars) హారియర్ రెండవ అత్యంత ఖరీదైన కారు. హారియర్ చక్కటి డిజైన్, దృఢమైన బాడీ, గ్రేట్ రైడ్ ఎక్స్‌పీరియన్స్, సెన్సిటివ్ హ్యాండ్లింగ్, విశాలమైన క్యాబిన్‌ను అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ అన్ని వేరియంట్‌లపై రూ.40,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌తో సహా రూ.65,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కార్పొరేట్ కొనుగోలుదారులు రూ.20,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. హారియర్ ధర రూ.14.65 లక్షల నుంచి రూ.21.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)గా ఉంటుంది.
టాటా సఫారీ (Tata Safari)
మోస్ట్ ఐకానిక్ కార్ టాటా సఫారీని కొనుగోలు చేసేవారు రూ.45,000 వరకు బెనిఫిట్స్ దక్కించుకోవచ్చు. ఈ కారు మరింత సౌకర్యవంతమైన మూడో వరుస సీట్లను కలిగి ఉంది. టాటా సఫారీపై రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు, అయితే కొందరు కార్పొరేట్ కొనుగోలుదారులు రూ.20,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. టాటా సఫారీపై ఎస్‌బీఐ కస్టమర్లు అదనపు డిస్కౌంట్‌లు అందుకోవచ్చు. టాటా సఫారీ రూ. 15.25 లక్షల నుంచి రూ.23.46 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) మధ్య ఉంటుంది.
టాటా టియాగో (Tata Tiago)
సేఫ్టీ, వ్యాల్యూ ఫర్ మనీ పరంగా బెస్ట్ కారు టాటా టియాగో అని చెప్పచ్చు. టాటా మోటార్స్ ఈ కారుపై రూ.31,500 వరకు బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. సైజులో చిన్నది కానీ సేఫ్టీ విషయంలో ఈ కారు ఉత్తమంగా నిలుస్తుంది. టియాగో కారుకు మారుతి సుజుకి వ్యాగన్ R, హ్యుందాయ్ శాంత్రో వంటివి బలమైన పోటీ ఇస్తున్నాయి. టియాగో కారు ఎక్స్ఈ (XE), ఎక్స్ఎం (XM), ఎక్స్టీ (XT) వేరియంట్‌ల్లో లభిస్తుంది. ఈ వేరియంట్‌లపై రూ.21,500 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. XZ, అంతకంటే ఎక్కువ వేరియంట్‌లపై రూ.31,500 వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. సీఎన్‌జీతో నడిచే కొత్త టియాగోకు ఎలాంటి డిస్కౌంట్లు లేకపోవడం గమనార్హం. ఈ కారు రూ.5.38 లక్షల నుంచి రూ.7.80 లక్షల మధ్య ఉంటుంది.
టాటా టిగోర్ (Tata Tigor)
టాటా టిగోర్ కారుపై రూ.31,500 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ కారు ఫీచర్ రిచ్ క్యాబిన్‌ని కలిగి ఉంది. టాటా టిగోర్ కారుకు మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ బలమైన పోటీ ఇస్తున్నాయి. రూ.31,500 వరకు ప్రయోజనాలతో టిగోర్‌ను కొనుగోలు చేయవచ్చు. టిగోర్ లోయస్ట్ వేరియంట్స్ అయిన ఎక్స్ఈ(XE), ఎక్స్ఎం (XM)పై రూ.21,500 వరకు డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌జెడ్ (XZ), అంతకంటే ఎక్కువ వేరియంట్‌లు రూ.10,000 వరకు డిస్కౌంట్లు అందిస్తాయి. సీఎన్‌జీతో నడిచే కొత్త టిగోర్‌పై ఎలాంటి డిస్కౌంట్‌లు లేవు. టాటా టిగోర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.98 లక్షల నుంచి రూ.8.57 లక్షల మధ్య ఉంటుంది.
టాటా నెక్సాన్ (Tata Nexon)
మోస్ట్ పాపులర్ టాటా కారు అయిన టాటా నెక్సాన్ (Tata Nexon)పై రూ.10,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. టాటా నెక్సాన్ మార్చి 2022లో 14,315 యూనిట్ల అమ్మకాలతో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. నెక్సాన్ కారుకు కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా XUV300, కియా సోనెట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీల గట్టి పోటీ ఎదురవుతోంది. నెక్సాన్ 120hp, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 110hp, 1.5-లీటర్ డీజిల్ మోటార్ అనే రెండు ఇంజన్ల ఆప్షన్స్ అందిస్తుంది. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌లు రూ.6,000 వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. డీజిల్ వేరియంట్‌లు రూ.10,000 వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. టాటా నెక్సాన్ ధర రూ.7.55 లక్షలు-రూ.13.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర) మధ్య ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Cars, Discounts, Tata cars