ప్రముఖ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసి గతంలో వార్తల్లో నిలిచిన టాటా (Tata) గ్రూప్ ఇప్పుడు మరో పెద్ద డీల్‌కు రెడీ అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రముఖ ప్యాక్డ్ వాటర్ కంపెనీ బిస్లెరీ (Bisleri) ఇంటర్నేషనల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఏడు వేల కోట్ల రూపాయలకు ఈ డీల్ జరగనున్నట్లు బిస్లెరీ చైర్మన్ రమేష్ చౌహాన్ తెలిపినట్లు నివేదిక వెల్లడించింది. ఈ వార్తలతో ఈ రోజు నిఫ్టీలో 50 స్టాక్‌లలో టాటా కన్స్యూమర్ టాప్ గెయినర్‌గా ఉంది. ప్రారంభ ట్రేడ్‌లోనే 2.5% పెరిగింది. అయితే ఈ విషయంపై రెండు సంస్థలూ క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.
ఈ డీల్ గనక ఓకే అయిపోతే టాటా గ్రూప్ వీటిని FMCG లిస్టులో చేర్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఆర్మ్ కింద చేరుస్తుంది. ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ సెగ్మెంట్లో ఇది చాలా కీలకమైన ప్రక్రియ అనే చెప్పాలి. మామూలుగా టాటా గ్రూప్ కన్జ్యూమర్ బేస్డ్‌గా ఉండే తన వ్యాపారాలన్నింటినీ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL) కింద నిర్వహిస్తుంది. దీని కింద ఇప్పటికే కొన్ని ప్యాక్డ్ మినరల్ వాటర్ బ్రాండ్లు ఉన్నాయి. అందులో హిమాలయన్ బ్రాండ్ ఒకటి. హైడ్రేషన్ విభాగంలో టాటా కాపర్ ప్లస్, టాటా గ్లూకో వంటి బ్రాండ్‌లతో విక్రయాలు జరుగుతున్నాయి.
LIC New Plans: ఎల్ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు... బెనిఫిట్స్ ఇవే
ప్రజల్లో మంచి నీరు తాగడం, హెల్త్, హైజీన్‌లపై అవగాహన బాగా పెరిగిందని ప్రముఖ మార్కెట్ రీసెర్చ్, అడ్వైజరీ TechSci ఓ నివేదికలో తెలియజేసింది. వాటర్ బాటిళ్లకు వినియోగదారుల నుండి ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని పేర్కొంది. మార్కెట్‌లో దొరికే సాధారణ మంచి నీళ్ల కంటే ఈ ప్యాక్డ్ బాటిల్స్‌లో నీరు ఎక్కువ హైజీనిక్‌గా ఉంటుందని, వీటితో పోలిస్తే బయట మామూలు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాన్ని అంతా గ్రహించారని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో భారతీయ వాటర్ బాటిల్ మార్కెట్ విలువ సుమారు రూ.19,315 కోట్లుగా ఉంది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 13.25శాతంగా ఉంది. దీంతో ఈ రంగంలో ఆదాయం అంతకంతకూ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Online Shopping: ఇ-కామర్స్ సైట్లకు రేపటి నుంచి కొత్త రూల్స్
ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలన్నీ తమ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మన దేశంలో కోకా కోలా సంస్థ కిన్లే పేరుతో ప్యాక్డ్ వాటర్ బాటిల్‌లను తీసుకొచ్చింది. అలాగే పెప్సీకో ఆక్వాఫినా, పార్లే ఆగ్రో బెయిలీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్ నీర్ పేర్లతో మార్కెట్‌లో ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ విక్రయాలు జరుపుతున్నాయి. అయితే వీటన్నింటితో పోటీపడుతూ ప్రస్తుతం బిస్లెరీ మార్కెట్ లీడర్‌గా అగ్రస్థానంలో ఉంది. ఇలాంటి ప్రముఖ సంస్థను సొంతం చేసుకోవడం ద్వారా టాటా తన FMCG కేటగిరీని క్రియాశీలకంగా చేసుకోబోతోందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tata Group