Home /News /business /

TATA MOTORS BUMPER OFFER DISCOUNT UP TO RS 70 THOUSAND THESE ARE THE DISCOUNTED MODELS UMG GH

Tata Motors: టాటా మోటార్స్ బంపర్ ఆఫర్ ! రూ.70 వేల వరకు తగ్గింపు.. డిస్కౌంట్ లభించే మోడళ్లు ఇవే ..?

టాటా మోటార్స్ (టాటా సఫారీ)

టాటా మోటార్స్ (టాటా సఫారీ)

టాటా మోటార్స్(Tata Motors) జులై నెలలో భారతదేశంలో వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ ఆఫర్లు నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. నిర్దిష్ట మోడల్‌, వేరియంట్‌ (Variant) ఆధారంగా రూ.70,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

టాటా మోటార్స్ (Tata Motors)జులై నెలలో భారతదేశంలో వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ ఆఫర్లు నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. నిర్దిష్ట మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా రూ.70,000 వరకు డిస్కౌంట్‌ (Discounts)పొందవచ్చు. కనీస తగ్గింపు మొత్తం రూ.7,500గా ఉండనుంది. జులైలో టాటా మోటార్స్ అందిస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్‌.. హారియర్, సఫారి, నెక్సాన్ SUV, ఆల్ట్రోజ్, టియాగో హ్యాచ్‌బ్యాక్‌, టిగోర్‌ సబ్-కాంపాక్ట్ సెడాన్‌పై వర్తిస్తాయి. అయితే ఈ డిస్కౌంట్లలో పంచ్ SUV లేదా ఏదైనా ఎలక్ట్రిక్ కార్లు(Electric Cars), CNG వాహనాలు ఉండవు.

* జులైలో టాటా మోటార్స్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్‌లు ఇవే..

* టాటా హారియర్
టాటా మోటార్ ఫ్లాగ్‌షిప్ SUV హారియర్ ఈ నెలలో అతిపెద్ద డిస్కౌంట్‌తో వస్తుంది. టాటా కంపెనీ జులైలో హారియర్ SUVపై రూ.70,000 వరకు ఆఫర్ చేస్తోంది. ఇందులో కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.5,000తో పాటు రూ.40,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ఉద్యోగి లేదా విక్రేతగా ఉన్న వారికి అదనంగా రూ.25,000 తగ్గింపు లభిస్తుంది.

* టాటా సఫారి
మూడు వరుసల సఫారీ SUVపై టాటా మోటార్స్ ఈ నెలలో రెండో అత్యధిక డిస్కౌంట్‌ను అందిస్తోంది. సఫారి SUVపై కంపెనీ రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. సఫారీకి ఏ ఇతర అదనపు రాయితీలు లభించవు.

ఇదీ చదవండి : IND vs ENG : నువ్వు టీమిండియాలో ప్లేయర్ గా ఉన్నావా.? లేక చీర్ లీడర్ గా ఉన్నావా.? లేదంటే ఎందిదీ?

* టాటా టిగోర్
టాటా మోటార్స్ టిగోర్ సబ్-కాంపాక్ట్ సెడాన్‌పై రూ.33,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. టిగోర్‌ లేదా అంతకంటే ఎక్కువ XZ వేరియంట్‌లపై ఆఫర్ లభిస్తుంది. టాటా మోటార్స్ టిగోర్‌ లోయస్ట్‌ వేరియంట్‌లపై రూ.23,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. టిగోర్ డిస్కౌంట్లలో ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ అలాగే ఉద్యోగులు, విక్రేతలకు తగ్గింపు ఉన్నాయి.

* టాటా టియాగో
టియాగో హ్యాచ్‌బ్యాక్ XZ లేదా అంతకంటే ఎక్కువ వేరియంట్‌లకు రూ.28,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. టియాగో అన్ని ఇతర తక్కువ వేరియంట్‌లకు, టాటా మోటార్స్ రూ.18,000 వరకు తగ్గింపును అందిస్తోంది. దీనిపై డిస్కౌంట్లు ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ అలాగే ఉద్యోగులు మరియు విక్రేతలకు తగ్గింపు ఆప్షన్‌లు ఉన్నాయి.

* టాటా నెక్సాన్
సబ్-కాంపాక్ట్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ Nexon SUV. దీనిపై కూడా రూ.15,000 వరకు తగ్గింపు లభిస్తుంది. టాటా మోటార్స్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. డీజిల్ వేరియంట్‌లకు గరిష్ట తగ్గింపు, పెట్రోల్ వేరియంట్‌లు రూ.8,000 వరకు ఆఫర్‌లను పొందుతాయి.



* టాటా ఆల్ట్రోజ్
టాటా మోటార్స్ నుంచి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రూ.10,000 వరకు తగ్గింపుతో వస్తుంది. ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో తగ్గింపులు అందిస్తోంది. ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్‌లు రూ.7,500 వరకు తగ్గింపు పొందుతాయి.
Published by:Mahesh
First published:

Tags: Car prices, Electric cars, Offers, Tata Motors

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు