Tata Altroz: అదిరిపోయే లుక్​తో టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా..?

టాటా అల్ట్రోజ్ డార్క్ ఎడిషన్

నెక్సాన్​, నెక్సాన్ ఈవీ మోడళ్లకు కూడా డార్క్ ఎడిషన్లను తీసుకొచ్చింది టాటా మోటార్స్. స్టాండర్డ్ మోడల్స్ కన్నా దాదాపు రూ.45వేల వరకు అదనపు ధరతో ఇవి లాంచ్ అయ్యాయి

  • Share this:
సూపర్ హిట్టయిన టాటా ఆల్ట్రోజ్​ కారు మోడల్​లో డార్క్ ఎడిషన్​ వచ్చేసింది. అదిరిపోయే లుక్స్​తో టాటా దీన్ని విడుదల చేసింది. టాటా ఆల్ట్రోజ్ స్టాండర్డ్ మోడల్ కన్నా ఈ డార్క్​ ఎడిషన్ ధర దాదాపు రూ.30వేలు ఆధికంగా ఉంది. మార్పుల విషయానికొస్తే కారు బయట ఎక్స్​టీరియర్​ మొత్తం సరికొత్త కాస్మోస్​ బ్లాక్ పెయింట్​తో ఉంది. ఆల్ట్రోజ్​లో సాధారణంగా హ్యాచ్​బ్యాక్​, బూట్​పైనా నలుపు రంగు ఉంటుంది. ఈ విషయం ఈ డార్క్ ఎడిషన్​లో మిస్సయింది. అయితే ఫ్రంట్ బానెట్​పై డార్క్ బ్యాడ్జ్​తో టాటా ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. అలాగే బానెట్ చుట్టూ డార్క్ క్రోమ్ స్ట్రిప్​తో డిజైన్ చేసింది. 16 ఇంచుల అలాయ్ వీల్స్​ కూడా డార్క్ టింట్​ ఫినిష్​తో వస్తున్నాయి.. అలాగే ఫోర్​ స్పోక్​ డిజైన్​తో ఆకట్టుకుంటున్నాయి.

ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్​లో క్యాబిన్.. గ్రానైట్ బ్లాక్ థీమ్​తో ఉంది. అలాగే డాష్​బోర్డు రెండు పక్కల ఉండే ఎయిర్​కాన్ వెంట్స్ చుట్టూ, మెటాలిక్​ గ్లాస్ బ్లాక్ స్ల్పాషెస్​ ఉన్నాయి. బ్లాక్​ లెథర్ సీట్లు.. ట్రై యారో పర్ఫోర్షన్ ప్యాటర్న్​, సైడ్లలో బ్లూ స్టిచింగ్స్​తో రూపొందించారు. హెడ్​రెస్ట్​పై డార్క్ అనే ఎంబ్లమ్ ప్రత్యేకతను చాటుతోంది. లుక్​పరంగా ఈ మార్పులతో పాటు ఆల్ట్రోజ్​లోని అన్ని ఫీచర్లు ఈ డార్క్​ ఎడిషన్​లోనూ కొనసాగాయి. టచ్​స్ర్కీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టం బై హర్మన్, ఐఆర్​ఏ కనెక్టెడ్ కార్ టెక్​, సెవెన్-ఇంచ్ డిజిటల్ ఇన్​స్ట్రూమెంట్​ క్లస్టర్​, క్రూసర్ కంట్రోల్​, ఆటో హెడ్​ల్యాంప్స్​, రైన్ సెన్సింగ్ వైపర్లు, స్టీరింగ్ మౌటెంగ్ కంట్రోల్స్ అన్ని ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్​ డార్క్ ఎడిషన్ కూడా రెండు ఇంజిన్​ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ నాచురలీ ఆస్రైర్డ్​ ఇంజిన్​, 1.2 లీటర్​ టర్బో చార్జ్ ఇంజిన్ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఫైవ్ స్పీడ్ మ్యానువల్​ గేర్ బాక్స్​ అన్ని వేరియంట్లలో కామన్​గా ఉంది.

ధర విషయానికి వస్తే టాటా ఆల్ట్రోజ్ ఎస్​జెడ్​+ డార్క్ పెట్రోల్ వేరింట్​ రూ.8,70,900లుగా ఉంది. అదే టాటా ఆల్ట్రోజ్​ ఎక్స్​జెడ్+ డార్క్ ఐ-టర్బో రూ.9,35,900లుగా ఉంది.

అలాగే నెక్సాన్​, నెక్సాన్ ఈవీ మోడళ్లకు కూడా డార్క్ ఎడిషన్లను తీసుకొచ్చింది టాటా మోటార్స్. స్టాండర్డ్ మోడల్స్ కన్నా దాదాపు రూ.45వేల వరకు అదనపు ధరతో ఇవి లాంచ్ అయ్యాయి. అలాగే హారియర్​ డార్క్ ఎడిషన్​లో కూడా అప్​డేటెడ్ మోడల్ వచ్చింది. నెక్సాన్​ ఎక్స్​​జెడ్​+ డార్క్ ఎడిషన్ ధర రూ.10.40లక్షల నుంచి ప్రారంభం అవుతుండగా.. నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ రూ.15.99 లక్షల నుంచి ఉంది.
Published by:Shiva Kumar Addula
First published: