హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Motors: మూడు లక్షల మైలురాయిని తాకిన టాటా నెక్సాన్​ అమ్మకాలు.. కొత్తగా మరో నాలుగు వేరియంట్లో..

Tata Motors: మూడు లక్షల మైలురాయిని తాకిన టాటా నెక్సాన్​ అమ్మకాలు.. కొత్తగా మరో నాలుగు వేరియంట్లో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్​ తన నెక్సాన్​ కాంపాక్ట్ ఎస్​యూవీ లైనప్​లో నాలుగు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. టాటా నెక్సాన్ 3 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకున్న సందర్భంగా.. నెక్సాన్​ లైనప్​లో మరో నాలుగు కొత్త వేరియంట్లను జోడించింది.

ఇంకా చదవండి ...

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్​(Tata Motors) తన నెక్సాన్​ కాంపాక్ట్ ఎస్​యూవీ లైనప్​లో నాలుగు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. టాటా నెక్సాన్ 3 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకున్న సందర్భంగా.. నెక్సాన్​ లైనప్​లో మరో నాలుగు కొత్త వేరియంట్లను జోడించింది. XZ+ (HS), XZA+ (HS), XZ+ (P), XZA+ (P) వేరియంట్లను పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ల ధర కనిష్టంగా రూ. 10.87 లక్షల నుంచి మొదలై రూ. 13.54 లక్షల వరకు ఉంటుంది. త్వరలోనే వీటి బుకింగ్‌ కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా నెక్సాన్(Nexon) కొత్త వేరియంట్లు అన్ని అధీకృత టాటా మోటార్స్(Motors) డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కాగా, టాటా నెక్సాన్​ పూర్తి చేసుకున్న 3 లక్షల యూనిట్లు పుణెలోని రంజన్‌గావ్ ప్లాంట్​లోనే తయారు కావడం గమనార్హం.

మూడు లక్షల నెక్సాన్​ ఎస్​యూవీల అమ్మకాలు..

కొత్తగా విడుదలైన నాలుగు టాటా నెక్సాన్​ వేరియంట్ల ధరను పరిశీలిస్తే.. నెక్సాన్​ XZ+ (P) ధర రూ. 11,58,900 కాగా, XZA+ (P) ధర రూ. 12,23,900, నెక్సాన్​ XZ+ (HS) ధర రూ. 10,86,800, నెక్సాన్​ XZA+ (HS) ధర రూ. 11,51,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ఉంటాయి. ఈ కొత్త వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. అలాగే ఇవి కొత్త రాయల్ బ్లూ ఎక్స్​టీరియర్ పెయింట్ థీమ్‌లో కూడా లభిస్తాయి. టాటా నెక్సాన్ కొత్త వెర్షన్లు ప్రస్తుత మోడల్ మాదిరిగానే అదే డిజైన్‌తో వస్తాయి. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు.

Online Degree Courses: ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను యూజీసీ సిద్ధం.. దేశవ్యాప్తంగా 900 కళాశాలల్లో అందుబాటులోకి..!


అయితే, నెక్సాన్​ XZ+ (P), XZA+ (P) వంటి కొత్త వేరియంట్లు బెనెక్యూ కాలికో లెథెరెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి అదనపు ప్రీమియం ఫీచర్లతో రానున్నాయి. మరోవైపు కొత్త XZ+ (HS), XZA+ (HS) వేరియంట్లు ఎయిర్ ప్యూరిఫైయర్‌ ఫీచర్​తో వస్తాయి. ఈ వేరియంట్లు డార్క్​ ఎడిషన్‌లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ నాలుగు కొత్త వేరియంట్లలో 1.5- లీటర్ డీజిల్ ఇంజన్ లేదా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లను అమర్చనున్నారు. ఇక, వీటి ఇంటీరియర్‌లో 7 -అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆపిల్ కార్‌ప్లే, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, వెనుక వైపు పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లను అందించింది.

POCO X4 Pro 5G: పోకో ఎక్స్​4 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. 108 ఎంపీ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్లు..


రంజన్‌గావ్ ప్లాంట్ నుంచి 8 నెలల్లో లక్ష యూనిట్ల అమ్మకాలు..

నివేదిక ప్రకారం, టాటా పూణేలోని రంజన్‌గావ్ ప్లాంట్​ నుండి గత ఏడాది జూన్‌లో 2 లక్షల విక్రయాల మార్కును అధిగమించింది. ఆశ్చర్యకరంగా 8 నెలల్లోపు లక్ష యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. GNCAP 5 స్టార్ రేటింగ్‌తో, టాటా నెక్సాన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్​లో సురక్షితమైన, అత్యంత ఇష్టపడే కాంపాక్ట్- ఎస్​యూవీగా మారింది. ఇప్పుడు మరో నాలుగు వేరియంట్ల జోడింపుతో, నెక్సాన్ మార్కెట్​ గణనీయంగా పెరగనుంది.

First published:

Tags: Cars, Luxury cars, Nexon, SUV, Tata Motors

ఉత్తమ కథలు