ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ మ్యూచువల్ ఫండ్లలో రాబడి మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తూ క్రమపద్ధతిలో పెట్టుబడులు పెడితే మీ ఆదాయం రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. వీటి ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని ఆర్థిక నిపుణులు వెశ్లేషిస్తున్నారు. అయితే ఏ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయో అంచనా వేయగలిగినప్పటికీ.. కొంత మంది దగ్గర పెట్టుబడికి అస్సలు డబ్బు ఉండదు. అటువంటి వారికి లోన్లు ఇస్తామంటోంది టాటా క్యాపిటల్ లిమిటెడ్. ఇందుకు గాను తాజాగా ‘లోన్ ఎగెనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ (LAMF)’ పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రారంభించింది.
కస్టమర్లు వారి మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లపై రూ. 5 లక్షల నుంచి రూ .2 కోట్ల వరకు తక్షణమే రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది టాటా క్యాపిటల్. ఈక్విటీ, డెట్ ఫండ్లలో పెట్టుబడి కోసం ఈ డిజిటల్ లోన్ ఆఫర్ చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. మ్యూచువల్ ఫండ్ ఫోలియో, కాల వ్యవధి ఆధారంగా ఎంత రుణం ఇవ్వాలనేది కంపెనీ నిర్ణయిస్తుందని టాటా క్యాపిటల్ స్పష్టం చేసింది.
ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 2016 జూలై 31 నాటికి రూ .15.18 ట్రిలియన్లుగా ఉండగా.. అది 2021 జూలై 31 నాటికి రూ. 35.32 ట్రిలియన్లకు పెరిగింది. అంటే కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో 2 రెట్లు ఎక్కువ పెరుగుదల నమోదైంది. అందుకే, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు, వారి నిధుల కొతరను తీర్చేందుకు ఈ కొత్త స్కీమ్‌ను ప్రారంభించినట్లు టాటా క్యాపిటల్ పేర్కొంది. దీని ద్వారా పెట్టుబడిదారులు అనేక లాభాలు పొందవచ్చు. అవేంటో చూద్దాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.