హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Motors: టాటా మోటార్స్ లో ఈ మోడల్ కార్లపై రూ.60,000 వరకు తగ్గింపు, ఆఫర్ ముగుస్తోంది, త్వరపడండి...

Tata Motors: టాటా మోటార్స్ లో ఈ మోడల్ కార్లపై రూ.60,000 వరకు తగ్గింపు, ఆఫర్ ముగుస్తోంది, త్వరపడండి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల భారత మార్కెట్‌లో అమ్మకాలలో చాలా విజయాలు సాధించింది. గత కొన్ని నెలలుగా టాటా కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కంపెనీ తన కార్లపై ఎప్పటికప్పుడు భారీ డిస్కౌంట్లు , అదనపు ప్రయోజనాలను అందిస్తూనే ఉంది.

ఇంకా చదవండి ...

టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల భారత మార్కెట్‌లో అమ్మకాలలో చాలా విజయాలు సాధించింది. గత కొన్ని నెలలుగా టాటా కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కంపెనీ తన కార్లపై ఎప్పటికప్పుడు భారీ డిస్కౌంట్లు , అదనపు ప్రయోజనాలను అందిస్తూనే ఉంది. డిసెంబర్ 2021లో, హ్యుందాయ్‌ను అధిగమించి రెండవ అత్యధికంగా అమ్ముడైన కార్ కంపెనీగా అవతరించింది. అలాగే, నెలవారీ యూనిట్ డిస్పాచ్‌ల పరంగా టాటాకు జనవరి 2022 అత్యుత్తమ నెల. విక్రయాల ఊపును కొనసాగించేందుకు, దేశీయ కార్ల తయారీ సంస్థ ఈ నెలలో కొన్ని వాహనాలపై కొన్ని ఆకర్షణీయమైన తగ్గింపులు, డీల్‌లను అందిస్తోంది. Tata Harrier, Safari, Tiago, Tigor, Nexon ఈ జాబితాలో చేర్చబడ్డాయి. ఈ అన్ని కార్లపై కంపెనీ రూ.60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో చాలా చౌకగా కొత్త టాటా కారును మీ ఇంటికి తెచ్చుకోవచ్చు.

టాటా హారియర్ (Tata Harrier)

టాటా హారియర్ (Tata Harrier) పెద్ద , సౌకర్యవంతమైన క్యాబిన్‌తో వస్తుంది. ఇది మధ్య తరహా SUV. 2021 మోడల్‌పై కొనుగోలుదారులు రూ. 60,000 వరకు తగ్గింపులను పొందవచ్చు, ఇందులో రూ. 20,000 వరకు నగదు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డార్క్ ఎడిషన్ ట్రిమ్‌లు రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ కొనుగోలుదారులు SUVపై రూ. 25,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

టాటా సఫారి (Tata Safari)

టాటా సఫారీ సంస్థ , ఫ్లాగ్‌షిప్ SUV. ఈ మాన్యువల్ , ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండు వేరియంట్లలో వస్తుంది. 2021 మోడల్ ఇయర్ సఫారిలో, రూ. 60,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి, అయితే 2022 మోడల్ కేవలం రూ. 40,000 వరకు మాత్రమే ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనాలతో అందించబడుతోంది.

టాటా టియాగో  (Tata Tiago)

టాటా టియాగో  (Tata Tiago)  కంపెనీకి చెందిన చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు. హ్యాచ్‌బ్యాక్ ఏకైక 86hp, 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది, అయితే కొనుగోలుదారులు ఇప్పుడు ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్‌ను కూడా పొందగలరు. హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 10,000 వరకు నగదు ప్రయోజనం ఇవ్వవచ్చు, అయితే ఇటీవల విడుదల చేసిన CNG వేరియంట్‌పై, వేరియంట్‌ను బట్టి రూ. 20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ కొనుగోలుదారులు హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 5,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

టాటా టిగోర్ (Tata Tigor)

టాటా టిగోర్  (Tata Tigor) కంపెనీకి చెందిన సెడాన్ కారు. ఇది నాలుగు-డోర్ల కూపే రూపానికి ప్రసిద్ధి చెందింది. Tiago వలె, కొనుగోలుదారులు ఒకే పెట్రోల్ ఇంజిన్ ఎంపికను మాత్రమే పొందుతారు. కానీ, ఇప్పుడు ఫ్యాక్టరీకి అమర్చిన CNG కిట్ ఎంపిక కూడా కారుకు వచ్చింది. కొనుగోలుదారులు అన్ని CNG వేరియంట్‌లు మినహా కాంపాక్ట్ సెడాన్‌పై రూ. 25,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

టాటా నెక్సాన్ (Tata Nixon)

టాటా నెక్సాన్ (Tata Nixon) దాని ప్రత్యేకమైన రూపానికి , డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. టర్బో-పెట్రోల్ , డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. మాన్యువల్ , AMT గేర్‌బాక్స్ వేరియంట్‌లలో వస్తుంది. Nexon పెట్రోల్ వేరియంట్‌లపై ఎటువంటి ప్రయోజనాలు అందించబడనప్పటికీ, డీజిల్ మోడల్‌లు రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ కొనుగోలుదారులు కాంపాక్ట్ SUVపై రూ. 10,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

టాటా ఆల్ట్రోజ్ కంపెనీ నుండి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు, ఇది రూ. 10,000 వరకు మాత్రమే కార్పొరేట్ ప్రయోజనాలను పొందుతోంది. దీనిపై ఎలాంటి క్యాష్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇవ్వడం లేదు.

First published:

Tags: Cars, New cars, Tata Group, Tata Motors

ఉత్తమ కథలు