Home /News /business /

TATA GROUP UPI PAYMENT APP COMING SOON FROM TATA OPPORTUNITY TO FACE STIFF COMPETITION FROM PHONEPAY AND GOOGLEPAY PLATFORMS GH VB

Tata Group: ఫోన్​పే, గూగుల్​ పేకు గట్టి పోటీనిచ్చే పేమెంట్ యాప్.. త్వరలోనే టాటా నుంచి.. ఆ వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

టాటా గ్రూపు సాల్ట్ నుంచి స్టీల్ వరకు అనేక రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే,​ అతి త్వరలోనే డిజిటల్ పేమెంట్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇందుకు అనుగుణంగా సరికొత్త యూపీఐ పేమెంట్స్ యాప్​ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం భారత్​లో డిజిటల్ పేమెంట్ల(Digital Payments) హవా నడుస్తోంది. ప్రజలు ప్రత్యక్ష నగదు బదిలీ కంటే ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్లకే(Online Transactions) ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అందుకే, భారత్​లో గూగుల్​ పే(Google Pay), ఫోన్​ పే, అమెజాన్​ పే(Amazon Pay), వాట్సాప్​ పే, పేటీఎం(Paytm) వంటి డిజిటల్​ పేమెంట్ యాప్​లు హవా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు, వీటికి గట్టి పోటీనిచ్చేందేకు టాటా గ్రూపు సిద్దమవుతోంది. ప్రస్తుతం, టాటా గ్రూపు సాల్ట్ నుంచి స్టీల్ వరకు అనేక రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే,​ అతి త్వరలోనే డిజిటల్ పేమెంట్(Digital Payment) రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇందుకు అనుగుణంగా సరికొత్త యూపీఐ పేమెంట్స్ యాప్​ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే, థర్డ్​ పార్టీ పేమెంట్స్​ సర్వీస్​ ప్రొవైడర్​ కేటగిరీ కింద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (NPCI) క్లియరెన్స్​ పొందినట్లు సమాచారం.

Jobs in Hyderabad: డిగ్రీ అర్హతతో రూ.50,000 వేతనం.. ద‌ర‌ఖాస్తుకు రెండురోజే చాన్స్‌

‘టాటా డిజిటల్(Tata Digital)​’ తమ యూపీఐ చెల్లింపులను శక్తివంతం చేయడానికి ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరో ప్రైవేటు బ్యాంకును, అదనపు బ్యాంకింగ్ భాగస్వామిగా తీసుకొనేందుకు చర్యలు జరుపుతోంది. థర్డ్ పార్టీ యాప్స్ యూపీఐ పేమెంట్స్​ సేవలు అందించాలంటే బ్యాంకులతో ఒప్పందం చేసుకోవడం చాలా ముఖ్యం. అమెజాన్​పే, వాట్సాప్​ పే, ఫోన్​పే, గూగుల్ పే కూడా భారతదేశంలో తమ స్వంత యూపీఐ ఆధారిత చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌లను అందించడానికి వివిధ బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

ఐపీఎల్ సీజన్​లో విస్తృతంగా ప్రచారం..

ప్రస్తుతం, భారత యూపీఐ ట్రాన్సాక్షన్లలో ఫోన్​పే, గూగుల్ పే అగ్ర స్థానంలో ఉన్నాయి. భారతీయ వినియోగదారులు ఎక్కువ శాతం ఈ రెండు యాప్​లనే ఉపయోగిస్తున్నారు. NCPI డేటా ప్రకారం, కేవలం ఈ రెండు యాప్స్​ ఒక్క ఫిబ్రవరి నెలలోనే 4.52 బిలియన్ యూపీఐ టాన్సాక్షన్లను జరిపాయి. అయితే, వీటికి పోటీగా అమెజాన్ పే, పేటీఎం, వాట్సాపే కూడా రాణిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీటికి కూడా ఆదరణ పెరిగింది.

కాగా, టాటా యూపీఐ పే వస్తే పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఈ యాప్ వచ్చే నెలలో మార్కెట్​లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ‘టాటా న్యూ సూపర్’ యాప్​ పేరుతో మార్కెట్లోకి తీసకురానుంది. ఈ యాప్​కు రాబోయే ఐపీఎల్ సీజన్​లో దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించాలని కంపెనీ యోచిస్తోంది. టాటా గ్రూప్​ కూడా డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా యూపీఐ పేమెంట్ యాప్​ సర్వీసుల్లో మరింత పోటీ ఏర్పడనుంది.
Published by:Veera Babu
First published:

Tags: BHIM UPI, Online service, Paytm, PhonePe, UPI, Upi payments

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు