ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL). ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ ద్వారా తమ ప్రొడక్టులను ఎక్కువ మందికి చేరువ చేసేందుకు కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఇప్పుటు టాటా మోటార్స్ (Tata Motors) అదే పనిలో ఉంది. టాటా మోటార్స్ ఇటీవల ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కారుకు మరింత ప్రచారం కల్పించి, అమ్మకాలు పెంచుకునేందుకు, ఐపీఎల్ 2023 ఎడిషన్‌కు అఫిషియల్ పార్టనర్‌గా ప్రకటించింది. దీంతో బీసీసీఐ, టాటా మోటార్స్ మధ్య వరుసగా ఆరో ఏడాది కూడా పార్టనర్‌షిప్ కుదరడం గమనార్హం.
* ఈవీలపై అవగాహన కల్పించడానికి
టాటా మోటార్స్ ఐపీఎల్-2023 అఫిషియల్ పార్టనర్‌షిప్ ద్వారా ఈవీలపై అవగాహన కల్పించనుంది. ముఖ్యంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టియాగో.ఈవీకి సంబంధించిన ఆఫర్లను ప్రదర్శించడానికి ఐపీఎల్ ప్లాట్ ఫామ్‌ను ఉపయోగించుకోనుంది. దీంతో ఐపీఎల్ జరిగే అన్ని వేదికల్లో టాటా టియాగో.ఈవీని ప్రదర్శించనుంది.
* Tiago.ev ఎలక్ట్రిక్ స్ట్రైకర్ పేరుతో అవార్డ్
టాటా మోటార్స్ '100 రీజన్స్ go.ev విత్ Tiago.ev' అనే ప్రచారాన్ని నిర్వహించనుంది. ఈ ప్రచారం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల అడాప్షన్‌కు సంబంధించి ఉన్న సమస్యలపై దృష్టిసారిస్తుంది. అంతేకాకుండా Tiago.ev ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డు పేరుతో మ్యాచ్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడికి ట్రోఫీతో పాటు రూ.1,00,000 నగదు బహుమతిని కూడా టాటా మోటార్స్ అందజేయనుంది.
అంతేకాకుండా Tiago.ev ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు విజేతకు బ్రాండ్-న్యూ Tata Tiago.evలో డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కర్ణాటకలోని కాఫీ తోటల జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన మొక్కలు నాటడం కోసం టాటా మోటార్స్ రూ.5,00,000 విరాళంగా అందజేస్తుంది. ఐపీఎల్-2023లో ప్రదర్శిస్తున్న Tiago.ev కారుకు బాల్ తగిలిన సందర్భంలో టాటా మోటార్స్ ఈ విరాళం అందజేయనుంది. బాల్ కార్‌కు ఎన్నిసార్లు తగిలితే అన్నిసార్లు విరాళం ఇవ్వనుంది.
* 2018 నుంచి IPLతో అనుబంధం
టాటా EV ఓనర్స్‌కు కంపెనీ రివార్డ్‌లను కూడా అందజేయనుంది. మ్యాచ్‌లను చూడటానికి కంపెనీ టిక్కెట్లను ఆఫర్ చేయనుంది. కాగా, టాటా మోటార్స్ 2018 నుంచి IPLతో అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటివరకు నెక్సాన్, హారియర్, ఆల్టోజ్, సఫారీ, పంచ్ వంటి టాప్ మోడల్స్‌ను ఐపీఎల్‌లో ప్రదర్శించింది. పర్యావరణ అనుకూల ట్రాన్స్‌ఫోర్ట్‌ను ప్రోత్సహించడం కోసం టాటా మోటార్స్ ఈ ఏడాది Tiago.evను ఐపీఎల్‌లో హైలెట్ చేయనుంది.
* ఈవీలను ప్రోత్సహించడానికి కృషి
ఐపీఎల్ భాగస్వామ్యంపై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘‘దేశంలో EVలు పెరగడానికి తమ వంతుగా కృషి చేస్తున్నాం. ఐపీఎల్ అఫిషియల్ పార్టనర్‌షిప్ ద్వారా EVలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. తద్వారా నగర ప్రాంతాలలోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా EVల ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఐపీఎల్ మాకు కీలకం కానుంది. భారతదేశంలో EVలను వేగంగా స్వీకరించడానికి ఈ భాగస్వామ్యం ద్వారా ప్రోత్సహిస్తాం.’’ అని వివేక్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cars, IPL 2023, Tata Motors, Tiago