టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సాఫ్ట్వేర్ కంపెనీ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోని 46 దేశాల్లో 250 కంటే ఎక్కువ కార్యాలయాలతో టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ సేవలు అందిస్తోంది. వినియోగదారులను ఆకర్షించడంలో, డొమైన్ డెప్త్, ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ సేవలు అందించడంలో టీసీఎస్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. అయితే పెట్టుబడిదారుల సంపదను పెంచడంలో కూడా టీసీఎస్ కంపెనీ మంచి పేరు సంపాదించింది. పది సంవత్సరాల కిందట టీసీఎస్ (TCS) కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, నేడు అది రూ.6.32 లక్షలకు పెరిగింది. అంటే పదేళ్లలో 532 శాతం రాబడి వచ్చినట్టు లెక్క. నిఫ్టీ 50లో టీసీఎస్ కంపెనీ 266.1 శాతం రాబడిని అందించింది.
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో టీసీఎస్ కంపెనీ లిస్టయినప్పటి నుంచి స్టాక్ నిలకడగా రాబడినిచ్చింది. 2004లో స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి టీసీఎస్ షేర్ల ధర 2689.7శాతం పెరిగింది. నిఫ్టీ 50లో 991.3 శాతం రాబడినిచ్చింది. టీసీఎస్ కంపెనీ షేర్లను చాలామంది ఇన్ఫోసిస్ (INFOSYS) కంపెనీ షేర్లతో పోల్చి చూస్తుంటారు. అయితే గడచిన పదేళ్ల కాలంలో టీసీఎస్ షేర్లు 532 శాతం పెరగ్గా, ఇన్ఫోసిస్ షేర్లు 409 శాతం రాబడినిచ్చాయి.
* టీసీఎస్ మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణాలు..
ఐటీ సేవల అవుట్సోర్సింగ్ వ్యాపారంలో టీసీఎస్ కంపెనీకి తిరుగులేదు. డిజిటల్ ఐటీ సేవల డిమాండ్‌ను సమర్థంగా అందిపుచ్చుకోవడంలో మిగతా పోటీదారుల కంటే టీసీఎస్ ముందుంటుంది. అందుకే పోటీదారులకంటే టీసీఎస్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఐటీ పరిశ్రమలో అత్యల్ప అట్రిషన్ రేటుతో మనదేశంలోనే టీసీఎస్ ముందుంది. ఇది కంపెనీకి అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తోంది. కరోనా మహమ్మారి వచ్చిన తరువాత అతి తక్కువ అట్రిషన్ రేటు కూడా కంపెనీ వృద్ధికి ఉపయోగపడింది. మరోవైపు ఇన్ఫోసిస్ కంపెనీలో అత్యధిక అట్రిషన్ రేటు ఉంది. అధిక ఆదాయం వచ్చే విభాగాల్లో 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో టీసీఎస్ 30 డీల్స్ సాధించగా, ఇన్ఫోసిస్ కేవలం 9 మాత్రమే సాధించగలిగింది. టీసీఎస్ కంపెనీ ఆర్థికంగా కూడా బలంగా ఉంది. డీల్స్ విజయవంతం చేయగల సామర్థ్యం, ఆదాయాలు పెంచుకోవడం, లాభాల మార్జిన్లలో కంపెనీ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. లాభాల మార్జిన్ల పరంగా చూసినా ఇన్ఫోసిస్ కన్నా టీసీఎస్ ముందంజలో ఉంది.
KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..
ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?
Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి
మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..
గత పదేళ్లలో టీసీఎస్ సంవత్సర వృద్ధి గరిష్ఠంగా 16 శాతం ఉండగా, కనిష్ఠంగా అది 13.8 శాతంగా నమోదైంది. కంపెనీ పదేళ్ల సగటు నికరలాభం 21.9 శాతంగా ఉంది. ఆర్థిక, రిటైల్, కమ్యూనికేషన్స్, తయారీ, లైఫ్ సైన్స్, హెల్త్‌కేర్ రంగాల కంపెనీలకు ఐటీ సేవలు అందించడం ద్వారా టీసీఎస్ మంచి రాబడిని ఆర్జిస్తోంది. టీసీఎస్ కంపెనీ షేర్ల పెరుగుదల వల్ల మాత్రమే కాకుండా డివిడెండ్ల ద్వారా కూడా పెట్టుబడిదారులు లాభపడుతున్నారు. గత పదేళ్లలో తన వాటాదారులకు డివిడెండ్లను స్థిరంగా అందించింది. టీసీఎస్ పదేళ్లలో ఒక్కో షేరుకు రూ.41.2 డివిడెండ్ చెల్లించింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: TCS