హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stryder Zeeta: స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి వెళ్లొచ్చు!

Stryder Zeeta: స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి వెళ్లొచ్చు!

Stryder Zeeta: స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి వెళ్లొచ్చు!

Stryder Zeeta: స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి వెళ్లొచ్చు!

e-Bike | మీరు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఈ మోడల్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే దీని రేటు తక్కువ. ఫీచర్లు అదుర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Electric Vehicles | మీరు కొత్తగా ఎలక్టిక్ వెహికల్ కొనుగోలు చేయాలని ప్లాన్ వేస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం మార్కెట్‌లోకి కొత్త ఇబైక్ (EV) వచ్చింది. దీని ధర అందుబాటులో ఉంది. ఫీచర్లు అదిరిపోయాయి. స్ట్రైడర్ అనే కంపెనీ తాజాగా కొత్త ఇబైక్‌ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 31,999గా ఉంది. అయితే ఇప్పుడు 20 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంటే మీరు కేవలం రూ. 25,599కే ఈ కొత్త ఇబైక్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇది పరిమిత కాల ఆఫర్ (Offer).అందువల్ల కొనాలని భావించే వారు వెంటనే కొనేయవచ్చు.

స్ట్రైడర్ జీటా ఎలక్ట్రిక్ వెహికల్‌లో 26 వీ 250 డబ్ల్యూ బీఎల్‌డీసీ రియర్ హబ్ మోటార్ ఉంటుంది. స్మూత్, సైలెంట్ రైడ్ దీని ప్రత్యేకత. ఈ ఇబైక్‌లో ఇన్‌సైడ్ ఫ్రేమ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే కంట్రోలర్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ బ్యాటరీ ఫుల్ కావడానికి 3 గంటలు పడుతుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు వెళ్లొచ్చు.

భారీ శుభవార్త.. రూ.3,000 పతనమైన బంగారం ధర!

అలాగే ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లో ఆటో కట్ బ్రేక్స్ ఉంటాయి. అలగే కేవలం 10 పైసలుతో కిలోమీటర్ వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. కాగా కంపెనీ ఇప్పటికే వోల్టిక్ 1.7, ఈటీబీ100, వోల్టిక్ గో అనే మోడళ్లను అందిస్తోంది. ఇప్పుడు వీటిని అదనంగా జీటా ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. హెల్త్ అండ్ సస్టైనబిలిటీ లక్ష్యంగా అందుబాటు ధరలోనే కొత్త ట్రాన్స్‌పోర్టేషన్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చామని స్ట్రైడర్ బిజినెస్ హెడ్ రాహుల్ గుప్తా తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి మద్దుతుగా ఈ కొత్త మోడల్‌ను తెచ్చామని పేర్కొన్నారు. ఫిట్ ఇండియా మిషన్‌ లక్ష్యంగా దీన్ని ఆవిష్కరించామని తెలిపారు. ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ ద్వారా పర్యావరణ అనుకూల ట్రాన్స్‌పోర్టేషన్ వీలువుతుందని పేర్కొన్నారు.

డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కలిగిన వారికి కేంద్రం అదిరే శుభవార్త!

ఇకపోతే మార్కెట్‌లో ఇటీవలన ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లు కొనే వారు పెరుగుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఓలా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక ఎలక్ట్రిక కార్లలో టాటా మోటార్స్ దుమ్మురేపుతోంది. ఇంకా టీవీఎస్, బజాజ్, హీరో ఎలక్ట్రిక్ వంటి మోడళ్లు కూడా సూపర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్రకూటర్లను అందిస్తున్నాయి. అందువల్ల మీకు నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు. కాగా మీరు ఎలక్ట్రిక వెహికల్ కొనే టప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. బ్యాటరీ రిప్లేస్‌మెంట్ కాస్ట్ ఎంతనో చెక్ చేసుకోవాలా. లేదంటే జేబులు చిల్లులు పడతాయని గుర్తించుకోవాలి.

First published:

Tags: E bike, E scootor, Electric bike, Electric Car, Electric Scooter, Electric Vehicle, Electric Vehicles

ఉత్తమ కథలు