పెట్రోల్ ధర పెంపుతో రాష్ట్రాలకు రూ.22,700 కోట్ల లాభం

పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా అనుకోకుండా వచ్చిన లాభాలతో రాష్ట్రాల ఖజానాలు నిండుతున్నాయి. భారం మాత్రం సామాన్యుల పైనే.

news18-telugu
Updated: September 12, 2018, 12:55 PM IST
పెట్రోల్ ధర పెంపుతో రాష్ట్రాలకు రూ.22,700 కోట్ల లాభం
Illustration by Mir Suhail.
  • Share this:
ఓవైపు రూపాయి పతనం... ఇంకోవైపు పెట్రోల్ ధరల్లో పెరుగుదల... ఇవి కొన్ని రోజులుగా హాట్ టాపిక్. ఒకదానితో మరొకటి పోటీపడి మరీ ప్రభావం చూపిస్తున్నాయి. దీని వల్ల రాష్ట్రాలకు ఎంత లాభమో తెలుసా? అక్షరాలా రూ.22,700 కోట్లు. అవును... తాజా లెక్కలు ఇవే చెబుతున్నాయి.

రూపాయి బలహీనపడుతోంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 72.82. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఆయిల్ దిగుమతులపై మోయరాని భారం పడుతోంది. పెట్రోల్ ధరల పెంపుతో ఆ భారం సామాన్యులపైకి వెళ్తోంది. అయితే దీనివల్ల రాష్ట్రాల ఖజానా మాత్రం నిండుతోంది. రూపాయి పతనం, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల రాష్ట్రాల ఖజానాల్లోకి రూ.22,700 కోట్ల ఆదాయం లభించిందని అంచనా. ఇలాంటి లాభాలను విండ్ ఫాల్ గెయిన్(అనుకోకుండా వచ్చిన లాభాలు) అని అంటుంటారు. రాష్ట్రాలు చొరవ తీసుకుంటే ఈ మేరకు పెట్రోల్ ధరల్ని రూ.2-3 తగ్గించే అవకాశం ఉంటుంది.

క్రూడాయిల్ ఒక బ్యారెల్‌పై ఒక డాలర్ పెరిగితే... 19 ప్రధాన రాష్ట్రాలకు సగటున రూ.1,513 ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుత రూ.22,700 కోట్ల ఆదాయంలో మహారాష్ట్రకే రూ. 3,389 కోట్ల లాభం. కారణం 39.12% వ్యాట్ విధించడమే. రూ.2,842 కోట్ల లాభంతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. గత మార్చి నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌పై రూ.5.60, డీజిల్‌పై రూ.6.31 ధరలు పెరిగాయి. అయితే ఈ లాభాలు రాష్ట్ర ద్రవ్యలోటును 15-20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుంది.

అనుకోకుండా వచ్చిన లాభాలతో రాష్ట్రాల ఖజానాలు నిండుతున్నాయి కానీ... భారం మాత్రం సామాన్యుల పైనే. రూపాయి పతనం, పెట్రోల్ ధరల పెరుగుదల చాలవన్నట్టు స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. రెండు రోజుల్లో సెన్సెక్స్ 1000 పాయింట్లు పడిపోవడం మదుపరుల్ని నష్టాల్లో ముంచేసింది.ఇవి కూడా చదవండి:

Video: పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

రూపాయి పతనంతో మీ జేబుకు చిల్లేనా?

Video: పర్సనల్ లోన్... ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

 
First published: September 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు