హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ford Car Plant : "ఫొర్డ్" ప్లాంట్‌పై బ‌డా కంపెనీల క‌న్ను.. ఎందుకోసం

Ford Car Plant : "ఫొర్డ్" ప్లాంట్‌పై బ‌డా కంపెనీల క‌న్ను.. ఎందుకోసం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు చెందిన ప్రీమియం కార్ల తయరీ సంస్థ ఫోర్డ్​ సంస్థ (Ford) సంచలన నిర్ణయం తీసుకొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కంపెనీల‌కు చెందిన ప్లాంట్‌ల‌ను దేశంలోని ప్ర‌ముఖ కంపెనీలు టాటా (TATA), మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra and Mahindra), కియా, ఎంజీ హెక్టార్ (MG Hector) కంపెనీలు కొన‌డానికి ఆస‌క్తి చూపుతున్నాయి.

ఇంకా చదవండి ...

  అమెరికాకు చెందిన ప్రీమియం కార్ల తయరీ సంస్థ ఫోర్డ్​ సంస్థ (Ford) సంచలన నిర్ణయం తీసుకొన్న విష‌యం తెలిసిందే. భారతీయ ఆటోమొబైల్ (Auto Mobile) మార్కెట్​కు గుడ్​బై చెప్పింది. ఈ మేరకు భారత్​లోని ఫోర్డ్​ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో, సంసద్​(గుజరాత్​), చెన్నై (తమిళనాడు) నగరాల్లోని రెండు ప్లాంట్లను త్వరలోనే మూనివేయనుంది. ఈ నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌ముఖ కంపెనీలు టాటా (TATA), మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra and Mahindra), కియా, ఎంజీ హెక్టార్ (MG Hector) కంపెనీలో ఈ ప్లాంట్‌ల‌ను కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో కార్ల మార్కెట్ గ‌ణ‌నీయంగా పెరిగిన‌ విష‌యం తెలిసిందే ఈ నేప‌థ్యంలో కార్ త‌యారీ ప్లాంట్ కొన‌డం అనేది సంస్థ‌ల‌కు లాభ‌దాయంకంగా ఉంది.

  ప్లాంట్‌ల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం..

  త‌మిళ‌నాడులోని చెన్నై మ‌రామ‌ల‌య్ న‌గ‌రంలో ఉన్న ఫోర్డ్ ఫ్యాక్ట‌రీ (Factory) వార్షిక ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం (Capacity) 2,00,000 వాహ‌నాలు 3,40,000 ఇంజిన్లుగా ఉంది. గుజ‌రాత్ స‌నంద్ ప్లాంట్ వార్షిక సామ‌ర్థ్యం 2,40,000 వాహ‌నాలు, 2,70,000 ఇంజ‌న్లు ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌దు. ఈ నేప‌థ్యంలో బ‌డా కంపెనీల‌కు ఇది మంచి అవ‌కాశంగా ఉంది. ఎందుకంటే ఒక కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసి ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం, అధిక పెట్టుబ‌డి పెట్ట‌డానికి క‌నీసం రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంది.

  UGC NET 2021 : యూజీసీ నెట్ మ‌ళ్లీ వాయిదా.. త్వ‌ర‌లో కొత్త తేదీలు ప్ర‌క‌టించే అవ‌కాశం


  భూ సేక‌ర‌ణ అంశం కూడా పెద్ద స‌మ‌స్య‌గా ఉన్న ఈ రోజుల్లో కొత్త ప్లాంట్ (Plant) ఏర్పాటు స‌వాలే. అదే ఫోర్డ్ ప్లాంట్ కొంటే నేరుగా ఉత్ప‌త్తి ప్రారంభించ‌డం వ‌ల్ల స‌మ‌యం, ఖర్చు ఆదా అవుతాయిన కంపెనీలు భావిస్తున్నాయి.

  ఫోర్డ్ ఎందుకు వైదొలుగుతోంది?

  గత దశాబ్దంలో ఫోర్డ్ సుమారు $ 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది. ఫోర్డ్​ వాహనాలకు డిమాండ్ గణనీయంగా తగ్గడం, ఫోర్డ్ సనంద్ ప్లాంట్ నిర్వహనా ఖర్చులు పెరగడంతో ఇక భారత్​ నుంచి వైదొలగాని నిర్ణయించినట్లు ఫోర్డ్​ ప్రెసిడెంట్, సీఈఓ జిమ్ ఫార్లే చెప్పారు. ఫోర్డ్ తాజా నిర్ణయం ప్రకారం, 2021 నాల్గవ త్రైమాసికం నాటికి సనంద్ ప్లాంట్ ఉత్పత్తి మూసివేస్తుంది. ఇక, 2022 రెండవ త్రైమాసికానికి తమిళనాడు ప్లాంట్​ను షట్​డౌన్​ చేయనుంది. దీంతో, 23 సంవత్సరాల తరువాత ఫోర్డ్ ఇండియా కథ ముగియనుంది.

  ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు..

  త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తో టాటా మోటార్స్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో అంద‌రి దృష్టి టాటాల‌పై ప‌డింది. అయితే ఈ వార్త‌ల‌ను ఫోర్డ్ యాజ‌మాన్యం ఖండించింది. అంతే కాకుండా ఫోర్డ్ యాజ‌మాన్యంతో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎవ‌రు కొంటారో అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: KIA Motors, Mahindra and mahindra, Tata Group, Tata Motors

  ఉత్తమ కథలు