హోమ్ /వార్తలు /బిజినెస్ /

Apple Stores: స్మాల్ యాపిల్ స్టోర్స్‌ ఓపెన్ చేయనున్న టాటా గ్రూప్.. త్వరలోనే 100 ఔట్‌లెట్స్ ప్రారంభం?

Apple Stores: స్మాల్ యాపిల్ స్టోర్స్‌ ఓపెన్ చేయనున్న టాటా గ్రూప్.. త్వరలోనే 100 ఔట్‌లెట్స్ ప్రారంభం?

iPhone 14 Plus: భారత్ లో రేపే ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలివే..

iPhone 14 Plus: భారత్ లో రేపే ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలివే..

అమెరికాకు చెందిన యాపిల్‌ కంపెనీ ఇండియాపై దృష్టి సారించింది. ఇండియాలో ఐఫోన్‌ల ప్రొడక్షన్‌ మరింత పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా సేల్స్‌ పెంచుకునేందుకు ఇండియాలో పెద్ద ఎత్తున ఔట్‌లెట్స్‌ ఓపెన్‌ చేయనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Apple Stores: అమెరికాకు చెందిన యాపిల్‌ కంపెనీ(Apple company) ఇండియాపై దృష్టి సారించింది. ఇండియాలో ఐఫోన్‌ల ప్రొడక్షన్‌ మరింత పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా సేల్స్‌ పెంచుకునేందుకు ఇండియాలో పెద్ద ఎత్తున ఔట్‌లెట్స్‌(Apple outlets in india) ఓపెన్‌ చేయనుంది. అందుకు సంబంధించి టాటా యాజమాన్యంలోని ఇన్ఫినిటీ రిటైల్‌తో యాపిల్ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మాల్స్, హై-స్ట్రీట్ వంటి రద్దీ ఏరియాల్లో 500 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 100 ఔట్‌లెట్స్‌ను టాటా గ్రూప్(Tata Group) దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభించబోతుంది. కాగా ఇన్పినిటీ రిటైల్ ఇప్పటికే క్రోమా స్టోర్స్‌ను దేశవ్యాప్తంగా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

చర్చలు ప్రారంభం

ఔట్‌లెట్స్ కోసం టాటా గ్రూప్ ఇప్పటికే ప్రీమియం మాల్స్, హై స్ట్రీట్స్‌తో చర్చలు ప్రారంభించినట్లు పలు మీడియా రిపోర్ట్స్ వెల్లడించాయి. లీజ్ నిబంధనల్లో భాగంగా రెండు కంపెనీలు తమ బ్రాండ్స్, స్టోర్లను ఔట్‌లెట్స్ సమీపంలో ఓపెన్ చేయకూడదు.

ముంబైలో తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌

టాటా- యాపిల్ పార్టనర్‌షిప్‌ ద్వారా యాపిల్ కంపెనీ యాజమాన్యంలో మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ మార్చి త్రైమాసికంలో ముంబైలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే Apple ప్రీమియం రీసెల్లర్స్ ఔట్‌లెట్స్, యాపిల్ అథరైజ్డ్ రీసెల్లర్ కంటే చాలా పెద్దగా ఉంటాయి. ప్రీమియం యాపిల్ ఔట్‌లెట్స్ మ్యాక్‌బుక్స్‌తో సహా మొత్తం యాపిల్ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 160 యాపిల్ ప్రీమియం రీసెలర్ స్టోర్స్ ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న స్మాల్ ఎక్స్‌క్లూజివ్ యాపిల్ స్టోర్లు ఎక్కువగా ఐఫోన్స్, ఐప్యాడ్స్, వాచ్‌లను మాత్రమే విక్రయిస్తాయి.

Gujarat CM : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం..హాజరైన మోదీ,షా

వచ్చే రెండేళ్లలో పెరగనున్న ఉత్పత్తి

సైబర్‌ మీడియా రీసెర్చ్(CMR) ప్రకారం.. జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్‌లో ఐఫోన్స్ అమ్మకాల విలువల 1.7 మిలియన్లకు పైగా ఉంది. దీంతో రాబోయే రోజుల్లో భారత్‌లో ఐఫోన్స్ అమ్మకాలను మరింతగా పెంచడం, అలాగే వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడంపై యాపిల్ దృష్టి సారించనుంది. భారత్‌లో ఐఫోన్ తయారీ యూనిట్స్ విస్ట్రోన్, ఫాక్స్కాన్, పెగాట్రాన్ వంటి వాటిల్లో వచ్చే రెండేళ్లలో ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుకోవాలని యాపిల్ భావిస్తోంది. తద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసి ప్రయోజనం పొందాలని యాపిల్ కంపెనీ భావిస్తున్నట్లు ఇండస్ట్రీకి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్ మధ్య కాలంలో యాపిల్ కంపెనీ భారత్‌లోని మూడు తయారీ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసిన ఐఫోన్లకు సంబంధించి 2.2 బిలియన్ల డాలర్ల విలువైన డివైజ్‌లను ఎగుమతి చేసింది.

First published:

Tags: Apple store, Tata Group

ఉత్తమ కథలు