హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Car Discounts: టాటా మోటార్స్ ఆఫర్స్.. నెక్సాన్, హారియర్ వంటి కార్లపై భారీ డిస్కౌంట్స్.. వివరాలిలా..

Tata Car Discounts: టాటా మోటార్స్ ఆఫర్స్.. నెక్సాన్, హారియర్ వంటి కార్లపై భారీ డిస్కౌంట్స్.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పటికప్పుడు రికార్డు స్థాయిలో కార్లను విక్రయిస్తోంది. వాహనదారులు సరసమైన ధరల్లో దృఢమైన డిజైన్‌తో వచ్చే టాటా కార్లను భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.

దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పటికప్పుడు రికార్డు స్థాయిలో కార్లను విక్రయిస్తోంది. వాహనదారులు సరసమైన ధరల్లో దృఢమైన డిజైన్‌తో(Design) వచ్చే టాటా కార్లను(Tata Cars) భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో అమ్మకాల పరంగా టాటా మోటార్స్(Tata Motors) 2వ అతిపెద్ద ఆటోమేకర్‌గా(Auto Makers) అవతరించింది. మే నెలలో ఈ కంపెనీ ఏకంగా 43,340 యూనిట్లు విక్రయించింది. అయితే జూన్ నెలలో అంతకుమించి కార్లను అమ్మాలని కంపెనీ(Company) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా టాటా టియాగో (Tiago), టిగోర్ (Tigor), నెక్సాన్ (Nexon), హారియర్ (Harrier), సఫారీ (Safari)లపై రూ.45 వేల వరకు డిస్కౌంట్ల (Discounts)ను అందిస్తోంది.

అయితే టియాగో, టిగోర్ సీఎన్‌జీ వేరియంట్‌లు, పంచ్, ఆల్ట్రోజ్, టిగోర్, నెక్సాన్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లపై ఎలాంటి డిస్కౌంట్స్‌ను టాటా అందించడం లేదు. మరి టాటా కంపెనీ ఏ కార్లపై ఎంత మేర డిస్కౌంట్స్‌ ఆఫర్ చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

Best Cars: జూన్‌లో టాప్ కంపెనీల కార్లపై భారీ ఆఫర్లు.. టాటా, హోండా మోడళ్లపై డిస్కౌంట్లు ఇవే..


టాటా టియాగోపై డిస్కౌంట్ ఆఫర్లు

ఎంట్రీ లెవల్ కారు టియాగో జూన్ నెలలో రూ.10,000 డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ తగ్గింపు టియాగో XZ ట్రిమ్, అంతకంటే హయ్యర్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, కొనుగోలుదారులు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక టాటా టిగోర్ ఎక్స్‌జెడ్ ట్రిమ్‌, అంతకన్నా ఎక్కువ వేరియంట్లపై రూ. 10,000 డిస్కౌంట్ పొందొచ్చు. అయితే అన్ని ట్రిమ్‌లపై రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. అలానే కొనుగోలుపై రూ.3,000 కార్పొరేట్ బెనిఫిట్స్ దక్కించుకోవచ్చు.

టాటా హారియర్, టాటా సఫారిపై డిస్కౌంట్ ఆఫర్లు

మిడ్-సైజ్ ఎస్‌యూవీ టాటా హారియర్ కొనుగోలు చేసేవారు రూ.45,000 వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే ఈ ఎస్‌యూవీపై డిస్కౌంట్ ఆఫర్స్ ఏమీ లేవు కాకపోతే మీరు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌గా రూ.40 వేలు, కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో రూ.5 వేలు పొందడం ద్వారా కారు ధర రూ.45,000 తగ్గించుకోవచ్చు. టాటా సఫారీ త్రీ-రౌ ఎస్‌యూవీతో రూ. 40,000 వరకు విలువైన ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు.

టాటా నెక్సాన్ డిస్కౌంట్ ఆఫర్లు

టాటా మోటార్స్ తయారు చేసిన అన్ని కార్లలో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడవుతోంది. అయితే ఈ నెలలో టాటా నెక్సాన్ పెట్రోల్ ట్రిమ్‌లపై రూ. 3,000, డీజిల్ ట్రిమ్‌లపై రూ. 5,000 కార్పొరేట్ బెనిఫిట్స్ కంపెనీ ప్రకటించింది. అయితే టాటా నెక్సాన్‌పై క్యాష్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు లేవు అని గుర్తుంచుకోవాలి.

India Post: ఆ అకౌంట్ ఉన్నవారికి ఇండియా పోస్ట్ షాక్... వడ్డీ రేటు తగ్గింది

టాటా మోటార్స్ మే 2022 సేల్స్

టాటా మోటార్స్ ఇటీవల మే నెలకు సంబంధించి విక్రయాల గణాంకాలను ప్రకటించింది. ఆ గణాంకాల ప్రకారం, ప్యాసింజర్ వెహికల్ (PV) విభాగంలో టాటా మోటార్స్ మే 2022 నెలలో 185 శాతం వృద్ధిని నమోదు చేసింది. టాటా 2022 మే నెలలో మొత్తం 43,341 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్‌ను విక్రయించింది. మే 2021లో బ్రాండ్ 15,181 యూనిట్లు మాత్రమే విక్రయించింది.

టాటా ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాల తో సహా మొత్తం దేశీయ విక్రయాలు 74,755 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే 204 శాతం వృద్ధి నమోదైంది. సాధారణ ఫ్యూయల్‌తో నడిచే పీవీ సెగ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ రెండింటిలోనూ కంపెనీ వృద్ధిని నమోదు చేసింది.

First published:

Tags: Discounts, Nexon, Tata cars, Tata Motors, Triago

ఉత్తమ కథలు