పాత బుల్లెట్ బైక్ ధరకే...కొత్త Tata Altroz కారు కొనండిలా...

ప్రతీకాత్మకచిత్రం

ఈ ఫెస్టివల్ సందర్బంగా టాటా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ Tata Altroz కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. Tata Altroz ఎక్స్‌ఎం + వేరియంట్‌ను రూ .6.60 లక్షల ధరతో కంపెనీ విడుదల చేసింది.

 • Share this:
  కొత్త కార్లు, బైకులను  కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అటు కంపెనీలు సైతం పలుఆఫర్లతో ముందుకు వస్తుంటాయి. ఇక ఈ ఫెస్టివల్ సందర్బంగా టాటా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ Tata Altroz కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. Tata Altroz ఎక్స్‌ఎం + వేరియంట్‌ను రూ .6.60 లక్షల ధరతో కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ Tata Altroz ఎక్స్‌ఎమ్ వేరియంట్ కంటే రూ.30,000 ఖరీదైనది.

  Tata Altroz అన్ని వేరియంట్ల ధర ఇవే...

  Tata Altroz యొక్క ఎంట్రీ లెవల్ ఎక్స్‌ఇ పెట్రోల్ వేరియంట్ ధర రూ .5.44 లక్షలు. డీజిల్ మోడల్‌ను రూ .6.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఎం పెట్రోల్ వేరియంట్ ధర రూ .6.30 లక్షలు, డీజిల్ మోడల్ రూ .7.50 లక్షలు. ఎక్స్‌టి వేరియంట్‌ను రూ .6.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. డీజిల్ మోడల్‌ను రూ .8.19 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌జెడ్ (ఓ) పెట్రోల్ వేరియంట్‌ను రూ .7.75 లక్షలకు, డీజిల్ మోడల్‌ను రూ .8.95 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. (పైన పేర్కొన్నవి ఎక్స్ షోరూం ధరలు)

  Tata Altroz 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఈ 2 ఇంజన్ ఆప్షన్లలో లభిస్తాయి. ఆల్ట్రోజ్ డీజిల్ బేస్ వేరియంట్‌ను మినహాయించి టాటా మోటార్స్ 2020 ఆగస్టులో ఆల్ట్రోజ్ లైనప్ ధరను రూ .16,000 కు పెంచింది. ఆల్ట్రోజ్ యొక్క డీజిల్ వేరియంట్ 1.5 లీటర్, 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 4,000 rpm వద్ద 89bhp శక్తిని మరియు 1,250-3,000rpm మధ్య 200Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

  Tata Altroz XE Petrol బేస్ మోడల్ ధర, ఈఎంఐ గురించి తెలుసుకోండి...

  Tata Altroz XE Petrol ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూం ప్రైస్ ₹ 5,44,000గా ఉంది. ఆన్ రోడ్ ధర విషయానికే వస్తే నగరాన్ని బట్టి మారుతుంది. కార్ వాలే వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం. ఆన్ రోడ్ ధర హైదరాబాద్ లో ₹ 6,44,368 పలికే అవకాశం ఉంది. ఇక ఫైనాన్స్ ప్రాతిపదికన ఈ కారు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం డౌన్ పేమెంట్ కింద మినిమం ₹ 1,00,368 చెల్లించాల్సి ఉంటుంది.  అలాగే 5 సంవత్సరాలకు గానూ మిగితా మొత్తం మీరు లోన్ పొందుతారు. ఈ రుణాన్ని సులభ వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు వడ్డీ రేటు 9.2 అనుకున్నట్లయితే. 5 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు కారు లోన్ పొందినట్లయితే ప్రతి నెల ఆఛఉ రూ.9,684 చెల్లించాల్సి ఉంటుంది.

  Tata Motors అరుదైన ఫీట్..

  టాటా మోటార్స్ ఇటీవల కొత్త ఫీట్ సాధించింది. సంస్థ ఇటీవల 40 లక్షల వాహనాలను సంఖ్యను దాటింది. టాటా మోటార్స్ తన మొదటి ప్యాసింజర్ వాహనాన్ని 1988 లో భారతదేశంలో విడుదల చేసింది. ఈ సంస్థ 32 సంవత్సరాలలో 4 మిలియన్లకు పైగా ప్రయాణీకుల వాహనాలను తయారు చేసింది.
  Published by:Krishna Adithya
  First published: