హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Group: టాటా కొత్త బిజినెస్..ఇండియాలో ఐఫోన్ అసెంబుల్ ప్లాంట్..కొత్త డీల్ వివరాలివే

Tata Group: టాటా కొత్త బిజినెస్..ఇండియాలో ఐఫోన్ అసెంబుల్ ప్లాంట్..కొత్త డీల్ వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం)

ప్రతీకాత్మక చిత్రం)

ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచేందుకు టాటా గ్రూప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఐఫోన్లను తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కార్ప్‌ (Wistron Corp) అనే సంస్థ తయారు చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Tata Group :  ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిని (iPhones Production) పెంచేందుకు టాటా గ్రూప్ (Tata Group) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఐఫోన్లను తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కార్ప్‌ (Wistron Corp) అనే సంస్థ తయారు చేస్తోంది. అయితే ఐఫోన్లను ఇండియాలో అసెంబుల్ (Assemble) చేసేందుకు టాటా గ్రూపు విస్ట్రాన్ కార్ప్‌తో చర్చలు జరుపుతోందని తాజా రిపోర్ట్ తెలిపింది. మోస్ట్ పాపులర్ మొబైల్స్ అయిన ఐఫోన్స్‌ను యాపిల్ చైనాలో ఎక్కువగా అసెంబుల్ చేయిస్తోంది. అక్కడ లేబర్ ఖర్చులు తక్కువ కావడమే అందుకు కారణం. అయితే ఇకపై భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అసెంబుల్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టాటా గ్రూపు అసెంబ్లీ ప్లాంట్ సెటప్ చేయడానికి రెడీ అయింది.

బ్లూమ్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఐఫోన్లను అసెంబుల్ చేయడానికి భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను స్థాపించాలని టాటా గ్రూప్ యోచిస్తోంది. ఈ మేరకు ప్రొడక్షన్ డెవలప్‌మెంట్, సప్లై చైన్, అసెంబుల్ ప్రక్రియలో విస్ట్రాన్ కార్ప్‌ నుంచి నైపుణ్యాలు నేర్చుకోవడానికి టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ టాటా గ్రూప్ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే యాపిల్ చైనాలో కాకుండా ఇండియాలోనే పెద్ద ఎత్తున ఐఫోన్లను ఉత్పత్తి చేయడం కుదురుతుంది.

పెరగనున్న ఉత్పత్తి

వాస్తవానికి, కరోనాతో పాటు అమెరికా - చైనా దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా యాపిల్ తన ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను చైనా నుంచి వేరే దేశాలకు బదిలీ చేయాలని గతంలోనే నిర్ణయించింది. అంతకు ముందు నుంచే ఇండియాలో తయారీ యూనిట్స్ ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీని మొదలు పెడితే భారతదేశంలో ఐఫోన్ ప్రొడక్షన్‌ను వేగవంతం చేయడంలో యాపిల్‌కి బాగా హెల్ప్ అవుతుంది.

Billionaire : అప్పు చేసి ఆ షేర్లు కొన్న 20 ఏళ్ల విద్యార్థి..కేవలం నెల రోజుల్లోనే 600 కోట్లు లాభం పొందాడు

 టాటా గ్రూప్ ప్రాణాళికలు

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, టాటా గ్రూప్ విస్ట్రాన్ కార్ప్‌ ఇండియా ఆపరేషన్స్‌లో ఈక్విటీని కొనుగోలు చేయనుంది. ఆ తర్వాత ఇండియాలో కొత్త అసెంబ్లీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా నిపుణుల ప్రకారం, ఇండియాలో ఐఫోన్లను తయారు చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ మోడళ్లు ఇండియాతో పాటు ప్రపంచదేశాలకు సప్లై చేయాల్సి ఉంటాయి. అందువల్ల క్వాలిటీ కంట్రోల్, ఇతర విషయాల్లో ఇండియన్ తయారీ కంపెనీలు చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. టాటా గ్రూప్‌కి ఆ పర్ఫెక్షన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

ప్రస్తుతం టాటా గ్రూప్, విస్ట్రాన్ కార్ప్‌ ఇండియా మధ్య ఐఫోన్ల తయారీ ప్లాంట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయనే విషయం యాపిల్‌కి తెలుసా లేదా అనే దానిపై స్పష్టత లేదు. విస్ట్రాన్, Foxconn, పెగాట్రాన్ వంటి తైవానీస్ సరఫరాదారులు యాపిల్ ప్రొడక్ట్స్‌ను ఎక్కువగా తయారు చేస్తుంటాయి. అయితే, చైనాలోని పెగాట్రాన్ ప్రొడక్షన్ యూనిట్‌ను యాపిల్ కొంతకాలం క్రితమే నిలిపివేసింది. దాంతో పెగాట్రాన్ ఇండియాలో ఐఫోన్ మోడళ్లను తయారు చేయడం ప్రారంభించింది. ఈ 3 సప్లయర్లు భారతదేశంలో ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడల్స్‌ను తయారుచేస్తున్నా.. ఇవన్నీ విదేశీ కంపెనీలే అని గమనించాలి. అయితే ఇప్పుడు టాటా-విస్ట్రాన్ మధ్య డీల్ కుదిరితే, టాటా గ్రూప్ ఐఫోన్లు తయారుచేసే తొలి భారతీయ కంపెనీగా అవతరిస్తుంది.

First published:

Tags: Iphone, Tata Group

ఉత్తమ కథలు