Tata Avinya EV: గ్రేటర్ నోయిడా వేదికగా ఇటీవల ఆటో ఎక్స్‌పో-2023(Auto Expo 2023) పూర్తయిన సంగతి తెలిసిందే. కార్ల తయారీ కంపెనీలు తమ అప్‌కమింగ్ మోడల్స్‌ను ఈ మెగా ఈవెంట్‌లో ప్రదర్శించాయి. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్(Tata Motors) కూడా ఆటోఎక్స్‌పోలో కొత్త వాహనాలను ఇంట్రడ్యూస్ చేసింది. వీటిల్లో టాటా అవిన్య ఈవీ(Tata Avinya EV) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీన్ని స్టైలిష్, సున్నితమైన MPVగా కంపెనీ ప్రొజెక్ట్ చేస్తోంది. ఈ గ్రౌండ్-అప్ ఎలక్ట్రిక్ కారు, ఔత్సాహికుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.
2025లో లాంచ్ అయ్యే అవకాశం
టాటా అవిన్య EV భారత మార్కెట్‌లో 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సంస్కృతంలో అవిన్య అంటే ఇన్నోవేషన్ అని అర్థం. ఈ కారు జెన్ 3 EV ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 30 నిమిషాలలోపు 500 కి.మీ రేంజ్‌ను అందించనున్నట్లు సమాచారం. Gen 3 ఆర్కిటెక్చర్ అనేది అవిన్య ఈవీకి ఫ్లస్ కానుందని టాటా మోటార్స్ విశ్వసిస్తోంది.
టూ-స్పోక్ స్టీరింగ్, ఇంటిగ్రేటెడ్ సెంట్ డిస్‌పెన్సర్స్
అవిన్య ఇంటీరియర్ డిజైన్ ప్లెయిన్ డాష్‌బోర్డ్ లేఅవుట్‌తో ఉంటుంది. అవిన్యలో టచ్‌స్క్రీన్స్ ఉండవు. టాటా తన భవిష్యత్ EVలను వాయిస్ కంట్రోల్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లేతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్, ఇంటిగ్రేటెడ్ సెంట్ డిస్‌పెన్సర్స్ వంటి న్యూ ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. టాటా అవిన్య EV సీట్స్ హెడ్‌రెస్ట్‌లో ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్ ఉంటాయి.
స్పోర్టీ లుక్
టాటా అవిన్య ఈవీ పూర్తిగా న్యూ స్టైలింగ్ లాంగ్వేజ్‌లో రెవల్యూషనరీ డిజైన్‌తో రానుంది. టాటా స్టేబుల్ నుంచి వచ్చే తదుపరి తరం ఎలక్ట్రిక్ వాహనాలు ఎలా ఉండబోతున్నాయనే దానికి అవిన్య EV అనేది ప్రివ్యూ లాంటిది అని చెప్పవచ్చు. T-ఆకారంతో టాటా లోగో ఉండే ముందు భాగంలో LED లైట్ బార్ ద్వారా ఎక్స్‌టీరియర్ పంక్చుయేట్ అయింది. సైడ్ ప్రొఫైల్‌లో ఎటువంటి మడతలు లేవు. సీతాకోకచిలుక ఆకారంలో డోర్స్ కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. దీంతో మొత్తంగా అవిన్య EV స్పోర్టీ లుక్‌లో కనిపిస్తుంది.
Best Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు అదుర్స్,ధర తక్కువే..3కి.మీ నడిపితే రూ.1 ఖర్చు మాత్రమే
మల్టీ టెక్నాలజీ-ఎయిడెడ్ ఫీచర్స్
టాటా మోటార్స్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్లలో అవిన్య ఒకటని చెప్పవచ్చు. ఈ ఈవీలో సౌకర్యవంతమైన క్యాబిన్, మల్టీ టెక్నాలజీ-ఎయిడెడ్ ఫీచర్స్ ద్వారా ప్రీమియం కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అందించడంపై కంపెనీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ Curvv కాన్సెప్ట్‌ను కూడా ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tata Motors